Captain Miller My story was copied said Tamil actor: నా కథ కాపీ కొట్టారు.’కెప్టెన్ మిల్లర్ ‘పై తమిళ నటుడి సంచలన ఆరోపణలు

website 6tvnews template 78 Captain Miller My story was copied said Tamil actor: నా కథ కాపీ కొట్టారు.'కెప్టెన్ మిల్లర్ 'పై తమిళ నటుడి సంచలన ఆరోపణలు

Captain Miller My story was copied said Tamil actor: తమిళ సూపర్ స్టార్ ధనుష్ (Dhanush)నటించిన ‘కెప్టెన్ మిల్లర్’ Captain Miller మూవీ సంక్రాంతి కానుకగా రిలీజై థియేటర్లలో విజయవంతంగా నడుస్తోంది. భారీ బడ్జెట్ తో విడుదలైన ఈ మూవీ ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబడుతోంది. బ్రేక్ ఈవెన్ వసూళ్ల వైపు దూసుకెళ్తోంది.

ఈ క్రమంలో ఈ సినిమాకు కొత్త ఇబ్బందులు ఎదురయ్యాయి. రైటర్ కమ్ డైరెక్టర్ కమ్ నటుడు వేలా రామమూర్తి (Vela Ramamoorthy) సంచలన ఆరోపనలు చేయడంతో కెప్టెన్ మిల్లర్ చిక్కులో పడింది.

ఇటీవల జరిగిన ఓ ఇంటర్వ్యూలో, వేలా రామమూర్తి ‘కెప్టెన్ మిల్లర్’ తాను రచించిన ‘పట్టతు యానై’ (Pattatu Yanai)అనే నవల నుంచి కాపీ కొట్టిన కథ అని ఆయన వెల్లడించారు. అంతే కాదు తన కథ కాపీ కొట్టిన కప్టెన్ మిల్లర్ టీమ్‌పై చర్యలు తీసుకోవాలని కోరారు.

అంతేకాదు త్వరలో తనకు న్యాయం జరగాలని వేలా రామమూర్తి దర్శకుల సంఘాన్ని ఆశ్రయించనున్నట్లు తెలుస్తోంది. దీంతో ప్రస్తుతం తమిళ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఇదే హాట్ టాపిక్ గా మారింది. వేలా రామమూర్తి ఇంటర్వ్యూ వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది.

Captain Miller Copied from the novel?: నవల నుండి కెప్టెన్ మిల్లర్ కాపీ ?

ధనుష్ హీరోగా అరుణ్ మాథేశ్వరం (Arun Matheswaran) డైరెక్షన్‎లో వచ్చిన మూవీ కెప్టెన్ మిల్లర్. ఈ యాక్షన్ థ్రిల్లర్ మూవీ ప్రేక్షకుల ప్రశంసలు అందుకుని బాక్సాఫీస్ లో భారీ కలెక్షన్లతో దూసుకెళ్తోంది. ఈ మూవీ ఫస్ట్ లుక్ నుంచి సిపిమా వరకు అన్నీ ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్నాయి. అందుకే ప్రమోషన్స్ సోసోగా ఉన్నా కలెక్షన్ల సునామీని సృష్టించింది.

సినిమా బ్రేక్ ఈవెన్ ను అందుకుంటున్న తరుణంలో ఓ కొత్త వివాదంలో పడింది. తమిళ సీనియర్ నటుడు, దర్శకుడు, రచయిత వేల రామమూర్తి సినిమాపై కాంట్రవర్సీ కామెంట్స్ చేశారు.

తాను రచించిన ‘పట్టత్తు యానయ్’ (Pattatu Yanai)అనే నవలను కాపీ కొట్టి కెప్టెన్ మిల్లర్ ను తెరకెక్కించారని రామమూర్తి ఆరోపించారు. సినిమా విడుదలకు ముందు ‘కెప్టెన్ మిల్లర్’ (Captain Miller) టీమ్ తన దగ్గరి నుంచి ఎలాంటి అనుమతి తీసుకోలేదని ఆయన తెలిపారు.

ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ..” నేను రాసిన నవల ‘పట్టతు యానై’ ఆధారంగా ‘కెప్టెన్ మిల్లర్’ రూపొందింది. నా కథను మేకర్స్ కాపీ కొట్టారు. నాకు న్యాయం జరగాలి. ఫిల్మ్ ఇండస్ట్రీలో నిజాయితీ లేదు. అందుకే న్యాయం కోసం నేను సినీ దర్శకుల సంఘానికి వెళ్తున్నాను.

లెజెండరీ డైరెక్టర్, యూనియన్ ప్రెసిడెంట్ భారతీరాజా (Bharti Raja) నాకు సహాయం చేస్తారని ఆశిస్తున్నాను.

Ramamurthy wanted justice for him : నాకు న్యాయం కావాలంటున్న రామమూర్తి .

కీర్తి, డబ్బు కోసమో ‘కెప్టెన్ మిల్లర్’ పై ఈ ఆరోపణలు చేయడం లేదని రామ మూర్తి స్పష్టం చేశారు. ఇప్పటికే తన టాలెంట్ తో ఇండస్ట్రీలో డబ్బు, ఫేమ్‌ను అనుభవించానని తెలిపారు.

ఈ ఇంటర్వ్యూలో రామమూర్తి ప్రాపర్టీ రైట్స్ గురించి ప్రస్తావించారు. తనకు న్యాయం కావాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలో అసలు రామమూర్తి చెప్పింది నిజమా, కాదా అని తెలుసుకోవడానికి ప్రేక్షకులు , ధనుష్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

అయితే ఈ అంశంపై ఇప్పటి వరకు కెప్టెన్ మిల్లర్ (Captain Miller) టీమ్ మాత్రం ఎలాంటి రెస్పాన్స్ ఇవ్వలేదు. ఇదిలా ఉంటే ఈ మూవీలో ధనుష్‌కు జోడీగా తమిళ బ్యూటీ ప్రియాంక మోహన్ (priyanka mohan) నటించింది. శివరాజ్ కుమార్ (shivaraj kumar), సందీప్ కిషన్ (sandeep kishan ), ఎలంగో కుమారవేల్‌ (Elango Kumaravel) లాంటి నటులు కీలక పాత్రల్లో నటించారు.

Leave a Comment