Central minister will coming to Telangana: కేంద్రమంత్రి అమిత్ షా నేడు తెలంగాణకు రాక.
బీజేపీ ప్రభుత్వం రాబోయే పార్లమెంట్‌ఎన్నికల కోసం దేశ వ్యాప్తంగా తనదైన శైలిలో వ్యూహాలను రచిస్తోంది. దీనిలో భాగంగానేబీజేపీ ఇవాళ రాష్ట్ర విస్తృత స్థాయి సమావేశాన్ని నిర్వహిస్తోంది.
మండల స్ధాయి నుంచి జాతీయ స్థాయి నేతలు ఈ సమావేశానికి హాజరు కానున్నారు. ఈ సమావేశానికి కేంద్ర హోంశాఖమంత్రి అమిత్ షా ముఖ్య అతిధిగా హాజరుకానున్నారు.
ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల ఫలితాలపై సమీక్షించడంతో పాటు త్వరలో జరగబోయే లోక్ సభ ఎన్నికలకు పార్టీ శ్రేణులకు సరైన సూచనలను ఇచ్చి, వారికి దిశానిర్ధేశం చేయనున్నారు.
Also Read: ప్రజల కోసం ప్రజల్లో నుండి వస్తున్న నాయకుడు – యేలేటి సురేష్ రెడ్డి
పార్లమెంట్ ఎన్నికలకు సమాయత్తం కావడమే లక్ష్యంగా బీజేపీ రాష్ట్ర విభాగం నేడు సమావేశం నిర్వహిస్తోంది. రంగారెడ్డి జిల్లా కొంగరకలాన్‌లోని శ్లోక కన్వెన్షన్‌లో నిర్వహించే ఈ సమావేశం నిర్వహించనున్నారు.
అసెంబ్లీ ఎన్నికల ఫలితాల సమీక్షతోపాటు లోక్‌సభ ఎన్నికలకు పార్టీ శ్రేణులతో కూడా అమిత్ షా చర్చలు జరపనున్నారు. ఈ రోజు మధ్యాహ్నాం ఒంటిగంట 25 నిమిషాలకు శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకోనున్న ఆయన నేరుగా నొవాటెల్‌కు వెళ్ళి,
అక్కడ పార్టీ ముఖ్యనేతలతో సమావేశం కానున్నారు. తర్వాత ఛార్మినార్ భాగ్యలక్ష్మీ అమ్మవారిని దర్శించుకుని పూజలు నిర్వహించనున్నారు. అనంతరం శ్లోక కన్వెన్షన్‌కు వెళ్లి సాయంత్రం 5 గంటల 20 నిమిషాల వరకు విస్తృస్థాయి సమావేశంలో పాల్గొంటారు.
పార్టీ ఎమ్మెల్యేలతో భేటీ అయిన తర్వాత సాయంత్రం 6 గంటలకు తిరిగి దిల్లీ వెళ్లనున్నారు. అయితే,
దేశంలో పార్లమెంట్ ఎన్నికలు వచ్చే ఏడాది నాలుగో నెలల్లో జరగునున్నాయి.
ఈ నేపథ్యంలో బీజేపీ తమ నాయకులను ఇప్పటి నుంచే సిద్ధం చేస్తూ, ఆయా రాష్ట్రాల్లో ఉన్న ప్రముఖ పార్టీ నాయకులకు అగ్ర నేతలు దిశానిర్ధేశం చేయనున్నారు.
అదే క్రమంలో రాష్ట్రంలో బీజేపీ(BJP) గెలుపు దిశగా పయనించేందుకు నాయకులు కృషి చేస్తున్నారు. ఇప్పటికే జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అధికంగా సీట్లు రాకపోయినా,
ఓట్ల శాతం పెరిగిందని పార్టీ నాయకులు హర్షం వ్యక్తం చేస్తూ, పార్లమెంట్ ఎన్నికల పైన దృష్టిలో పెట్టుకొని ప్రచారం. ప్రారంభించారు