Ambani donates 2.51 crores to Ayodhya : అయోధ్యకి అంబానీ కుటుంబం : 2.51 కోట్ల విరాళం

website 6tvnews template 4 2 Ambani donates 2.51 crores to Ayodhya : అయోధ్యకి అంబానీ కుటుంబం : 2.51 కోట్ల విరాళం

యావత్ భారత దేశం మొత్తం వీక్షించిన కార్యక్రమం ఏదైనా ఉందా అంటే అది రామ మందిర ప్రారంభోత్సవ కార్యక్రమమే అని చెప్పాలి.

అయోధ్యలో Ayodhya Rama Mandir రామ మందిర నిర్మాణం అనేది ఒకరి కాదు రెండు కాదు ఏకంగా 500 ఏళ్ళ నాటి కల, ఈ కల సాకారం అవ్వడంతో ఎవరైతే ఈ ఆలయం కోసం ప్రాణాలు అర్పించారో వారి ఆత్మలు కూడా శాంతించి ఉంటాయని అంతా భావించారు.

ఇక రామ మందిరంలో మోదీ(PM Narendra Modi) చేతుల మీదుగా ప్రతిష్టించగా వేద మంత్రోచ్ఛరణలతో ప్రాణ ప్రతిష్ట చేయబడిన బాల రాముడిని చూసి తరించేందుకు భక్తులు లక్షలాదిగా తరలి వచ్చారు.

అంతేకాదు వేలాదిగా విఐపీలు కూడా విచ్చేశారు. రాజకీయ, సినీ, క్రీడా, వ్యాపార రంగాలకు చెందిన ప్రముఖులు అనేకమంది హాజరయ్యారు. వారిలో అంబానీ ఫ్యామిలీ Ambani Family కూడా ఒకటి.

అంబానీ ఫ్యామిలీకి విరాళాలు కొత్తకాదు :

అంబానీ ఫ్యామిలీ రామ మందిరానికి రావడమే కాదు, భారీగా విరాళాలు ఇచ్చింది. ఈ విషయం ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. అంబానీ ఫ్యామిలీ ఈ రామమందిరం కోసం ఏకమయ్యింది.

ముఖేష్ అంబానీ, నీతా అంబానీ, వారి ఇద్దరు కుమారులు, కోడలు, అల్లుడు కూడా ఈ కార్యక్రమానికి వచ్చారు. ఇక రామమందిర ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకుని ఆలయ ట్రస్టు కు అంబానీ ఫ్యామిలీ 2.51 కోట్ల రూపాయలను విరాళంగా అందించిందట.

అంతే కాకా కొన్ని విశ్వసనీయ వర్గాల నుండి తెలుస్తున్న సమాచారం ప్రకారం అంబానీ ఫ్యామిలీ రామ మందిరానికి ఏకంగా 33 కిలోల బంగారాన్ని, మూడు కిరీటాలను కూడా ఇచ్చినట్టు తెలుస్తోంది. అంబానీ ఫ్యామిలీ భారీ విరాళాలు ఇవ్వడం కొత్తేమి కాదు.

గతంలో ఆంధ్ర ప్రదేశ్(Andhra Pradesh) లోని తిరుమల వెంకన్న గుడికి కోటిన్నర, కేరళలో(Kerala)ని గురువాయూర్ ఆలయంలో(Guravayur Temple) అన్నదానం నిమిత్తం కోటిన్నర విరాళంగా సమర్పించుకున్నారు.

అన్నిటికన్నా ఎక్కువ మొత్తంలో బదరీనాథ్(Badrinath), కేధార్నాధ్(Kedarnath) ఆలయ కమిటీలకు ఎక్కువ ఇచ్చారు. ఆ ఆలయ కమిటీకి ఏకంగా 5 కోట్ల రూపాయల విరాళం ఇచ్చారు.

Leave a Comment