Film fare Awards Animal won 5 Awards : ఫిల్మ్‌ఫేర్‌ అవార్డుల్లో యానిమల్ హవా..ఏకంగా ఐదు అవార్డులు

website 6tvnews template 2024 01 29T110058.612 Film fare Awards Animal won 5 Awards : ఫిల్మ్‌ఫేర్‌ అవార్డుల్లో యానిమల్ హవా..ఏకంగా ఐదు అవార్డులు

Film fare Awards Animal won 5 Awards : బాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంతో ప్రెస్టీజియస్‎గా భావించే 69వ ఎడిషన్ ఫిల్మ్ ఫేర్ అవార్డుల(69th FilmFare Awards) వేడుక గుజరాత్ లోని గాంధీనగర్ లో అవంగరంగ వైభవంగా జరిగింది.

2003లో రిలీజైన సినిమాల్లో అత్యుత్తమైన సినిమాలకు అవార్డులను అనౌన్స్ చేశారు. ఈసారి ఫిల్మ్‌ఫేర్‌ వేడుకలో యానిమల్ తన దూకుడును ప్రదర్శించింది. వసూళ్ల పరంగానే కాదు అవార్డుల పరంగా కూడా యానిమల్ మూవీ రికార్డులను నెలకొల్పింది.

సౌత్ స్టార్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ (Sandeep Reddy Vanga) డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమా ఏకంగా ఐదు అవార్డులను గెలుచుకుంది.

ఇక ఈ మూవీతో పాటు 12th ఫెయిల్ (12th Fail)సినిమా కూడా ఏకంగా ఐదు అవార్డులను గెలుచుకుంది. ఉత్తమ హీరో, హీరోయిన్ గా బాలీవుడ్ బెస్ట్ జోడీ రణబీర్ కపూర్ (Ranbir Kapoor)ఆలియాభట్ (Alia Bhatt)లు అవార్డులను గెలుచుకున్నారు.

ఇక ఈ గ్రాండ్ ఈవెంట్‏ను బాలీవుడ్ ఫేమస్ ఫిల్మ్ మేకర్ కరణ్ జోహర్ (Karan Johar)హోస్ట్ చేయగా, బాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ కరీనా కపూర్ ( Kareena Kapoor),కరిష్మా కపూర్ (Karishma Kapoor), యంగ్ హీరోస్ వరుణ్ ధావన్ (Varun Dhavan), కార్తీక్ ఆర్యన్ (Karthik Aryan)ల స్పెషల్ డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

The best actors are Bollywood couple : ఉత్తమ నటీనటులు భార్యాభర్తలే..

2024 1largeimg 927590255 Film fare Awards Animal won 5 Awards : ఫిల్మ్‌ఫేర్‌ అవార్డుల్లో యానిమల్ హవా..ఏకంగా ఐదు అవార్డులు

ఫిల్మ్ ఫేర్ 2024 అవార్డుల వేడుకల్లో అరుదైన దృశ్యం ఆవిష్కృతమైంది. ఈ సంవత్సరం బెస్ట్ యాక్టర్, బెస్ట్ యాక్ట్రెస్ అవార్డులు బాలీవుడ్ భార్యాభర్తలను వరించాయి.

యానిమల్ Animal లో హీరోగా నటించిన రణ్‌బీర్‌కపూర్‌ (Ranbir Kapoor)కు ఉత్తమ హీరోఅవార్డు రాగా. రాకీ ఔర్ రాణి కి ప్రేమ్ కహానీ (Rocky Aur Rani Ki Prem Kahani)మూవీకి గాను ఆలియాభట్ (Alia Bhatt)ఉత్తమ నటిగా అవార్డు గెలుచుకుంది.. పెళ్లి తర్వాత ఈ జంటకు ఫిల్మ్ ఫేర్ అవార్డులు రావడం ఇది మొదటిసారి.

అయితే గత ఏడాది కూడా బెస్ట్ యాక్ట్రెస్ అవార్డును ఆలియా భట్ గెలుచుకుంది. గంగూభాయ్ కతియావాడి (Gangubai Kathiawadi)సినిమాకు గాను అవార్డు వచ్చింది. ఈ ఏడాది కూడా తగ్గేదేలేదంటూ ఈ బ్యూటీనే బెస్ట్ హీరోయిన్ గా హవా కొనసాగించింది.

