Anjanadri Theme Song: మొన్నటివరకు తేజ సజ్జా(Teja Sajja), అమృత అయ్యర్(Amruta Ayyar) నాయికా నాయికలుగా నటించిన సినిమా హనుమాన్ Hanuman అని అనేవారు.
కానీ ఎప్పుడైతే సినిమా విడుదలైందో అప్పటి నుండి ప్రశాంత్ వర్మ(Prashanth Varma) దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా అని ప్రశాంత్ వర్మ రూపొందించిన సినిమా హనుమాన్ అని అంటున్నారు. ఈ సినిమా కంప్లీట్ క్రెడిట్ ను డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తన్నుకెళ్లిపోయాడు.
సంక్రాంతి కానుకగా జనవరి 12వ తేదీన విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. హనుమంతుడి స్పూర్తితో తెరకెక్కిన ఈ సినిమా భారీ సక్సస్ ను అందుకుంది.
అలంటి ఇలాంటి సక్సస్ కాకుండా సంక్రాంతి విజేతగా నిలిచింది.
థీమ్ సాంగ్ ప్రత్యేకం కానుంది : Theme Song is Going To Be Special
ఈ సినిమా లోని విజువల్ ఎఫెక్ట్స్ కానీ పాటలు కానీ బ్రహ్మాండంగా ఉన్నాయని చుసిన ప్రతి ఒక్కరు అంటున్నారు.
పైగా సూపర్ పవర్స్ నేపథ్యంలో కథ ఉండటం వల్ల ఇది పిల్లలకు, హనుమంతుని నేపధ్యం ఉండటం వల్ల పెద్దవాళ్లకు కూడా బాగా నచ్చేసింది. ఇక ఈ సినిమా విడుదలై దగ్గరదగ్గరగా రెండు వారాలవుతోంది. ఈ క్రమంలో చిత్ర బృందం అంజనాద్రి థీమ్ సాంగ్ ను రిలీజ్ చేయనున్నారు.
అందుకు కారణం కూడా లేకపోలేదు, ప్రపంచవ్యాప్తంగా వివిధ భాషల్లో విడుదలైన ఈ సినిమా 210 కోట్లను రాబట్టింది, అందుకే సినిమా పై హైప్ ను మరింత పెంచేందుకు థీమ్ సాంగ్ రిలీజ్ చేయడం కరెక్ట్ అని భావించారట.
పైగా ఇది కేవలం థియేటర్ లో ఆడుతున్న దానికి మాత్రమే కాదు, త్వరలో ఓటిటీ లోకి అడుగుపెట్టబోతున్నందుకు కూడా ప్రొమోషన్ చేస్తున్నట్టు అవుతుంది.
హనుమాన్ థీమ్ లో ఏముంటుంది ? What Is There In Hanuman Theme
హనుమాన్ సినిమా లో ఈ సాంగ్ విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఈ పాటలో హనుమంతుడు ఎలా పుట్టాడు అనే దాని దగ్గరనుండి హనుమంతుని రక్త బిందువు ఠీ రుధిర మణి ఎలా ఏర్పడింది అన్న దానివరకు చాల చక్కగా చూపించారు.
అటువంటి ఈ సాంగ్ ఇంటర్ నెట్ లో రిలీజ్ అయినప్పటి నుండి వైరల్ గా మారింది. శివశక్తి దత్తా(Sivashakti Datha) సాహిత్యాన్ని అందించిన ఈ పాటకు గౌరీ హరి సంగీతాన్ని అందించారు.
ఈ పాటను సాయి చరణ్ భాస్కరుని హృద్యంగా ఆలపించారు. భక్తి భావం ఉట్టిపడేలా ఉన్న ఈ పాట ప్రతి ఒక్కరిని ఆధ్యాత్మిక లోకంలోకి తీసుకువెళుతోంది.