Amara Raja 9500Cr Investment in Telangana: అమర్ రాజా(Amar Raja), ఈ పేరు తెలియని వారు చాలా తక్కువ మంది అని చెప్పొచ్చు. ప్రముఖ టాలీవుడ్ సూపర్ స్టార్ కృష్ణ(Hero Krishna) కి స్వయానా అల్లుడు గల్లా జయదేవ్(Galla Jaydev),
ప్రస్తుతం అయన గుంటూరు ఎంపీ(Gunturu MP) కూడా. అయినప్పటికీ అయన తన కంపెనీ విస్తరణ నిమిత్తం తెలంగాణనే(Telangana) ఎంచుకున్నారు. తెలంగాణ లో ఏకంగా 9,500 రూపాయలతో(₹9500Crores) పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమయ్యారు.
ఆంధ్ర ప్రదేశ్(Andhra Pradesh) లో అన్ని వనరులు ఉన్నప్పటికీ ఇంత పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టేందుకు అయన తెలంగాణ రాష్ట్రాన్నే ఎంచుకోవడానికి గల కారణాలు అనేకం అయి ఉండొచ్చు.
అయితే ఈ సదవకాశాన్ని తెలంగాణ లోని కాంగ్రెస్ సర్కారు(Congress Government) మాత్రం చక్కగా ఒడిసిపెట్టుకుంది. రెడ్ కార్పెట్ చేసి మరీ అమర్ రాజాను ఆహ్వానిస్తోంది.
పెట్టుబడులకు సీఎం రేవంత్ పిలుపు – CM Revanth Inviting investments
ఈ విషయమై తెలంగాణ ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి(Revanth Reddy) మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రాష్ట్ర పారిశ్రామికాభివృధికి కాంగ్రెస్ గవర్నమెంట్ ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని,
పారిశ్రామికవేత్తలు పెట్టుబడులతో వస్తే చాలు అన్ని రకాల సౌకర్యాలు, రాయితీలు కల్పించేందుకు సిద్ధంగా ఉన్నామని సీఎం రేవంత్ పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం పారిశ్రామిక అభివృద్ధి,
ఉపాధి కల్పనపై ప్రత్యేకంగా దృష్టి పెట్టామన్నారు. ఇక అమర్ రాజా(Amar Raja) తో భేటీ అయిన సమయంలో వారు ఇరువురు అనేక విషయాలపై చర్చించారు.
తెలంగాణ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ లో అమర్ రాజా ముఖ్య పాత్రధారి అని చెప్పారు. అమర్ రాజా నెలకొల్పబోయే అడ్వాన్స్‌డ్ కెమిస్ట్రీ సెల్ గిగా ఫ్యాక్టరీ(Advanced Chemistry Cell Giga Factory),
ప్యాక్ అసెంబ్లీ(Pack assembly), ఈ – పాజిటివ్ ఎనర్జీ ల్యాబ్‌లను(E – Positive Energy Lab) మెయిన్టైన్ చేసుకునేందుకు కూడా తెలంగాణ సర్కారు సహకారం అందిస్తుందని చెప్పారు.
ఇక క్లీన్ ఎనర్జీకి తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణా రాష్ట్రం ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటాయని పేర్కొన్నారు.
ఇంకా ఇన్వెస్ట్ చేసేందుకు రెడీ – గల్లా జయదేవ్ – Still ready to invest – Galla Jayadev
గతంలో అమర రాజా బ్యాటరీస్(Amar Raja Batteries) గా ఉన్న ఈ కంపెనీ ఇప్పుడు అమర రాజా ఎనర్జీ అండ్ మొబిలిటీ గా(Amara Raja Energy and Mobility) అవతరించింది.
లిథియం అయాన్(Lithium ion) బ్యాటరీల తయారీ కొరకు మహబూబ్నగర్(Mehaboob nagar) జిల్లా దివిటిపల్లి(Divitipally) గ్రామాన్ని ఎంచుకుంది,
ఆ గ్రామం సమీపంలో బ్యాటరీ తయారీకి సంబంధించిన గిగా ప్రాజెక్ట్ ను ఏర్పాటు చేసుకుంటోంది సదరు సంస్థ. ఇక ఈ ప్రాజెక్టు ఎంతవరకు వచ్చింది అన్న విషయాన్ని గల్లా జయదేవ్ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి,
పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు(Minister Sridhar Babu) కి వివరించారు. ఇక రేవంత్ సర్కారు అందిస్తున్న సహకారానికి గల్లా ధన్యవాదాలు తెలియజేశారు.
ఈ సహకారం భవిష్యత్తులో కూడా ఇలానే కొనసాగితే, తమ ప్రాజెక్టులను మరింత పెద్దఎత్తున విస్తరిస్తామని అన్నారు. దీనితోపాటు మరికొన్ని ఇతర రంగాల్లో అడుగుపెట్టేందుకు తాము సిద్ధంగా ఉన్నామని జయ్ దేవ్ వెల్లడించారు.