యూట్యూబ్ స్టార్ అడిసన్ పియర్ మలౌఫ్ కిడ్నాప్‌కు !

WhatsApp Image 2024 03 30 at 12.38.07 PM యూట్యూబ్ స్టార్ అడిసన్ పియర్ మలౌఫ్ కిడ్నాప్‌కు !

యువర్ ఫెలో అరబ్ అనే ప్రసిద్ధి చెందిన ప్రముఖ యూట్యూబ్ స్టార్ అడిసన్ పియర్ మలౌఫ్ హైతీలో ఉగ్రవాదులు కిడ్నాప్‌ చేసారు. అతను అదృశ్యం కాక ముందు జార్జియాకు చెందిన ఒక యూట్యూబర్ హైతీ లో హింసలకు పాల్పుడున్న ప్రాంతానికి వెళ్లినట్లు తెలుస్తోంది.

సాధారణ పర్యాటకులు రాని లేదా కిడ్నాప్ లు ప్రమాదకరమైన సంఘటనలు జరిగే ప్రదేశాలను అన్వేషించడంలో ప్రసిద్ధి చెందిన మలౌఫ్, గత ఏడాది జూలై నుండి తన ఇన్‌స్టాగ్రామ్ లో వీడియోలు పోస్ట్ చెయ్యడం లేదు. అతను కిడ్నాప్ కు గురి అవ్వక ముందు ఒక అరబ్ పోర్ట్-ఓ-ప్రిన్స్‌ అపఖ్యాతి తెచ్చుకున్న జిమ్మీ “బార్బెక్యూ” చెరిజియర్‌ ను ఇంటర్వ్యూ చేయడానికి వెళ్లాడని అక్కడి అధికారులు ఇచ్నిన వేదికలు పేర్కొన్నాయి.

హైతీ24 ప్రకారం, “వివ్ అన్సన్మ్” సంకీర్ణ సభ్యుడైన, అతి భయంకరమైన గ్యాంగ్ లీడర్ పేరు పొందిన “Lanmò 100 jou” ఆదేశాల మేరకు అతన్ని కిడ్నాప్ చేసినినట్లు తెలుస్తోంది. ఆ గ్యాంగ్ లీడర్ చెప్పినట్లే కిడ్నాపర్లు వ్యవహరిస్తున్నారు. జర్నలిస్టు మలౌఫ్ విడుదల కోసం భారీ మొత్తం లో డబ్బులు అడుగుతున్నారు. అతన్ని విడిచి పెట్టాలంటే $600,000 డాలర్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.

మొదట $40,000 ఇచ్చినప్పటికీ , కిడ్నాపర్లు అతని విడుదల చెయ్యాలంటే మిగిలిన డబ్బులు ఇస్తేనే విడిచి పెడతామని చెప్తున్నారు. అంతే కాదు దీనికి సంబందించి స్ట్రీమర్ స్నీకో అనే వ్యక్తి లైవ్ స్ట్రీమ్‌లో మలౌఫ్ కిడ్నాప్ గురించి మాట్లాడుతూ, “హైతీలో మలౌఫ్ అరబ్ కిడ్నాప్ అయ్యాడని, కిడ్నాప్ చేసి కూడా 15 రోజులు అవుతోందని చెప్పాడు.. యువర్ ఫెలోఅరబ్, యూట్యూబర్ అరబ్‌ను విడిపించండి మరియు అరబ్ కోసం ప్రార్థించండి అతను కోరు తున్నాడు.

Leave a Comment