Yatra 2 Teaser Release: యాత్ర 2(Yatra) సినిమా మహి వి రాఘవ(Mahi V Raghava) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా లో మలయాళ నటుడు మమ్ముట్టి (Mammootty), తమిళ నటుడు జీవా(Jeeva) ముఖ్య పాత్రలు పోషించారు.
యాత్ర 1 సినిమాలో వై.ఎస్ రాజశేఖర్ రెడ్డి(Ys Rajasekhar Reddy) పాత్రలో కనిపించిన మమ్ముట్టి అదే క్యారెక్టర్ లో సీక్వెల్ లో కూడా కనిపించనున్నారు.
ఇక జీవ వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి(Ys Jagan Mohan Reddy) పాత్రలో దర్శనమివ్వబోతున్నారు. 2019 ఆంధ్ర ప్రదేశ్(Andhra Pradesh) అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల ముందు విడుదలైన ఈ యాత్ర సినిమా వై.ఎస్.ఆర్ కాంగ్రెస్ పార్టీకి(YSR Congres Party) గొప్ప మైలేజ్ ను తెచ్చిపెట్టింది.
ఇక రెండవ పార్ట్ చుస్తే 2024 ఆంధ్ర ప్రదేశ్ ఎన్నికలు దగ్గరపడుతున్న సమయంలో విడుదలకు ముస్తాబు అవుతోంది, దీంతో ఈ సినిమా పై వైసీపీ శ్రేణుల్లో ఆతృతను పెంచేస్తోంది.
ఈ సినిమాలో జగన్ పాత్రను దర్శకుడు ఎలా తీర్చిదిద్దాడు, నటుడు జీవా ఎలా చేశాడు అన్నది వారిలో ఉత్సుకతను పెంచేస్తోంది. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించి చిత్ర బృందం టీజర్ ను విడుదల చేసింది.
ప్రస్తుతం ఈ టీజన్ నెట్టింట ట్రెండింగ్ గా మారింది. యూట్యూబ్ లో విడుదల చేసిన ఈ టీజర్ ను చూసేందుకు ఎక్కువ మంది ఆశక్తి కనబరుస్తున్నారు.
యాత్ర 2 లో చంద్రబాబు గా కనిపించేది ఎవరంటే – Who will be seen as Chandra Babu in Yatra 2 ?
ఈ సినిమా ను దర్శకుడు మహి ఏయే అంశాలను స్పృశించాడంటే, వై.ఎస్ ఆర్ మరణించడానికి ముందు క్లొన్ని అంశాలతోపాటు, ఆయన మరణం తరువాత చోటుచేసుకున్న రాజకీయ పరిణామాలు,
జగన్ మోహన్ రెడ్డి గడిపిన జైలు జీవితం, ఆతరువాత కాలంలో జగన్ చేపట్టిన పాదయాత్ర వంటి అంశాలతో పాటు జగన్ సీఎం అవ్వడాన్ని కూడా చూపించినట్టు తెలుస్తోంది.
ఈ సినిమాను ఫిబ్రవరి 8 వ తేదీన విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఒక చిత్రమైన విషయం ఏమిటంటే యాత్ర మొదటి భాగాన్ని కూడా అదే ఫిబ్రవరి 8వ తేదీనే విడుదల చేశారు.
ఈ సినిమాను త్రీ ఆటమ్ లీవ్స్, వీ సెల్యూలాయిడ్, శివ మేక సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమా నుండి విడుదల చేసిన పోస్టర్లు, మేకింగ్ కి సంబంధించిన వీడియోలు విపరీతంగా ఆకట్టుకున్నాయి.
One man, a million odds, yet the promise had to be kept!#Yatra2Teaser on Jan 5th 👣#LegacyLivesOn #Yatra2 #Yatra2OnFeb8th @mammukka @JiivaOfficial @ShivaMeka @MahiVraghav @vcelluloidsoffl @KetakiNarayan @Music_Santhosh @madhie1 @suzannebernert @manjrekarmahesh #SelvaKumar… pic.twitter.com/PKY4idj9Dk
— Thyview (@Thyview) January 2, 2024
అయితే వై.ఎస్.ఆర్ పేరు జగన్ పేరు ప్రస్తావనకు వస్తే చంద్రబాబు(ChandraBabu) పేరు ప్రస్తావనకు రాకుండా ఉండదు,
వీరి బయోపిక్ తీస్తున్న సమయంలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబును ఎంత విలనీగా చూపిస్తే ఆ సినిమాకు అంత క్రేజ్ ఏర్పడుతుందని భావిస్తారు.
మరి ఈ సినిమాలో చంద్రబాబును ఎలా చూపించారు అన్న విషయం తెలియాలంటే వెయిట్ చేయక తప్పదు. ఇక చంద్రబాబు క్యారెక్టర్ ను
బాలీవుడ్ సీనియర్ నటుడు మహేష్ మంజ్రేకర్(Mahesh Manjrekar) పోషించగా సోనియా గాంధీ(Sonia Gandhi) పాత్రలో సుజన్నే బెర్నార్ట్(Sujanne Bernart),
వై.ఎస్ భారతి(Ys Bharati) పాత్రలో కేతకి నారాయణ్(Kethaki Narayanan) కనిపించనున్నారు. మరి ఈ సినిమా లో వై.ఎస్ విజయలక్ష్మి(Ys Vijayalakshmi) ఉందా ? ఉంటె ఆమె క్యారెక్టర్ ను ఎవరు పోట్రెట్ చేశారని తెలియాల్సి ఉంది.