Sotheby Whisky : ఈ విస్కీ ధర తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..ఈ విస్కీ వయసు 97 ఏళ్ళు..
మందు బాబులు ఎప్పటికైనా తాగాలని అనుకునేది ఫారిన్ విస్కీ, దీని రుచి, రంగు అద్భుతం అని అంటుంటారు. ఫారిన్ విస్కీ కోసం వేల రూపాయలు ఖర్చు పెట్టడానికైనా వెనకాడరు. ఒక్కో సారి స్నేహితులు ఫారిన్ నుండి వస్తున్నారంటే ఒక ఫుల్ తీసుకురా రా అని సరదాగా అడిగేస్తుంటారు.
అయితే ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే విస్కీ మాత్రం ఆశా మాషి విస్కీ కాదు, ఫారిన్ విస్కీ నే కానీ అతి పురాతనమైన విస్కీ, ఏళ్ళకి ఏళ్ళు నిల్వ ఉంచిన విస్కీ.
మరి ఇన్నేళ్ల పాటు నిల్వ ఉంచితే ఆ విస్కీ ధర వేళల్లో కాదు, లక్షల్లో కాదు, కోట్లల్లో పలుకుతుంది. తాజాగా ఓ విస్కీ బాటిల్ 22 కోట్ల రూపాయలకు అమ్ముడైంది.
దీనిని వేలం పాటలో ఉంచిన సంస్థ పేరు సోథ్‌బీ. సదరు సంస్థ ఈ వేలంపాటను లండన్ లో నిర్వహించింది. ఈ వేలం పాటలో పాల్గొనదలచిన వారు నవంబర్ ఒకటవ తేదీనుండే బిడ్ వేయడం మొదలుపెట్టినట్టు తెలుస్తోంది. ఇది అలాంటి ఇలాంటి విస్కీ బాటిల్ అయితే కాదు ఇది 97 ఏళ్ల కిందట ఓ కంపెనీ
తయారుచేసిన విస్కీ. మెకలాన్ అనే కంపెనీ తయారు చేసిన సింగిల్ మాల్ట్ విస్కీ విస్కీ ఇది. ఈ సింగల్ మాల్ట్ విస్కీని 2.7 మిలియన్ డాలర్లకు సొంతం చేసుకున్నాడు ఒక వ్యక్తి. మన ఇండియన్ కరెన్సీ లో చుస్తే దీని ధర 22 కోట్ల రూపాయలు.
మెకలాన్ కంపెనీ తయారు చేసిన విస్కీ బాటిల్ ను 2019లో వేలం పాట వేయగా, అప్పుడు 1.5 మిలియన్ డాలర్లకు అమ్ముడు పోయిపొండి. అంటే ఆనాటి మన ఇండియాన్ కరెన్సీ 12 కోట్ల రూపాయలు.
కాగా ఈ 2023 నవంబర్ వేలం పాటలో కూడా 1.5 మిళియన్లకు అటు ఇటుగా ధర పలుకుతుందని అంతా భావించారు. కానీ ఈ విస్కీ బాటిల్ ఏకంగా 22 కోట్లకు వెళ్ళింది. అయినా ఈ విస్కీకి ఇంత క్రేజ్ ఎందుకు అనుకుంటున్నారా. మెకలాన్ కంపెనీ 1926లో ఈ విస్కీని తయారు చేసింది.
60 ఏళ్ల పాటు నిల్వ చేసిన ఈ విస్కీని 1986వ సంవత్సరంలో బాటిళ్లలోకి నింపింది. అయితే సదరు కంపెంనీ ఆ బాటిళ్లను అన్నిటిని అమ్మకానికో లేదంటే వేలం పాటకు పెట్టలేదు. కొన్నిటిని వారి రెగ్యులర్ కస్టమర్లకు కేటాయించింది.
ఇది ఎండిన పండ్ల నుంచి తయారుచేసిన విస్కీ అని చాలా ఘాటైనదని తెలుస్తోంది. ఈ విస్కీ యూరోపియన్ ఓక్‌లో 60 సంవత్సరాలు చీకట్లో గడిపిందట.
ఉత్తర స్కాట్‌లాండ్‌లోని మోరేలో ఉన్న మెకలాన్ 1986లో 263 బాటిళ్లలో ఈ విస్కీని ఉంచినట్లు నిర్ధారించినప్పటికీ ప్రస్తుతం 40 సీసాలు మాత్రమే ఉన్నాయట.
అసలు విస్కీ అంటే ఏంటి దానిని ఎలా తయారు చేస్తారు అనేది చూద్దాం..విస్కీ అనేది పులియబెట్టిన ధాన్యం గుజ్జును ఉపయోగించి తయారు చేసే ఒక డిస్టిల్డ్ మద్యపానీయం.
