Yeleti Suresh Reddy: ప్రజల కోసం ప్రజల్లో నుండి వస్తున్న నాయకుడు – యేలేటి సురేష్ రెడ్డి

Yeleti Suresh Reddy
Yeleti Suresh Reddy

Yeleti Suresh Reddy: రాజకీయం(Politics) అంటే వ్యాపారం కాదు, రాజకీయం అంటే వారసత్వం కాదు, రాజకీయం అంటే రౌడీయిజం అంతకన్నా కాదు, రాజకీయం అంటే ప్రజాసేవ, రాజకీయ నాయకుడంటే ప్రజలలో నుండి వచ్చినవాడై ఉండాలి, ప్రజల కష్టాలను తీర్చేవాడు పేదరికంలో నుండి వచ్చిన వాడై ఉండాలి, అన్నిటికి మించి గుండెల నిండా దేశ భక్తి నింపుకున్న వాడై ఉండాలి.

రాజకీయ రంగం ఇంటెన్సివ్ కేర్ యూనిట్ లోకి అడ్మిట్ అవ్వకుండా ఉండాలంటే ఇలాంటి వారు తప్పకుండ పొలిటికల్ లైఫ్ కి శ్రీకారం చుట్టాలి.

అయితే అటువంటి క్వాలిఫికేషన్స్, క్వాలిటీస్ అన్ని ఉన్న పర్సన్ పొలిటికల్ ఫీల్డ్ లోకి ఎంటర్ అవుతా అంటున్నారు. ఎంపీ టికెట్ కావాలని భారతీయ జనతా పార్టీ (Bhartiya Janata Party) తలుపు తడుతున్నారు, అయన మరెవరో కాదు ప్రముఖ వ్యాపారవేత్త ఏలేటి సురేష్ రెడ్డి (Yeleti Suresh Reddy).

Yeleti Suresh Reddy Personal Life:

మృదు స్వభావి, నిరాడంబరుడు, పెద్దల పట్ల గౌరవ భావం కలిగిన వ్యక్తి, పెద్ద పెద్ద చదువులు చదివేసి డాక్టరేట్లు పుచ్చుకోక పోయినా, సామాన్య నిరుపేద కుటుంబంలో పుట్టి పెరిగి జీవితాన్ని చదివిన జ్ఞాని. కేవలం వంద అంటే వంద రూపాయల జీతంతో జీవితాన్ని మొదలుపెట్టి, ఇప్పుడు వందల మందికి జీతాన్ని, జీవితాన్ని ఇస్తున్న మహా మనిషిగా మారిన వ్యక్తి.

తెలంగాణ రాష్ట్రం నిజామాబాద్ జిల్లా వెంకంపల్లి అనే చిన్న పల్లెటూరులో పుట్టిన అయన అందరి మాదిరిగానే కోటి ఆశలతో హైదరాబాద్(Hyderabad) నగరానికి చేరుకున్నారు.

దీనికన్నా ముందు ఒక విషయం చెప్పాలి. వాళ్ళ అమ్మ నాన్న ఆయన్ని కాన్వెంట్ లో చదివించలేదు. పైగా వారి ఊరిలో ప్రభుత్వ పాఠశాల కూడా లేదు. బడికి వెళ్ళడానికి ప్రతి రోజు ఆరు మైళ్ళు నడవక తప్పింది కాదు బాల్యంలో.

Yeleti Suresh Reddy Education:

Suresh Reddy wife
Yeleti Suresh Reddy

ఇక పోతే మెడికల్ స్టోర్ లో సేల్స్ బాయ్ గా మొదటి ఉద్యోగాన్ని మొదలు పెట్టి జీవిత ప్రయాణాన్ని స్టార్ చేశారు. ధైర్యే సాహసే లక్ష్మి అన్న మాటను గట్టిగా నమ్మారు, అందుకే ఆయన జీవితగమనం లో చేసిన పోరాటానికి మెచ్చి విజయలక్ష్మి తనంతట తానె వరించింది. మనిషి ఎదిగిన కొద్దీ ఒదగాలి అన్న మాటను సురేష్ రెడ్డి తూచా తప్పకుండా పాటిస్తారు.

అందుకే పెద్దల పట్ల గౌరవభావంతో మసులుకుంటారు. ఇక పోతే తన జీవితంలో తను అందుకోలేని చదువును ఎంతోమంది పేద విద్యార్థిని విద్యార్థులు అందుకోవాలన్నది అయన ఆశయం.

