Chiranjeevi is all set for vishwambhara : మూడు దశాబ్దాలకుపైగా సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగుతున్నారు మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi).యాక్షన్, సెంటిమెంట్ , రొమాన్స్, డ్యాన్స్ అన్నింటిలోనూ నేటితరం హీరోలను సైతం వెనక్కి నెట్టి బాసు తన గ్రేసును చూపిస్తున్నారు.
ఒక్కసారి కమిట్ అయితే ఆ సినిమా కోసం ఎంత దూరానికి వెళ్లడానికైనా చిరు సై అంటారు. సినిమా ఏదైనా అందులోని పాత్రకు వంద న్యాయం చేస్తారు. స్టార్ హీరోనని ఎక్కడా యాటీట్యూడ్ చూపించకుండా డైరెక్టర్లు, ప్రొడ్యూజర్లతో ఫ్రెండ్లీగా మెలుగుతారు.
అందుకే మరి తెలుగు తమ్ముళ్లు ఆయన్ను ముద్దుగా అన్నయా అని పిలుస్తారు. అన్నయ్య సినిమా వస్తుందంటే చాలు ప్రేక్షకులకు ఓ పండుగా. ఆయన సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. ఏజ్ పెరుగుతున్నా చిరంజీవిలోని గ్రేస్ మాత్రం ఏమాత్రం తగ్గడం లేదు. 68 ఏళ్ల వయసులోనూ వరుసగా ప్రతి సంవత్సరం ఓ సినిమా చేస్తూ తన అభిమానులను అలరిస్తున్నారు.
గత ఏడాది మెగాస్టార్ నటించిన వాల్తేరు వీరయ్య (Walteru Veerayya) సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి హిట్ సాధించింది. ఆ వచ్చిన భోళా శంకర్ (Bhola Shankar)పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. దీంతో కథల ఎంపికలో చిరు ఆచితూచి అడుగులువేస్తున్నారు. ఫాంటసీ సినిమాలకు క్రేజ్ పెరగడంతో మెగాస్టార్ తన 156 చిత్రంగా విశ్వంభర Vishwambhara చేస్తున్నారు. బింబిసార (Bimbisara)ఫేమ్ డైరక్టర్ వశిష్ట(Vasishta) ఈ మూవీని డైరెక్ట్ చేస్తున్నారు. ఈ క్రమంలో మెగాస్టార్ భారీ కసరత్తులు షురూ చేశారు. తాజాగా చిరుకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది.
Getting Ready for ‘Vishwambhara’: ‘గెట్టింగ్ రెడీ ఫర్ విశ్వంభర’
‘విశ్వంభర’ (Vishwambhara) కోసం చిరంజీవి(Chiranjeevi) రెడీ అవుతున్నారు. జిమ్ లో భారీ కసరత్తులు మొదలు పెట్టారు. తాజాగా ఆయన ట్రాక్ సూట్ లో వర్కౌట్స్ చేస్తున్న వీడియోని తన ట్విట్టర్ వేదికగా షేర్ చేశారు. జిమ్ ట్రైనర్ సమక్షంలో మోగాస్టార్ హెవీ వర్కౌట్స్ చేయడం చూసి ఫ్యాన్స్ ఆశ్చర్యపోతున్నారు.
ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 68 ఏళ్ల వయసులోనూ చిరు జిమ్ లో భారీ వర్కౌట్స్ చేయడం చూసి మెగా ఫ్యాన్స్ తెగ మురిసిపోతున్నారు. కుర్రాళ్లకు ఏమాత్రం తీసిపోకుండా మెగాస్టార్ దుమ్ముదులుపుతున్నారు. అంతే కాదు ఈ వీడియో చివర్లో ‘గెట్టింగ్ రెడీ ఫర్ విశ్వంభర’ అంటూ క్యాప్షన్ ఇవ్వడంతో ఫ్యాన్స్ లో పూనకాలు మొదలయ్యాయి.
Vishwambhara Shooting in Hyderabad : హైదరాబాద్ లో ‘విశ్వంభర’ షూటింగ్
చిరంజీవి(Chiranjeevi)సినీ కెరియర్ లో 156వ సినిమాగా తెరకెక్కబోతోంది ‘విశ్వంభర’ (Vishwambhara). ఈ సినిమాలో చిరంజీవి సరసన తమిళ బ్యూటీ త్రిష (Trisha) నటించనున్నట్లు సమాచారం.
ఇక ఈ సినిమాలో తమిళ స్టార్ హీరో శింబు (Simbu) నెగిటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ పోషిస్టున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. భారీ బడ్జెట్ తో UV క్రియేషన్స్ (UV creations) సంస్థ విశ్వంభరను నిర్మిస్తోంది. ఆస్కార్ అవార్డు (Oscar Award winner)విన్నర్గ్రహీత ఎం ఎం కీరవాణి(MM Keeravani) మ్యూజిక్ అందిస్తున్నారు.
చోటా కె నాయుడు (Chota K Naidu)కు సినిమాటోగ్రఫీ బాధ్యతలు అప్పగించారు. రామ్ – లక్ష్మణ్ (Ram Lakshman )ఫైట్స్ కంపోజ్ చేస్తున్నారు. ‘విశ్వంభర’ షూటింగ్ మరో వారంలో స్టార్ట్ కానుంది. ఈ షెడ్యూల్ లోనే చిరంజీవి పాల్గొననున్నారు. ఇందుకోసం ఆర్ట్ డైరెక్టర్ హైదరాబాదులో ఓ భారీ సెట్ వేసినట్లు సమాచారం. ఈ షెడ్యూల్ లోనే చిరంజీవి, హీరోయిన్ కు మధ్య కొన్ని కీలకమైన సీన్స్ ఉంటాయని టాక్.
అయితే ఇప్పటివరకు విశ్వంభరలో హీరోయిన్ ఎవరనేది తెలియదు. ఈ క్రమంలో త్రిష పేరు ఇండస్ట్రీలో వినిపిస్తోంది. వచ్చే నెలలో హీరోయిన్ ఎవరు అనేదానిపై మేకర్స్ అఫీషియల్ గా ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.