Atal Sethu bridge: అటల్ సేతు నిర్మాణం వెనుక లక్ష్యం ఏమిటి

Atal Sethu bridge

Atal Sethu bridge: భారత దేశం మొత్తం మాట్లాడుకుంటున్న అంశం ఒకటుంది, అదేమిటంటే అటల్ సేతు. దీని గురించి అంత ప్రత్యేకంగా ముచ్చటించుకోవలసిన అవసరం ఏముంది అనుకోవచ్చు. కానీ ఇందులో నిజంగానే కొన్ని స్పెషాలిటీలు ఉన్నాయి.

అసలు ఈ వంతెన నిర్మాణమే చాలా స్పెషల్ అని చెప్పాలి, ఎందుకంటే ఇది నిర్మించింది నది మీద కాదు, దీనిని సముద్రం మీద నిర్మించారు.

Also Read :Pradhanmantri Suryodaya Yojana

అవునా ? ఎక్కడ నిర్మించారు ? ఎలా నిర్మించారు అని అనుకుంటున్నారా అయితే ఏమాత్రం లేట్ చేయకుండా స్టోరీ లోకి వెళ్ళిపోదాం.

ప్రయాణ దూరం ఎంత తగ్గింది ? How Much Travelling Distance Decrease.

Atal Sethu bridge

ఈ వంతెనను మహారాష్ట్ర రాజధాని ముంబై(Mumbai) లో నిర్మించారు. భారత సర్కారు(Indian Government) అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టి పూర్తి చేసిన నిర్మాణం ఇది.

ఇది ఒకటి కాదు రెండు కాదు, ఏకంగా 22 కిలోమీటర్ల పొడవు ఉంటుంది. ఈ వంతెన ముంబై నగరాన్ని – నవీ ముంబై(Navi Mumbai) ను కలుపుతుంది. మాములుగా అయితే ముంబై నుండి నవీ ముంబై కి వెళ్ళడానికి పెట్టె సమయం 2 గంటలు, కానీ ఈ వంతెన నిర్మాణం పూర్తవడం వల్ల 20 నిమిషాల్లోనే ఆ దూరాన్ని చేరుకోగలుగుతారు.

అంటే ప్రతి వాహనానికి ఈ వంతెన పై ప్రయాణించడం వల్ల సుమారుగా 300నుండి 400 రూపాయలు ఖరీదు చేసే ఇంధనం ఆదా అవుతుంది. అంటే ఈ అటల్ సేతు నిర్మాణం చేప్పట్టడం వల్ల ప్రతి రోజు కొన్ని వందల లీటర్ల ఇంధనం ఆదా అవ్వడమే కాక, కొంత మేర కాలుష్యం కూడా తగ్గుతుంది.

సముద్రం పై ఎంత దూరం : Distance On Sea

Atal Sethu bridge

ఈ అటల్ సేతు పై ప్రతి రోజు 70,000 వాహనాలు ప్రయాణించే సమద్యం ఉంటుంది. అంతే కాదు ఇది ఆరు లైన్ల వంతెన కావడంతో ఎక్కువ వాహనాలు ఒకే సారి ప్రయాణించే వీలు కూడా ఉంటుంది.

ఈ సముద్ర వంతెన ప్రజల సమయాన్ని, డబ్బుని ఆదా చేయడమే కాకూండా ఇది ఆర్థికాభివృద్ధికి కూడా దోహదపడుతుందని తెలుస్తోంది. ఈ వంతెన సేవ్రి లో మొదలై నవీ ముంబై లోని చిర్లే ను కలుపుతుంది.

16.50 కిలోమీటర్ల దూరం సముద్రం పై ఉండే ఈ వంతెన, 5.50 కిలోమీటర్లు భూమిపై ఉంటుంది.

వావ్ అనిపించే అటల్ సేతు : Wow Factors In Atal Sethu

Atal Sethu bridge

ఈ వంతెనను చాలా ఆధునికంగా నిర్మించారు. దీనిపై మొత్తం 400 సిసి కెమెరాలు అమర్చారు. ఈ వంతెనపై ప్రయాణిస్తున్న వాహనం ఎక్కడైనా, ఏదైనా అనుకోని పరిస్థితుల్లో ఆగిపోతే దానిని కంట్రోల్ రూమ్ లో ఉన్న సిబ్బంది వెంటనే గుర్తిస్తుంది.

ఇక శీతాకాలంలో ఇక్కడికి వచ్చే ఫ్లెమింగో పక్షులను దృష్టిలో పెట్టుకుని వంతెన కి ఒక వైపున సౌండ్ బారియర్ ను ఏర్పాటుచేశారు. పైగా సముద్ర జంతువులకు హాని కలిగించని లైట్లను ఈ వంతెనకు అమర్చారు. అంతే కాదు ఈ వంతెనకు ఓపెన్ రోడ్ టోలింగ్(Open Road Toling) సౌలభ్యం కూడా ఉంది.

ఈ సౌకర్యం ఉండటం వల్ల దీనిపై వెళ్లే వాహనాలు, టోల్ బూత్9Toll Booth) వద్ద ఆగి టోల్ రుసుము చెల్లించి వెళ్లే అవసరం ఉండదు. ఈ వంతెన పై టోల్ బూత్ లకి బదులు టోల్ ప్లాజా(Toll Plaza) లను ఏర్పాటుచేశారు. ఈ విధానంతో వంతెనపైకి వెళ్లే వాహనాలను గుర్తించి టోల్ మొత్తాన్ని ఎలక్ట్రానిక్ విధానంలో వసూలు చేయడం లో సహాయపడుతుంది.

