Gas Cylinder 500rs And Free Electricity: తెలంగాణా(Telangana) రాష్ట్రంలో కాంగ్రెస్(Congress) పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు ఆరు గ్యారంటీలు చాలా బాగా పనిచేశాయని చెప్పడంలో సందేహం లేదు.
అయితే ఎన్నికల్లో విజయం సాధించిన కొద్దీ రోజులకే కాంగ్రెస్ ప్రభుత్వానికి సీఎం రేవంత్ రెడ్డికి(Cm Revanth Reddy) ఈ సంక్షేమ పధకాల అమలుపై పలు ప్రశ్నలు ఎదురయ్యాయి.
Also Read: 6 gaurantee Asara pension
ఈ పధకాలను ఎప్పుడు రుమాలు చేస్తారు, ఎలా అమలు చేస్తారు అనే అంశాలను చెప్పాలంటూ ప్రత్యర్థి పార్టీలు ఎత్తిచూపాయి. ఈ విషయాలపై సీఎం హోదాలో ఉన్న రేవంత్ రెడ్డి స్పందించారు.
ఎన్నికల సమయంలో తాము ప్రకటించిన ఆరు గ్యారంటీలను అధికారం చేపట్టిన 100 రోజుల్లోగా పూర్తి చేస్తామని చెప్పుకొచ్చారు. చెప్పిన విషయంగానే ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం(Free Bus Journey For Ladies),
ఆరోగ్యశ్రీ(Arogya Sri) 10 లక్షల రూపాయలకు పెంచడం వంటి అంశాలను పూర్తి చేసింది. అదే విధంగా రానున్న మరో వారం రోజుల్లోగా 500 రూపాయలకే వంట గ్యాస్ సిలిండర్(Coocking Gas),
అలాగే 200 యూనిట్ల ఉచిత విద్యుత్(200 Units Free Electricity) వంటి రెండు హామీలను కూడా అమలు చేయడానికి సిద్ధమైనట్టు తెలుస్తోంది. ఈమేరకు క్యాబినెట్ సమావేశంలో సీఎం రేవంత్,
డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క(Mallu Bhatti Vikramarka), అలాగే పలువురు మంత్రులు ఉన్నతాధికారులు పాల్గొననున్నారు. ఈ అంశాలపై సాధ్యాసాధ్యాలను చర్చించి ఎప్పటిలోగా అమలు చేస్తారని వెల్లడించనున్నారు.
ప్రజాపాలన తో దరఖాస్తుల స్వీకరణ : Receiving Aplications Through Prajapalana)
ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు ప్రభుత్వం లబ్దిదారులను గుర్తించనుంది, అందుకోసమే ప్రజాపాలన పేరిట కార్యక్రమాలను చేపట్టి వారినుండి దరఖాస్తులు స్వీకరించింది.
ఆ దరఖాస్తులలో ఉన్న డేటా మొత్తాన్ని సేకటించి కంప్యూటరైజ్ చేసి దాని నుండి అసలైన లబ్దిదారులను ఎంపిక చేస్తారు.
ఇక లబ్ధిదారుల పూర్తి డేటా అందిన వెంటనే ఆయా సంక్షేమ కార్యక్రమాలను(Welfare Schemes) అమలు చేసేందుకు ఎంత మేర నిధులు అవసరం ఉంటాయా అన్నదానిపై ప్రభుత్వం ఒక నిర్ధారణకు వస్తుంది. దాని వల్ల పధకాల అమలుకు తేలిక అవుతుందని వారు భావిస్తున్నారు.