Complete Team Of Panjab Kings Eleven: ఐపీల్ లో పంజాబ్ కింగ్స్ ఎలెవన్ పూర్తి జట్టు.

website 6tvnews template 1 1 Complete Team Of Panjab Kings Eleven: ఐపీల్ లో పంజాబ్ కింగ్స్ ఎలెవన్ పూర్తి జట్టు.

2024 లో జరగబోయే ఐపీఎల్ IPL గురించి క్రికెట్ అభిమానులు ఎంతో ఆశక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ ఏడాది మార్చి 23వ తేదీ నుండి మే 29 వరకు నిర్వహించవచ్చని భావిస్తున్నారు. అయితే బీసీసీఐ BCCI ఈ విషయంలో తుది ప్రకటన వెలువరించాల్సి ఉంది. ఈ మధ్యనే జట్ల వేలం పాట కూడా జరిగింది.

వివిధ ఫ్రాంచైజీలు ఈ వేలం పాటలో పాల్గొన్నాయి. ఎవరైతే బాగా ఆడగలరు అనుకున్నారో వారిపై కోట్లు కుమ్మరించి కొనుగోలు చేశాయి. అయితే ఆషామాషీగా కొనుగోలు చేయలేదు. అంతకు ముందు జరిగిన 2023 ప్రపంచ పురుషుల వన్డే వరల్డ్ కప్(One Day World Cup) లో వాళ్ళ పెర్ఫార్మెన్స ను దృష్టిలో పెట్టుకునే వాళ్ళకు అంత రేటు పెంచాయి.

మునుపటి ఐపీఎల్ కన్నా ఈ ఐపీఎల్ లో రేటు తగ్గిన ఆటగాళ్లు ఉన్నారు, అలాగే రేటు పెరిగిన వాళ్ళు కూడా ఉన్నారు.

ఒక్కసారి కూడా కప్పు దక్కలేదు : Punjab Didn’t Won Title Even One Time


ఇక ఐపీఎల్ గురించి మాట్లాడాలంటే ఒక మాట చెప్పాలి, గడిచిన ఐపీఎల్ 16 సీజన్లలో ఒక్క సీజన్ లో కూడా కప్పు గెలవని జట్లు ఉన్నాయని తెలుసా మీకు. ఇప్పటివరకు కప్పు గెలవని జట్లు మూడు ఉన్నాయి. వాటిలో పంజాబ్ కింగ్స్ ఎలెవన్(Panjab Kings Eleven) కూడా ఒకటి.

పంజాబ్ కింగ్స జట్టు పరంగా చుస్తే మంచి ఆటగాళ్లతోనే నిండి ఉంటుంది. అసలు పంజాబ్ కిగ్స్ పై అంచనాలే లేనప్పుడు ఆ జట్టులో ఆటగాళ్లు చెలరేగిపోయి ఆడతారు. అయితే ప్రస్టిజియస్ పీరియడ్ లో మాత్రం బ్యాట్ కింద పడేసి చతికిల పడతారు. కొన్ని సందర్భాల్లో చివరి వరుకు వచ్చి కూడా చేతులెత్తేసిన దాఖలాలు ఉన్నాయి.

విజయమే పరమావధిగా పెట్టుకున్న పంజాబ్ కింగ్స్ ఎలెవన్ యాజమాన్యం జట్టు సారధులను మార్చి చూసింది. కానీ ఉపయోగం లేకపోయింది. ఈ జట్టుకి కెప్టెన్ గా వ్యవహరించిన ఆటగాళ్ల లిస్ట్ కు డా పెద్దదే. యువరాజ్‌‌ సింగ్‌‌(Yuvraj Sing), సంగక్కర(Sangarkara), గిల్‌‌క్రిస్ట్‌‌(Gill Crist) వంటి సీనియర్ ప్లేయర్లు మాత్రమే కాకుండా, మ్యాక్స్‌‌వెల్‌‌(Max Well), అశ్విన్‌‌(Ashwin), లోకేశ్‌‌ రాహుల్‌(Lokesh Rahul), శిఖర్ ధావన్‌(Shikar Dhawan) వంటి వారు కూడా కెప్టెన్లు గా పనిచేశారు.

ఆటగాళ్ల కోసం కోట్లు కుమ్మరించి : Crores Of Rupees Spent For Players

Punjab Kings PBKS Complete Team Of Panjab Kings Eleven: ఐపీల్ లో పంజాబ్ కింగ్స్ ఎలెవన్ పూర్తి జట్టు.


ఇక పంజాబ్ కింగ్స్ ఎలెవన్(panjab Kings) ఫ్రాంచైజీకి ఉన్న లోపం దుందుడుకు స్వభావం, ఆ స్వభావం తోనే అనేక పర్యాయాలు విజయాన్ని చేజార్చుకుంది. ఐపీఎల్ వేలం(IPL) లో కూడా అదే స్వభావాన్ని ప్రదిర్శించి ఆటగాళ్ల కోసం కోట్లు కుమ్మరించింది.

ఈ సారి ఎవరెవరిని ఎంత పెట్టి కొనుగోలు చేసింది అనేది చూద్దాం. హర్షల్ పటేల్(Harshal Patel) ను 11.75 కోట్ల రూపాయలు వెచ్చించింది, రిలీ రోసౌ(Rilee Rossouw) ను 8 కోట్ల రూపాయలు పెట్టి కొనేసింది, ఇక క్రిస్ వోక్స్(Chris Woakes) కోసం 4.20 కోట్లు ఖర్చు చేసింది.

వీరంతా బౌలింగ్ విషయంలో బలంగా ఉన్న ఆటగాళ్లు. వీరిని తీసుకుంటే ఖచ్చితంగా వికెట్లు పడగొట్టేయొచ్చు అని వారి ఆలోచన.

ఎవరెవరు ఏ దేశం వారంటే : Players Who Belongs To Which Country


పంజాబ్ కింగ్స్ ఎలెవన్ పూర్తి జట్టు ఇలా ఉంది. ఇందులో విదేశీ ఆటగాళ్లు ఎవరంటే ఇంగ్లాండ్(England) నుండి ముగ్గురు ఉన్నారు.

వారు జానీ బెయిర్ స్టో(Jonny Bairstow), లియామ్ లివింగ్‌స్టోన్(Liam Livingstone), క్రిస్ వోక్స్(Chris Woakes), దక్షిణాఫ్రికా(South Africa) నుండి ఇద్దరు ఉన్నారు, వారు క్రికెటర్ రిలీ రోసౌ(Rilee Rossouw), కగిసో రబడా(Kagiso Rabada), అలాగే ఆస్ట్రేలియా (Austrelia) నుండి ఒకరు ఉన్నారు.

అతనే నాథన్ ఎల్లిస్(Nathan Ellis), మిగిలిన వారంతా భారత ఆటగాళ్లే ప్రభ్‌సిమ్రాన్ సింగ్, జితేశ్ శర్మ, శిఖర్ ధావన్, హర్ప్రీత్ భాటియా, శశాంక్ సింగ్, అథర్వ టైడ్, రిషి ధావన్, సామ్ కరణ్, సిందర్ రాజా, శివమ్ సింగ్, అషుతోష్ శర్మ, విశ్వనాథ్ సింగ్, తనయ్ త్యాగరాజన్, హర్షల్ పటేల్, హర్‌ప్రీత్ బ్రార్, అర్ష్‌దీప్ సింగ్, రాహుల్ చాహర్, విద్వత్ కావేరప్ప, ప్రిన్స్ చౌదరి.

Leave a Comment