అయోధ్యలో 13 ఆలయాలు : 13 New Temples In Ayodhya

13 New Temples In Ayodhya

ఇది చరిత్రలో నిలిచిపోయే రోజు : Historical Date

13 New Temples In Ayodhya: 2024 జనవరి 22వ తేదీ ఇది చరిత్రలో నిలిచిపోయే రోజు, ఎందుకు అని భారతదేశంలోని చిన్న పిల్లవాడిని అడిగినా చెబుతాడు.

ఎందుకంటే ఆ రోజునే అయోధ్యలో రామ మందిర(Ayodhya Rama Mandir) నిర్మాణం పూర్తిచేసుకుని ప్రారంభోత్సవానికి నోచుకుంది, అలాగే అదే రోజున రామమందిరం బాల రాముడి విగ్రహ ప్రాణప్రతిష్ట కూడా పూర్తయింది.

అయోధ్య రామాలయానికి సంబంధించి ఇవి రెండు ప్రధానమైన పనులు ఇవి రెండు కూడా పూర్తయ్యాయి. అయితే అయోధ్య రామ మందిరంలో ఇంకా కొన్ని పనులు మిగిలే ఉన్నాయి. అవే ఉప ఆలయాలు. అయోధ్య రామ మందిరం కాంప్లెక్స్ లో కొన్నిటిని, వెలుపల కొన్నిటిని నిర్మిస్తారు. ఈ ఉపాలయాలు మొత్తం 13 నిర్మిస్తారని తెలుస్తోంది.

ఆలయంలో కొన్ని వెలుపల కొన్ని : New Temples In Ayodhya

ఇక అయోధ్య రామ మందిరంలో ఏయే ఆలయాలు నిర్మిస్తారనేది చుస్తే ఆలయానికి నాలుగు మూలల్లో జగదాంబ(New Temples In Ayodhya), సూర్యదేవుడికి సంబంధించిన ఆలయాలు నిర్మిస్తారట, అయితే అందుకు కారణం కూడా లేకపోలేదు.

శ్రీరాముడు విష్ణుమూర్తి అవతారం కాబట్టి ఈ నిర్ణయం తీసుకున్నారట. కాశి అన్నపూర్ణ దేవి, వీర హనుమాన్ ఆలయాలు కూడా ఆలయంలోనే నిర్మిస్తారు. ఇక ఆలయం వెలుపల వాల్మీకి మహర్షి, వశిష్ఠ మహర్షి, విశ్వామిత్ర మహర్షి, అగస్త్య మహర్షి, నిషాదరాజ, శబరి మాతా, అహల్య దేవి ఆలయాలు నిర్మిస్తారు.

అయితే వాల్మీకి మహర్షి ఆలయం మాత్రం ప్రత్యేకమని చెప్పాలి, రామాయణ మహా కావ్యాన్ని విరచించింది వాల్మీకి మహర్షి కాబట్టి అయన ఆలయానికి ఇక్కడ ఒక ప్రత్యేకమైన స్థానం ఉందని చెప్పొచ్చు.

నిర్మాణం ఎంతవరకు వచ్చింది : Construction Progress ?

ఈ విషయమై రామ తీర్ధ క్షేత్ర ట్రస్ట్ కోశాధికారి స్వామి గురుదేవ్ గిరిజీ మాట్లాడారు. ఈ ఆలయాల నిర్మాణానికి హెప్రణాళికలు రచిస్తున్నట్టు చెప్పారు. ఇక ప్రధాన ఆలయ నిర్మాణం లో మిగిలిపోయిన కొద్దిశాతం పనుల తోపాటు అన్ని పనులు కూడా పూర్తి చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు వెల్లడించారు.

ప్రధాన ఆలయ నిర్మాణం పనుల విషయానికే వస్తే ఇప్పటివరకు కేవలం ఒక అంతస్తు లో పనులు మాత్రమే పూర్తయ్యాయట, మరో అంతస్తులో పనులు ఇంకా జరుగుతున్నాయని పేర్కొన్నారు.

Leave a Comment