Bigg Boss Himaja controversy : బిగ్ బాస్ హిమజ పై వైరల్ న్యూస్.హిమజ లైవ్ వీడియోలోకి ఎందుకొచ్చింది.

Add a heading 2 1 Bigg Boss Himaja controversy : బిగ్ బాస్ హిమజ పై వైరల్ న్యూస్.హిమజ లైవ్ వీడియోలోకి ఎందుకొచ్చింది.

Bigg Boss Himaja controversy : బిగ్ బాస్ హిమజ పై వైరల్ న్యూస్.హిమజ లైవ్ వీడియోలోకి ఎందుకొచ్చింది.

సినిమా ఇండస్ట్రీ వారి మీద తరచూ ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేస్తుంటారు కొందరు ఆకతాయిలు. పాలనా హీరోయిన్ పాలనా హీరోతో ఎఫైర్ నడుపుతోందని, పాలనా కమెడియన్ చనిపోయాడని, పాలనా సినిమా ఆగిపోయిందని, ఇలా రకరకాలుగా రాసుకొస్తూ ఉంటారు. వాళ్ళ వెబ్ సైట్ కో లేదంటే యూట్యూబ్ ఛానెల్ కో వ్యూవర్ షిప్ కోసం ఆరాటపడుతూ పక్కవారిని బాధ పెడుతూ ఉంటారు. అయితే ఈ సారి ఇలా బాధ పడే వంతు బిగ్ బాస్ ఫేమ్ హిమజది అయ్యింది.

హైదరాబాద్ నగర శివారు లోని ఓ ఫామ్ హౌస్ లో రేవ్ పార్టీ పెట్టరని, అందులో పాల్గొన్న నటి హిమజాను పోలీసులు అరెస్ట్ చేశారని వార్తలు వైరల్ అయ్యాయి. హిమజా తో పటు ఈ పార్టీలో మరికొంత మంది టాలీవుడ్ సెలెబ్రెటీలు కూడా ఉన్నారని ఆ వార్త సారాంశం. అయితే ఈ ఫేక్ న్యూస్ బాగా వైరల్ కావడంతో అది హిమజా వరకు వెళ్ళింది. దీంతో ఆమె ఈ కధనం పట్ల వివరణ ఇచ్చుకోక తప్పలేదు. నటి హిమజ సోషల్ మీడియా వేదికగా స్పందించారు.

తనపై కొన్ని వెబ్ సైట్లు, కొన్ని యూట్యూబ్ ఛానెల్స్ కలిసి దుష్ప్రచారం చేశాయని అన్నారు. నిజ నిర్ధారణ చేసుకోకుండా తప్పుడు కథనాలను వండి వారిస్తున్న వారిపై మండి పడ్డారు. అసత్య ప్రచారాలకు తెరలేపుతున్న మీడియా ఛానల్స్ పై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఇక ఆమె ఏ రేవ్ పార్టీలకు వెళ్లలేదని, తనను పోలీసులు అరెస్ట్ చేయలేదని, తానూ ఏ పోలీస్ స్టేషన్ లో లేనని చెప్పుకొచ్చారు. పండగపూట తాను, తన ఇంట్లోనే ఉన్నానని, దీపావళిని జరుపుకుంటున్నామని అన్నారు. తన ఇంట్లో ఎదో జరుగుతోంది అన్న సమాచారం అందడంతో పోలీసులు తన ఇంటికి వచ్చిన మాట వాస్తవమేనని చెప్పారు.

కానీ తన ఇంటికి వచ్చిన పోలీసులు మొత్తం చెక్ చేసిన అనంతరం, అది తప్పుడు సమాచారం అని నిర్ధారించుకుని వెళ్లిపోయారని పేర్కొంది. తన పై సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న న్యూస్ గురించి తన ఫ్రెండ్స్ చెప్తే తెలిసిందని, అందుకే వెంటనే మొబైల్ లో వీడియో ఆన్ చేసి లైవ్ లోకి రావలసి వచ్చిందన్నారు. తాను ఏ పోలీస్ స్టేషన్ లో లేనని ఇంట్లోనే హాయిగా పండుగ జరుపుకుంటున్నామని అన్నారు. ఇలా తప్పుడు వార్తలు ప్రచురించి బాధించొద్దని విజ్ఞప్తి చేశారు.

Leave a Comment