మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి (YS Rajasekhar Reddy)మనవడు, ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy)మేనల్లుడు, ఏపీ(AP)కాంగ్రెస్ పార్టీ (APCC) ప్రెసిడెంట్ వై.ఎస్. షర్మిల(YS sharmila) కొడుకు రాజారెడ్డి(Raja Reddy)ఎంగేజ్మెంట్ ఘనంగా జరిగింది.
ఈ నిర్ఛితార్థ వేడుకలో షర్మిల సోదరుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో పాటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ హాజరయ్యారు. షర్మిల కొడుకు రాజారెడ్డి ఈమధ్యనే అమెరికాలో ఎంఎస్ పూర్తి చేసి పట్టా పుచ్చుకున్నాడు. ఎంఎస్ చదివే సమయంలోనే అమెరికాలో , ప్రియ అట్లూరి (Priya atluri)తో పరిచయం ఏర్పడింది.
ఆ నాలుగేళ్ల పరిచయం కాస్త ఇప్పుడు నిశ్చితార్థం వరకు వచ్చింది. హైదరాబాద్ లోని గోల్కొడ రిసార్ట్స్‌లో(Golconda Resorts)ఎంగేజ్మెంట్ ఎంతో కన్నులపండుగలా నిర్వహించారు షర్మిల దంపతులు. తెలుగు రాష్ట్రాలకు చెందిన రాజకీయ, సినీ, వ్యాపార ప్రముఖుల రాకతో వేడుక ఎంతో సందడిగా జరిగింది.
AP CM Jagan blessed his nephew : మేనల్లుడిని ఆశీర్వదించిన ఏపీ సీఎం జగన్
మేనల్లుడు నిశ్చితార్థానికి ఏపీ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్‌రెడ్డి( Jagan Mohan Reddy)సతీ సమేతంగా హాజరవుతున్నారు. కాబోయే వధూ వరులు రాజారెడ్డి, ప్రియలను జగన్ దంపతులు ఆశీర్వదించారు.
నూతన వధూవరులతో జగన్ దంపతులు ఫోటో దిగారు.
అనంతరం విజయమ్మ (Vijayamma)ను జగన్ హత్తుకున్నారు. మేనల్లుడు రాజారెడ్డి(Raja Reddy)కి పూల బొకే ఇచ్చి, జనగ్ మోహన్ రెడ్డి, భారతి(Bharathi)దంపతులు హైదరాబాద్ నుంచి తాడేపల్లికి వెళ్లిపోయారు.
Pawan Kalyan at Sharmila’s son’s engagement: షర్మిల కొడుకు నిశ్చితార్థ ఫంక్షన్లో పవన్ కల్యాణ్
గండిపేటలోని గోల్కొండ రిసార్ట్స్ (Golkonda Resort)లో జరిగిన ఈ నిశ్చితార్థ ఫంక్షన్ కు పొలిటికల్ లీడర్లు, సెలబ్రిటీలు, సినీ తారలు, వ్యాపార ప్రముఖులు హాజరయ్యారు.
తన కుమారుడి ఎంగేజ్మెంట్ కు రావాలన్న షర్మిల (Sharmila)ఆహ్వానం మేరకు జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ (Pawan Kalyan)కూడా ఎంగేజ్మెంట్ కు వచ్చారు. కాబోయే దంపతులు రాజారెడ్డి, ప్రియాలను ఆయన ఆశీర్వదించారు. ఇక పవన్ స్టార్ రాకతో ఫంక్షన్ కోలాహలంగా మారింది. పవన్ కు షర్మిల-అనిల్ (Anil) దంపతులు ఘనంగా స్వాగతం పలికారు.
అనంతరం కొత్త జీవితాన్ని స్టార్డ్ చేయనున్న రాజారెడ్డి-ప్రియల జోడీకి పవన్ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం షర్మిల ఫ్యామిలీ మెంబర్స్ పవన్ కల్యాణ్ తో ఫోటోలు దిగారు.
Who is Sharmila’s daughter-in-law? : షర్మిల కోడలు ఎవరంటే ?
షర్మిలకు కాబోయే కోడలు ప్రియా అట్లూరి (Priya atluri) అమెరికాలో బిజినెస్ అడ్మినిస్టేషన్ చేసింది. ఆ సమయంలోనే రాజారెడ్డితో పరిచయం ఏర్పడింది. వీరిద్దరి స్నేహం అనంతరం ప్రేమగా మారింది. ప్రస్తుతం ప్రియా ఓ కంపెనీలో ఫైనాన్షియల్ అనలిస్ట్‌గా పని చేస్తోంది.
రాజారెడ్డి (Raja Reddy )కూడా విదేశాల్లోనే ఎంఎస్ చేశాడు. వీరిద్దరి ప్రేమకు షర్మిల, అనిల్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అంతే కాదు షర్మిల తన ట్విటర్ ఖాతాలో ఫోటోలను షేర్ చేసి తన కొడుకు పెళ్లిని అనౌన్స్ చేశారు. ఇక వీరిద్దరి పెళ్లి ఫిబ్రవరి 17, 2024న జరుగనుంది. రాజస్థాన్ (Rajasthan)లోని జోధ్‌పూర్ (Jodhpur)ఉమేద్ ప్యాలెస్ లో వివాహం జరుగనున్నట్లు సమాచారం.