అందుకే ఖాళీ సమయం దొరికిందంటే చాలు, చుట్టుప్రక్కల గ్రామాల్లోని పాఠశాలలు పరిశీలించి అక్కడి లోటుపాట్లను అధికారుల దృష్టికి తీసుకెళుతూ ఉంటారు.

అంతే కాదు తనవంతుగా సహాయ సహకారాలు కూడా అందిస్తూ ఉంటారు. కుడి చేత్తో చేసిన దానం ఎడమచేతికి తెలియకూడదు అనుకునే వ్యక్తి అయన, దాన ధర్మాల విషయంలో దాన కర్ణుడికి సమానం కాకపోయినా, తనకున్నదానిలో నలుగురికి పంచి పెట్టే దయార్ద్ర హృదయం కలవారు.

Yeleti Suresh Reddy Qualities:

దేశ భక్తి మాత్రమే కాదు, సురేష్ రెడ్డికి దైవ భక్తి కూడా ఎక్కువే, భగవంతుని పట్ల ఎల్లప్పుడూ కృతజ్ఞతా భావం తోనే ఉంటారు, ఇప్పటి వరకు అనేక ఆలయాల పునర్నిర్మాణాలకు తనవంతుగా సహాయసహకారాలు అందించారు.

వీటితోపాటు అన్యాయాన్ని ఎదిరించి నిలబడే గుణం కూడా ఆయనలో మెండుగానే ఉంది, కాబట్టి ఇలాంటి గుణగణాలు కలిగిన యువ రక్తమే ఇప్పటి రాజకీయ రంగానికి అవసరం.

కుళ్ళిన ఈ వ్యవస్థకి కొత్త నెత్తురేక్కించాలి అని సినీ కవి అన్నారు. అందుకే ఏ అవినీతి మారకా లేని ఇలాంటి వారు ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తే, ప్రజలకు అందాల్సిన సంక్షేమం పైసలతో సహా అందుతుంది. రాష్ట్రం దేశం సుభిక్షంగా ఉంటుంది.

Yeleti Suresh Reddy Political Carrier:

Yeleti Suresh Reddy with Amit Shah
Yeleti Suresh Reddy with Amit Shah

ప్రస్తుతం తెలంగాణా రాష్ట్రంలో ఇటీవలే శాసనసభ ఎన్నికలు ముగిశాయి, కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారాన్ని చేపట్టింది. ఇక అందరి చూపు రాబోయే లోక్ సభ ఎన్నికలపైనే ఉన్నాయి. దీంతో వివిధ పార్టీలు తమ తమ అభ్యర్థులను సిద్ధం చేసుకుంటున్నాయి.

ఎన్నికల బరిలో గెలిచేందుకు అస్త్ర శాస్త్రాలను సమకూర్చుకుంటున్నాయి. ఈ క్రమం లో ప్రముఖ వ్యాపారవేత్త ఏలేటి సురేష్ రెడ్డి (Yeleti Suresh Reddy) పేరు తెరపైకి వచ్చింది. తాను ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తున్నట్టు అయన స్వయంగా ప్రకటించారు. రాబోయే లోక్ సభ ఎన్నికల బరిలో నిలబడతానని చెప్పారు. అందుకు అయన జహీరాబాద్(Zaheerabad) స్థానాన్ని ఎంచుకున్నానని పేర్కొన్నారు.

Yeleti Suresh Reddy
Yeleti Suresh Reddy

ఈ విషయమై అయన ఇటీవల భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని (Kishan Reddy) కలుసుకున్నారు. మర్యాదపూర్వకంగా జరిగిన భేటీలో సురేష్ రెడ్డి తనకు బీజేపీ నుండి పోటీ చేసే అవకాశం కల్పించాలని కోరగా, కిషన్ రెడ్డి సానుకూలంగా స్పందించారు.

త్వరలోనే ఈ విషయంపై చర్చించి నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ విషయంలో సురేష్ రెడ్డి కూడా కొంత ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. అనుకున్నవి అనుకున్నట్టు జరిగితే బిజినెస్ మెన్ సురేష్ రెడ్డిని, సురేష్ రెడ్డి మెంబర్ ఆఫ్ పార్లమెంట్ గా ప్రజలు చూస్తారు. ఆ పదవిని హోదా లా కాకుండా బాధ్యతగా భావించే వ్యక్తి కాబట్టి సురేష్ రెడ్డి ప్రజలకు విస్తృతంగా తన సేవా కార్యక్రమాలను అందిస్తారు.

FAQs

Who is the owner of 6TV?

Yeleti Suresh Reddy is the owner of 6TV.

Leave a Comment