Buchi Babu enters the Bigg Boss : బిగ్ బాస్ హౌస్ లోకి డైరెక్టర్ బుచ్చి బాబు.అంబటి అర్జున్ కి అదిరిపోయే ఆఫర్.ఏమిటా ఆఫర్.
సీరియల్ నటుడు బుచ్చిబాబు బిగ్ బాస్ హౌస్ లో హల్ చల్ చేస్తున్నాడు. వైల్డ్ కాదు ఎంట్రీ ద్వారా వచ్చిన అతడు, తనదైన అట తీరుతో చెలరేగిపోతున్నాడు. బిగ్ బాస్ ఎటువంటి టాస్క్ ఇచ్చినా, గేమ్ ఇచ్చినా రఫ్ఫాడించేస్తున్నాడు. అంతే కాదు గేమ్స్, టాస్కుల విషయంలో అర్జున్ అంబటి టాప్ ఫైవ్ లోనే ఉంటున్నాడు. పైగా అతడు ఒకసారి తన కెప్టెన్సీ కూడా ఎలా ఉంటుందో చూపించాడు. ఇక ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ లో ఫ్యామిలీ వీక్ నడుస్తోంది. ఇందులో భాగంగా హౌస్ మెంబర్స్ కి వారి వారి కుటుంబ సభ్యులను చూపెడుతూ బిగ్ బాస్ సర్ప్రైజ్ ఇస్తున్నాడు.
ఒక్కో రోజు ఒక్కొక్కరి ఫ్యామిలీ మెంబర్ హౌస్ లోకి వస్తున్నారు. అలా ఒక రోజు గర్భవతిగా ఉన్న అర్జున్ భార్య కూడా హౌస్ లోకి వచ్చింది. అర్జున్ బిగ్ బాస్ హౌస్ లో ఉండటం వల్ల భార్య సీమంతాన్నీ అతను చూడలేకపోయాడు. దీంతో హౌస్ మేట్స్ ఆమెకు సీమంతం ఫంషన్ కూడా చేశారు. బిగ్ బాస్ ఇంట్లోనే ఉన్న లేడి కంటెస్టెంట్లు ఆమెకు చీర, గాజులు పెట్టి బ్లెస్సింగ్స్ ఇచ్చారు. ఆ సమయంలో భార్య సురేఖ అర్జున్ కి ఒక సలహా కూడా ఇచ్చింది. నువ్వు హౌస్ లో టాస్కులు బాగానే ఆడుతున్నావు, కానీ ఎమోషన్స్ కూడా పండించాలని చెప్పింది. అందుకు అర్జున్ కూడా సరే అన్నట్టు చెప్పాడు.
ఇక దీపావళి పండుగ కావడంతో బిగ్ బాస్ హౌస్ లోకి సినిమా డైరెక్టర్ బుచ్చిబాబు మరో వ్యక్తి వచ్చారు. అయితే బుచ్చిబాబు అర్జున్ గురించే వచ్చినట్టు తెలుస్తోంది. హౌస్ లోకి వచ్చిన బుచ్చిబాబు అర్జున్ కి ఊహించని సర్ప్రైస్ ఇచ్చాడు. గ్లోబల్ స్టార్ రాంచరణ్ తో తాను చేయబోతున్న సినిమాలో అర్జున్ కి మంచి క్యారెక్టర్ ఇస్తున్నట్టు బిగ్ బాస్ వేదికగా అనౌన్స్ చేశారు. దీంతో అర్జున్ ముఖం వెయ్యి కాండిళ్ల బల్బ్ మాదిరిగా వెలిగిపోయింది. అర్జున్ కి సంబంధించిన టీమ్ కూడా బుచ్చిబాబుకి ధన్యవాదాలు తెలిపింది. ఇక రాబోయే రోజుల్లో అర్జున్ వెండి తెరపై స్టార్ హీరో సినిమాలో కనిపించబోతున్నాడు అని అర్జున్ ఫాలోవర్స్ కూడా మురిసిపోతున్నారు.