CAA Implementation of 2024: పౌరసత్వ సవరణ చట్టం(Citizenship Amendment Act). ఈ చట్టం గురించి కేంద్ర ప్రభుత్వం(Central Government) ప్రస్తావించిన సమయంలో నిరసన జ్వాలలు(Protests) ఎవసిపడ్డాయి. అనేక మంది వీధుల్లోకి వచ్చి,
ఈ చట్టాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. అయితే ఇప్పుడు మరోమారు ఈ పౌరసత్వ సవరణ చట్టం వ్యవహారం తెరపైకి వచ్చింది. ఈ చట్టాన్ని లోక్ సభ ఎన్నికలకి(Lok Sabha Elections) ముందే అమలు చేయాలనీ కేంద్ర సర్కారు భావిస్తోంది.
అంతే కాదు ఈ చట్టాన్నీ అమలు చేయడానికి సంబంధించిన నియమాలు, నిబంధనలు వంటి వాటిని కూడా త్వరలోనే ప్రకటించాలని యోచిస్తోంది.
ఈ నిబంధనలు జారీ చేసిన అనంతరం చట్టం అమలు చేయబడుతుంది అని అధికార యంత్రంగం ద్వారా తెలుస్తోంది. ఇక ఈ చట్టం అమల్లోకి వచ్చాక అర్హులైన వారిని భారతీయులుగా గుర్తించి వారికి భారతదేశ పౌరసత్వం కల్పించబడుతుంది.
అన్ని నిబంధనలు అందుబాటులో ఉంటాయి – All terms are available
ఇక దీనిని సంబంధించిన నిబంధనలు ఇప్పటికే సిద్ధంగా ఉన్నాయని, అవి ఆన్లైన్ లో అందుబాటులో ఉంటాయని, ఇక దీనికి సంబంధించిన పూర్తి ప్రక్రియ కూడా ఇంటర్నెట్ లో అందుబాటులో ఉంటుందని చెబుతున్నారు.
ఎటువంటి ప్రయాణ పత్రాలు లేకుండా భారతదేశంలోకి ప్రవేశించి సంవత్సరాన్ని దరఖాస్తుదారులు తప్పకుండ ప్రకటించాలి. అయితే అందుకు సంబంధించి నిరూపణ పత్రాలు ఇవ్వాలనే నిబంధన ఏమి లేదని అంటున్నారు అధికారులు.
CAA పై అమిత్ షా ఏమన్నారంటే – What does Amit Shah say about CAA?
డిసెంబర్ 31 2014 వరకు భారతదేశం లోకి వచ్చిన ముస్లిమేతర వలసదారులకు భారతజాతీయత కల్పించాలనే గొప్ప సంకల్పంతో ఈ చట్టాన్ని తెరపైకి తెచ్చినట్టు చెబుతున్నారు.
2014 డిసెంబర్ 31 నాటివరకు బాంగ్లాదేశ్(Bangladesh), పాకిస్తాన్(Pakistan), ఆఫ్గనిస్తాన్(Afghanistan) దేశాల నుండి హిందువులు(Hindus), జైనులు(Jains), పార్సీలు(Parsis), క్రిస్టియన్లు(Cristians),
బౌద్దులు(Budhists) హింసింపడిన కారణంగా భారత్ లోకి వలస వచ్చారు. అయితే ముస్లిమేతరులకు మాత్రమే పౌరసత్వం కల్పించాలని అనుకోవడం విపక్షాపూరితం అంటూ నిరసనలు పెల్లుబికాయి.
పైగా CAA నిబంధనలను నోటిఫై చేయాలనీ కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ(Bharatiya Janata Party) నిర్ణయించడాన్ని ప్రత్యర్థి పార్టీలు తప్పుబడుతున్నాయి.
బీజేపీ కి లోక్ సభ ఎన్నికల్లో పరాజయం తప్పదన్న భయం పట్టుకోవడంతోనే ఇలాంటి నిర్ణయం తీసుకుందని విమర్శిస్తున్నాయి.
CAA అంటే ఇది కూడా – CAA stands for this too
ఇక ఈ విషయం పై కేంద్ర హోమ్ శాఖా మంత్రి అమిత్ షా(Amith Shaa) మాట్లాడుతూ CAA అనేది భూమి చట్టమని, అది ఖచ్చితంగా అమలు చేసి తీరుతామని,
దానిని ఎవ్వరూ ఆపలేదని అన్నారు. పైగా ఈ చట్టాన్ని అమలు చేయడం అనేది పార్టీ నిబద్ధత అని వెల్లడించారు. భారతీయ జనతా పార్టీ అంటే,
అక్రమచోరబాటును, గోవుల అక్రమ రవాణాను వ్యతిరేకించడం మాత్రమే కాక, మతపరమైన హింసకు గురైన వారికి CAA ద్వారా పౌరసత్వం అందించి దేశంలో ఆశ్రయం కల్పించడం కూడా అని పేర్కొన్నారు.