లోక్‌సభ అభ్యర్థుల జాబితాను విడుదల కడప నుంచి YS షర్మిల

ys sharmila 1706347581447 1706347586682 లోక్‌సభ అభ్యర్థుల జాబితాను విడుదల కడప నుంచి YS షర్మిల

రాబోయే పార్లమెంట్ ఎన్నికల జరుగుతున్న నేపద్యం లో కాంగ్రెస్ పార్టీ మంగళవారం లోక్‌సభ ఎన్నికలకు 17 మంది అభ్యర్థుల జాబితాను విడుదల చేయడం జరిగింది. రాష్ట్ర యూనిట్ చీఫ్ YS. షర్మిలారెడ్డి కి ఆంధ్రప్రదేశ్‌లోని కడప నియోజకవర్గం కేటాయించడం వల్ల ఆమె కడప నుండి పోటీ చేస్తున్నారు. తాజా గ విడుదల చేసిన జాబితాలో ఒడిశా నుంచి 8 మందికి , ఆంధ్రప్రదేశ్ నుంచి 5 మంది కి , బీహార్ నుంచి 3 , పశ్చిమ బెంగాల్ నుంచి 1 ఉన్నారు. మొత్తం 17 సీట్లకు అభ్యర్దుల పేర్లు ఖారారు చేసింది కేంద్ర కమిటి.

బీహార్‌లో మహాకూటమితో ఉన్న భాగస్వామ్య ఒప్పందంలో భాగంగా కాంగ్రెస్‌కు లభించిన 9 సీట్లలో, గ్రాండ్ ఓల్డ్ పార్టీ కిషన్‌గంజ్, కతిహార్ మరియు భాగల్‌పూర్‌లలో అభ్యర్థులను ప్రకటించింది కేంద్ర అధిష్టానం.

ప్రస్తుతం ఉన్న ఈ కిషన్‌గంజ్ లోక్‌సభ స్థానం నుంచి కాంగ్రెస్ ఎంపీ మహ్మద్ జావేద్, కతిహార్ నుంచి ప్రముఖ నేత తారిఖ్ అన్వర్ బరిలోకి దిగబోతున్నారు. భాగల్‌పూర్ లోక్‌సభ స్థానం నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యే అజిత్ శర్మ పోటీ చేస్తారని అధిష్టానం ప్రకటించింది.

ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడ నుంచి మాజీ విద్యాశాఖ మంత్రి M. M. పల్లంరాజును పోటీకి దింపాలని కాంగ్రెస్ నిర్ణయించడం జరిగింది. అలాగే మాజీ లోక్‌సభ సభ్యుడు సంజయ్ భోయ్‌కు 2009 నుండి 2014 వరకు ప్రాతినిధ్యం వహించిన ఒడిశాలోని బర్‌గఢ్ నుండి పోటీ చేయడానికి కాంగ్రెస్ టిక్కెట్ ని కేటాయించింది.

Leave a Comment