Five awards for ‘Animal’ : ‘యానిమల్’ కు ఐదు అవార్డులు

MV5BNGViM2M4NmUtMmNkNy00MTQ5LTk5MDYtNmNhODAzODkwOTJlXkEyXkFqcGdeQXVyMTY1NDY4NTIw. V1 FMjpg UX1000 Film fare Awards Animal won 5 Awards : ఫిల్మ్‌ఫేర్‌ అవార్డుల్లో యానిమల్ హవా..ఏకంగా ఐదు అవార్డులు

ఫిల్మ్‌ఫేర్‌ అవార్డుల వేడుకల్లో యానిమల్(Animal) హవా కొనసాగింది. టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సందీప్‌ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) డైరెక్ట్ చేసిన యానిమల్‌ చిత్రానికి అవార్డుల పంట పండింది.

వసూళ్ల పరంగానే కాదు అవార్డుల పరంగా యానిమల్ దుమ్ముదులిపింది. ఉత్తమ హీరో, బెస్ట్ సింగర్, మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్, సౌండ్ డిజైన్ ఇలా మొత్తం ఐదు విభాగాల్లో యానిమల్ సినిమా అవార్డులను అందుకుంది.

Five awards for ’12th Fail’ : ’12th ఫెయిల్’కు ఐదు అవార్డులు

’12త్ ఫెయిల్'(12th Fail) సినిమా కూడా అవార్డు వేడుకలో దూకుడు ప్రదర్శించింది.

విమర్శకుల ప్రశంసలను సైతం పొందిన ఈ మూవీకి వరుసగా ఐదు అవార్డులు వచ్చాయి. ఈ సినిమాలో హీరోగా నటించిన విక్రాంత్ మెస్సీ (Vikrant Messe)కి బెస్ట్ యాక్టర్ గా ఫిల్మ్‎ఫేర్ క్రిటిక్స్ అవార్డును గెలుచుకున్నాడు.

అంతే కాదు స్క్రీన్ ప్లే, ఎడిటింగ్, డైరెక్షన్ విభాగాల్లోనూ అవార్డులను అందుకుంది. ఇక ‘రాకీ ఔర్ రాణి కి ప్రేమ్ కహాని’ (Rocky Aur Rani Ki Prem Kahani)మూవీ కూడా నాలుగు అవార్డులను గెలుచుకుంది.

The winners list of 69th Filmfare Awards: 69వ ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ విన్నర్స్ లిస్ట్

  • ఉత్తమ చిత్రం: 12th ఫెయిల్‌ (12th Fail)
  • ఉత్తమ చిత్రం (Critics): జొరామ్‌ (Zoram)
  • ఉత్తమ దర్శకుడు: విధు వినోద్‌ చోప్రా (Vidhu Vinod Chopra)(12th ఫెయిల్‌)
  • ఉత్తమ నటుడు: రణ్‌బీర్‌ కపూర్‌ (Ranbir Kapoor) (Animal)
  • ఉత్తమ నటుడు (Critics): విక్రాంత్‌ మెస్సె (Vikrant Messe)(12th ఫెయిల్‌)
  • ఉత్తమ నటి: అలియా భట్‌ (Alia Bhatt) (రాఖీ ఔర్‌ రాణికి ప్రేమ్‌ కహానీ)
  • ఉత్తమ నటి (Critics): రాణీ ముఖర్జీ (Rani Mukherjee)(మిస్సెస్‌ ఛటర్జీ Vs నార్వే), షఫాలీ షా (త్రీ ఆఫ్‌ అజ్‌)
  • ఉత్తమ సహాయ నటుడు: విక్కీ కౌశల్‌ (Vicky Kaushal)(డంకీ)
  • ఉత్తమ సహాయ నటి: షబానా అజ్మీ (Shabana Azmi) (రాఖీ ఔర్‌ రాణి కీ ప్రేమ్‌ కహానీ)
  • ఉత్తమ గీత రచయిత: అమితాబ్‌ భట్టాచార్య (Amitabh Bhattacharya) (తెరె వాస్తే..: జరా హత్కే జరా బచ్కే)
  • ఉత్తమ మ్యూజిక్‌ ఆల్బం: యానిమల్‌ (Animal)
  • ఉత్తమ నేపథ్య గాయకుడు: భూపిందర్‌ బాబల్‌ (Bhupinder Babal) ( అర్జన్‌ వెయిలీ- యానిమల్‌)
  • ఉత్తమ నేపథ్య గాయకురాలు: శిల్పా రావు (Shilpa Rao) (చెలెయ- జవాన్‌)
  • ఉత్తమ కథ: అమిత్‌ రాయ్‌ (Amit Roy)(OMG 2)
  • ఉత్తమ స్క్రీన్‌ప్లే: విధు వినోద్‌ చోప్రా (Vidhu Vinod Chopra) (12th ఫెయిల్‌)
  • ఉత్తమ డైలాగ్‌: ఇషితా మొయిత్రా (Ishita Moitra) (రాఖీ ఔర్‌ రాణి కీ ప్రేమ్‌ కహానీ)

Leave a Comment