Indian Govt earn 1163Cr by Scraps: స్క్రాప్ విక్రయంతో 1163 కోట్లు.

1163 crores with sale of scrap.

Indian Govt earn 1163Cr by Scraps: స్క్రాప్ విక్రయంతో 1163 కోట్లు.

మనదేశం 2023 సంవత్సరంలో సాధించిన అత్యంత ప్రతిష్టాత్మకమైన ఘనకార్యం ఏదైనా ఉందా అంటే అందులో ప్రధమ స్థానంలో నిలిచేది చంద్రయాన్ – 3 (Chandrayan 3) .

మన శాస్త్రవేత్తలు ఎంతో శ్రమించి ఈ కార్యాన్ని విజయవంతం చేశారు. అయితే ఈ పని మొత్తానికి అయిన ఖర్చు సుమారు 600 కోట్లు(₹600 crores).

ప్రభుత్వం తలుచుకుంటే ఇలాంటి ప్రయోగాలకి ఇబ్బడిముబ్బడిగా ఖర్చుచేయవచ్చు. ప్రస్తుత ప్రభుత్వం అందుకు సంసిద్ధంగా ఉన్నట్టు తన చర్యల ద్వారా చెప్పకనే చెబుతోంది.

తాజాగా కేంద్రంలో ఉన్న బీజేపీ సర్కారు(BJP GOVT) పాత సామాన్లు పనికిరాని మూలాన పడిన ప్రభుత్వ వాహనాలను విక్రయించి భారీ మొత్తని ఆర్జించింది.

అయితే ఆ మొత్తాన్ని ఒక బృహత్తర కార్యం కోసం ఉపయోగించాలని నిశ్చయించింది. అది మరేదో కాదు, చంద్రయాన్ కి చెందిన రెండు మిషన్లకి చెందిన పనులను ఈ నిధులు వెచ్చిస్తారట.

Also Read: ప్రజల కోసం ప్రజల్లో నుండి వస్తున్న నాయకుడు – యేలేటి సురేష్ రెడ్డి

2021 నుండి విక్రయాలు : Sales From 2021

ఇక ఈ స్క్రాప్ విషయానికి వస్తే ఇవి 2021 సంవత్సరం నుండి విక్రయించిన పనికి రాని సామాను ద్వారా వచ్చిందనీ సమాచారం.

2021 వ సంవత్సరం అక్టోబర్ నెల నుండి చూసుకుంటే కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల్లో ఉన్న 96 లక్షల ఫైళ్లను(96 Lakhs Files) తొలగించారు,

ఈ ఫైళ్లు తొలగించడం ద్వారా కేవలం డబ్బు సమకూరడమే కాదు మొత్తం ప్రభుత్వ ఆఫీసుల్లో 355 లక్షల చదరపు అడుగుల స్థలం ఖాళీ అయినట్టు తెలుస్తోంది.

ఇక ఈ ఫైళ్లు తొలగించడం వల్ల కారిడార్లను శుభ్ర పరచడానికి వీలవడం మాత్రమే కాదు, ఆ ప్రదేశాల్లో వినోద ప్రధానమైన కార్యకలాపాలు నిర్వహించడానికి ఉపయోగించే వీలవుతుంది.

చంద్రయాన్ 3 నిజంగానే స్పెషల్ : Chandrayan 3 Is Really Special

భారత దేశం చేసిన చంద్రయాన్ 3 ప్రయోగం గురించి ఇంత ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన అవసరం ఏముంది అని చూసేవారికి అనిపించవచ్చు. కానీ ఇక్కడే ఒక కీలకం ఉంది.

మనలని రష్యా (Russia) కూడా చంద్రుడి(Moon) పై ప్రయోగాలు చేసింది. అందుకోసం చంద్రుడిపైకి ఉపగ్రహాలను పంపించింది. ఆ మిషన్ కి వారు పెట్టిన పేరు మిషన్ మూన్(Mission Moon), అలాగే ఆ మిషన్ కి వారు చేసిన ఖర్చు 16,000 కోట్లు.

పేరు విషయం పక్కన పెడితే ఖర్చు విషయం లో మనకి రష్యాకి పొంతన లేదు. అంత ఖర్చు పెట్టినా ఆ ప్రయోగం విఫలం అయింది. కానీ మన శాస్త్రవేత్తలు కేవలం 600 కోట్లు మాత్రమే ఖర్చుపెట్టి చంద్రయాన్ 3 ని విజయవంతం చేశారు.

ఎక్కువ వచ్చింది రైల్వే శాఖ నుండే : Maximum Amount Came From Railway

2021 నుండి మొత్తం కలిసి 1163 కోట్లు స్క్రాప్ విక్రయించగా వస్తే, అందులో ఈ ఏడాది అంటే 2023 లో వచ్చింది 556 కోట్ల రూపాయలు. ఈ మొత్తం లో ఏయే శాఖ నుండి ఎంత వచ్చింది అన్న విషయాన్నీ ఒక్కసారి పరిశీలిద్దాం.

రైల్వే శాఖ(Railway Department) నుండి అత్యధికంగా 225 కోట్లు వచ్చాయి, ఆతరువాతి స్థానంలో రక్షణ శాఖా(Defence) నిలిచింది, రక్షణ శాఖ నుండి 168 కోట్లు సమకూరాయి.

ఇక పెట్రోలియం, సహజవాయువు మంత్రిత్వ శాఖా నుండి 56 కోట్లు రాగా, బొగ్గు శాఖ నుండి 34 కోట్లు వచ్చాయి.

ఇక ఫైళ్ల విషయానికి వస్తే అత్యధికంగా విదేశాంగ శాఖ(Foreign Affairs) నుండి 3.9 లక్షల ఫైళ్లు తొలగించారు. ఇక మొత్తంగా తొలగించిన ఫైళ్ల సంఖ్యా వింటే బాప్రే అంటారు. మొత్తంగా 24 లక్షల ఫైళ్లు తొలగించబడ్డాయి.

Leave a Comment