ఎంత కష్ట పడిన సక్సెస్ అందుకోలేక పోతున్నార ! వెంటనే ఇలా చెయ్యండి !

website 6tvnews template 2024 03 22T145716.188 ఎంత కష్ట పడిన సక్సెస్ అందుకోలేక పోతున్నార ! వెంటనే ఇలా చెయ్యండి !

దానధర్మాలు చెయ్యడం అంటే మామూలు విషయం కాదు. దాన గుణాలు కలిగిన వ్యక్తి జీవించి ఉన్నంత కాలం సుఖ సౌఖ్యాలతో ఆనందం గా ఉంటాడు.మరణం అనంతరం మోక్షాన్ని పొందుతాడు.
మనకున్న ధనం లో కొంత ధనాన్ని దానధర్మాల కోసం వెచ్చించాలని పురాణాలలో చెప్పబడింది. ఆ దానం కుడా సక్రమం గా ఖర్చు చెయ్యాలని అది కుడా ఎలాంటి వారికి దానం చెయ్యాలో శాస్త్రాలలో ఉందని పండితులు చెబుతున్నారు, అది ఎవరికీ చెయ్యాలో చూసినట్లయితే పేద వారికీ , అవిటి వారికి, నిర్బాగ్యులకు, వితంతువులకు,వృద్ధులకు, అనారోగ్య సంసయలతో భాద పడే వారికి, అనారోగ్య సమస్యలతో భాదపడే చిన్న పిల్లలకు ఇలాంటి వారికి తమకు చేతనైన ఆర్ధిక సహాయం చెయ్యాలని ఇలా చేసినట్లయితే పుణ్య లోకాలు ప్రాప్తిస్తాయని పండితులు చెబుతున్నారు. అంతే కాదు ఆ పుణ్యం ఫలితం మీకు మీ కుటుంబ సభ్యులకు శాశ్వత ధన, దాన్య ,వస్తు,కనక ,వాహన సౌఖ్యం తో పాటు శుభాన్ని కలుగజేస్తుంది. ఇప్పుడు విజయం సాధించడానికి ఎలాంటి పరిహారాలు ఉన్నాయో తెలుసుకుందాం!

1.గోచార, గ్రహచార పరిస్థితి బావుండనపుడు అనేక సమస్యలతో నిత్యం ఎదో రకం గా భాద పడుతూ ఉంటాం. పరిష్కార మార్గం గా ఇలా చెయ్యండి, ప్రతి రోజు కాలకృత్యాల అనంతరం మీకు దగ్గర లో ఉన్న దేవాలయం లో రావి చెట్టు దగ్గర నువ్వుల నునే దీపం పెట్టి నెమ్మది గా నడుస్తూ 11 ప్రదక్షణలు చెయ్యాలి. మనసు ఇలా అనుకోవాలి ” ఓం నమో భగవతే వాసుదేవాయ ” ఇలా చెయ్యడం వల్ల తొందర లోనే కష్టాల నుండి విముక్తి లభిస్తుంది.

2.ఎటువంటి దోషాలనైన చిటికలో మాయం చేసేది గోమాత. ఈ గోమాతను వారం లో మీకు ఎన్ని సార్లు కుదిరితే అన్ని సార్లు పచ్చ గడ్డి గాని, కొద్దిగా బెల్లం తో కలిపినా బియ్యం పెట్టి 3 ప్రదక్షణలు చెయ్యండి. జరిగే అద్భుతాలను మీరే మీ కళ్ళతో వెంటనే చూస్తారు.

3.మీరు ఏ పని మీదైనా బయటకి వెళ్తున్నప్పుడు ఒక్కసారి మనసు లో ఇలా అనుకోండి ” ఓం శ్రీ గణేశాయ నమః ” ఇలా అనుకుంటూ గణపతి ఫోటో దగ్గర చిన్న బెల్లం పెట్టి అది ప్రసాదం గా తీసుకోండి. దీని వల్ల పని వియజం, శ్రేయస్సు కలుగుతాయి.

4.ఏ పనైనా సరే అందులో విజయం సాధించాలంటే కేవలం ఆదివారంనాడు రెండు చేతులు పైకి ఎత్తి సూర్యుడిని నమస్కరించండి. ఆరోజు మీరు మద్యం కాని మాంసాహారం కాని తీసుకోకండి. ఏదైనా ఒక కోరిక తీరాలంటే కొన్ని వదులుకోక తప్పదు. అలా సుర్యుడుకి నమస్కారం చెయ్యడం వల్ల మనలో ఆ సూర్యుని కాంతి కిరణాలు ప్రవేశించి మనకి ఆరోగ్యం తో పాటు మన కోరికలు కూడా తీరతాయని పండితులు చెప్తున్నారు

5.మనకి అన్నింటి లో మంచి జరగాలంటే ఎవరైనా ఆపద లో ఉంటె వారికి సహాయపడండి. వారి ఆశీస్సులు మీకు లభించి మీకు ఆరోజు ఏ పని అనుకున్నారో ఆ పని లో మీరు తప్పక విజయం సాధిస్తారు. అలాగే మీ ఇంటి ఆవరణలో ఉన్న మొక్కలకు నీరు పొయ్యండి. పశు పక్షాదులకు కాస్త బియ్యం పెట్టండి.

Disclaimer:

ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మీకు అందించడం జరిగింది. కచ్చితత్వానికి, విశ్వసనీయతకు ఎలాంటి హామీ 6Tv ఇవ్వడం లేదు. అలాగే ఏ విషయాన్నీ నిర్ధారించడంలేదు. మా ఉద్దేశం సమాచారం అందించడం వరకు మాత్రమే. ఏదైనా పాటించే ముందు లేదా సందేహాలు ఉన్న సంబంధిత నిపుణుల సలహా తీసుకోమని మనవి చేస్తున్నాం.

Leave a Comment