ఇది ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రజాదరణ పొందిన మద్యపానీయ రకాలలో ఒకటి, ఇది వివిధ రకాల మోడళ్లలో అందుబాటులో ఉంది. విస్కీ తయారీ ప్రక్రియలో, ధాన్యం గింజలను మొదట మిల్లింగ్ చేస్తారు, ఆతరువాత దానిని నీటిలో బాగా ఉడకబెడతారు.
అలా తయారు చేసిన పిండిని చక్కగా పులియబెడతారు. అలా పులియబెట్టే క్రమంలో అందులో ఈస్ట్ అనే పదార్ధాన్ని కలుపుతారు. ఈ పులియబెట్టడం అనే విధానం పూర్వర్తయ్యాక పిండిని డిస్టిల్ చేస్తారు.
ఇంతకీ డిస్టిల్లేషన్ అంటే ఏమిటి అనుకుంటున్నారా ? ముందుగా పులియబెట్టిన ఉంచిన పిండిని ఆవిరి చేస్తారు. ఆ తరువాత చల్లబరడటం ద్వారా ఆల్కహాల్‌ను వేరు చేయవచ్చు. ఈ ప్రక్రియనే డిస్టిల్లేషన్ అంటారు.
ఈ విస్కీని యధాతధంగా త్రాగే వారు ఉంటారు, కొందరు దీనిని సోడాలో కానీ, కూల్ డ్రింక్ లో కానీ, లేదంటే కాక్ టెయిల్ లో కానీ కలుపుని త్రాగేవారు ఉంటారు.
వారి వారి అభిరుచిని బట్టి విస్కీ లో మిక్సింగ్ చేసుకుంటారు. విస్కీ అన్నవెంటనే మనకు గుర్తొచ్చేది ఎక్కువగా వినిపించేది స్కాచ్ విస్కీ,
ఇది స్కాట్లాండ్‌లో తయారు చేయబడిన విస్కీ, ఇది బార్లీ గింజలు ఉపయోగించి తయారుచేస్తారు. దీనిని చెక్క డ్రమ్ములలో కనీసం మూడు సంవత్సరాల పాటు వృద్ధి చేస్తారట.
మరోరకం విస్కీ చుస్తే బోర్బెన్ విస్కీ. ఈ విస్కీని యునైటెడ్ స్టేట్స్‌లో తయారు చేస్తారు. దీని తయారీ లో 51 శాతం మొక్క జొన్నను ఉపయోగిస్తారు.
ఇక ఈ విస్కీ తయారీలో వైవిద్యం ఏమిటంటే ఈ పదార్ధాన్ని కాల్చిన ఓక్ బారెల్స్ లో వృద్ధి చేస్తారు. ఐరిష్ విస్కీ సంగతి చుస్తే, ఇది ఐర్లాండ్‌లో తయారు చేయబడుతుంది. దీని తయారీ కోసం బార్లీ, మొక్కజొన్న ఇంకా గోధుమ వంటి వివిధ రకాల గింజలను వాడి విస్కీని తయారు చేస్తారు.
ఈ విస్కీ మూడు సంవత్సరాల నుండి అంతకన్నా ఎక్కువ సంవత్సరాల పాటు వృద్ధి చేయబడుతుంది. ఇక కెనడియన్ విస్కీ సంగతి చుస్తే ఇది కెనడాలో తయారు చేయబడుతుంది. దీనిని రై, గోధుమ, మొక్కజొన్న తో పాటూగా మరికొన్ని రకాల గింజలను ఉపయోగించి తయారు చేస్తారు. ఇది కూడా మూడు సంవత్సరాల పాటు వృద్ధి చేయబడుతుంది.
విస్కీలో కొన్ని ఔషధ గుణాలు కూడా దాగి ఉన్నాయి. ఇది జలుబు, ఫ్లూ వంటి వ్యాధులను కొంత మేర నివారించగలుగుతుందట. అంతే కాదు ఇది జీర్ణక్రియ సక్రమంగా నడిచేందుకు సహాయపపడుతుంది అని వైద్య నిపుణుల ద్వారా తెలుస్తుంది.
విస్కీని సహజ సౌందర్య ఉత్పత్తులలో కూడా ఉపయోగిస్తారని తెలుస్తోంది. ఇది చర్మం, జుట్టుకు సహాయపడే యాంటీఆక్సిడెంట్లు ఇంకా విటమిన్లను కలిగి ఉంటుందని కొన్ని అధ్యయనాల్లో తేలింది.
అయితే విస్కీ లో మంచి గుణాలు ఉన్నాయని చెప్పారు కదా అని సీసాలకు సీసాలు త్రాగేయడం కూడా మంచిది కాదు. విస్కీని ఉపయోగించేటప్పుడు, మితంగా తాగడం ముఖ్యం.
అధిక మద్యపానం ఆనారోగ్య సమస్యలకు దారితీస్తుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కాబట్టి సిఫారసు చేసిన మోతాదులో మాత్రమే తీసుకుంటే మన ఆరోగ్యానికి మేలు చేస్తుంది.