ఇక సాధారణ ప్రయాణికులు, పాస్ హోల్డర్లకు రాయితీ కూడా ఇవ్వనున్నారు. అందుకోసం వంతెన ఒకవైపు ప్రయాణానికి మహారాష్ట్ర ప్రభుత్వం టోల్ రుసుమును 250 రూపాయలుగా నిర్ణయించింది.

ఈ వంతెనపై నిబంధనలు : Regulations on Atal Sethu

ఈ వంతెన ప్రారంభించడం వల్ల చాలా లాభదాయకంగా మారనుంది, ఈ అటల్ సేతు, నవీ ముంబై అంతర్జాతీయ విమానాశ్రయం(Navi Mumbai International Airport), ధమని ముంబై-పూణే ఎక్స్‌ప్రెస్‌వే, JNPT పోర్ట్, ముంబై గోవా హైవే(Mumbai Goa High way) మధ్య ప్రయాణం పెరుగుతుంది.

ఇప్పటివరకు ముంబై(Mumbai) లో ఉత్తరం నుండి దక్షిణం వైపు నడుస్తున్న ప్రయాణ సరళిని ఇకమీదట దక్షిణం వైపు నుండి ఉత్తరం వైపుకి మార్చేయబోతోంది. అయితే ఈ వంతెనపై వాహనాలు ఎలా పడితే అలా ప్రయాణించడానికి వీలు లేదు. ముంబై పోలీసులు కొన్ని నియమాలు నిబంధనలు పెట్టారు. వాటిని వాహనదారులు తప్పక పాటించాల్సిందే.

ఫోర్ వీల్ వెహికల్స్ కి మాగ్జిమమ్ స్పీడ్ 100 కిలోమీటర్స్ పర్ హవర్ గా నిర్ణయించారు. ఈ వంద కిలో మీటర్లు వేగం మించకూడని వాహనాల్లో కార్లు, టాక్సీలు, మినీ బస్సులు, టూ యాక్సిల్ బస్సులు ఉంటాయి. పైగా ఈ వాహనాలు బ్రిడ్జి ఎక్కే సమయంలో, అలాగే దిగే సమయంలో 40 కిలోమీటర్ల వేగాన్ని దాటకూడదు.

అయితే ముంబై వైపు ప్రయాణించే మల్టి యాక్సిల్ వెహికిల్స్, హెవీ వెహికిల్స్ తూర్పు ఫ్రీ వే లోకి రావాడానికి అనుమతి ఉండదు. ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ వంతెన పైకి ట్రాక్టర్లు9Tractors), మోటారు సైకిళ్లు(Motor cycles), మోపెడ్‌లు, లూనాలు, మూడు చక్రాల వాహనాలు, అంటే రిక్షాలు, ఆటోలు9Autos), అలాగే జంతువులతో నడిచే వాహనాలు అంటే యడ్ల బండ్లు, గుర్రపు జట్కాలు ప్రయాణించడానికి అనుమతి లేదు.

నిర్మాణ వ్యయం : Construction cost

ఈ వంతెన నిర్మాణానికి ప్రధాని మోదీ9Pm Narendra Modi) 2016 లో శంకుస్థాపన చేశారు. దీని నిర్మాణ వ్యయం 17,840 కోట్ల రూపాయలు. ప్రస్తుతం ఈ అటల్ సేతు(Atal Sethu) యొక్క ఉపయోగం మనకు 50 శాతం మాత్రమే కనిపిస్తుంది.

కానీ సెవ్రీ(Sewri) -వర్లీ(Worli) ఎలివేటెడ్ కారిడార్, మోటర్‌వేతో ప్రతిపాదించిన చిర్లే(Chirle) -పలాస్పే(Palaspe) ప్రాజెక్టు, నవీ ముంబై(Navi Mumbai) ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్, ఈస్టర్న్ ఫ్రీవే-మెరైన్ డ్రైవ్ టన్నెల్ వంటి అన్ని ప్రాజెక్టుల పనులు పూర్తయితే గనుక ఈ అటల్ సేతు యొక్క పూర్తి స్థాయి ఉపయోగాన్ని మనం చేసినవాళ్ళం అవుతాము. కాబట్టి దీని వల్ల ఎంత ఉపయోగం ఉందొ అర్ధం చేసుకోవచ్చు.

పెద్ద పెద్ద భవనాలు, పొడవైన వంతెనలు కట్టిన ప్రభుత్వం గా గుర్తింపు దక్కించుకోవడానికి మాత్రమే అయితే బీజేపీ సర్కారు(BJP Government) దీన్ని నిర్మించలేదని అర్ధం చేసుకోవచ్చు.

సముద్రం పై నిర్మించిన అతి పెద్ద వంతెన ఏది : Which is the longest bridge built over sea?

అయితే ప్రపంచం లోనే సముద్రం పై నిర్మించిన అతి పొడవైన వంతెన మాత్రం ఇది కాదు, చైనా(china) అత్యంత పొడవైన వంతెనను నిర్మించి తన ఖాతాలో ఆ రికార్డు వేసుకుంది.

చైనా(China) – హాంగ్‌కాంగ్(Hongkong) – మకావ్‌(Macaw)లను కలుపుతుంది ఈ వంతెన, ఈ వంతెనను 98 వేల కోట్ల వ్యయం తో నిర్మించారు. దీని పొడవు 55 కిలోమీటర్లు.

Leave a Comment