Good news for Telangana Special Trains To Ayodhya: అయోధ్య రామమందిరం Ayodhya Rama Temple ప్రారంభమైంది, బాల రామయ్య భక్తులకు దర్శనమివ్వడం మొదలు పెట్టాడు. బంగారు రామయ్యను దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నారు.
జనవరి 22వ తేదీన రామ మందిరంలో బాల రాముడిని ప్రధాని నరేంద్ర మోదీ(Narendra Modi?) ప్రతిష్టించారు.
ఆ కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం లో చుసిన వారంతా కూడా ఎప్పుడెప్పుడు రామయ్య ను నేరుగా చూడాలా అని ఉవ్విళ్లూరుతున్నారు.(Special Trains From Telangana To Ayodhya) అటువంటి వారికి భారతీయ జనతా పార్టీ ఒక శుభవార్త వినింపించింది.
బీజేపీ(BJP) ఆధ్వర్యంలో తెలంగాణ(Telangana) రాష్ట్రం నుండి ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసి రామ భక్తులను అయోధ్యకు తీసుకువెళ్లే మహత్కార్యాన్ని చెప్పుతారు ఆపార్టీ ముఖ్య నేతలు. అయితే ఆ స్పెషల్ ట్రైన్స్ ఎక్కడి నుండి ఏయే తేదీల్లో బయలు దేరతాయి అనేది చూద్దాం.
ఎక్కడెక్కడి నుండి అంటే : Trains starting point
ఈ నెల 29వ తేదీన సికింద్రాబాద్(Secundrabad), 30వ తేదీన వరంగల్, 31వ తేదీన హైద్రాబాద్, ఫిబ్రవరి 1వ తేదీన కరీంనగర్, 2వ తేదీన మల్కాజిగిరి, 3వ తేదీన ఖమ్మం, 5వ తేదీన చేవేళ్ల,6వ తేదీన పెద్దపల్లి, 7వ తేదీన నిజామాబాద్, 8వ తేదీన ఆదిలాబాద్, 9వ తేదీన మహబూబ్ నగర్, 10వ తేదీన మహబూబాబాద్, 11వ తేదీన మెదక్, 12వ తేదీన భువనగిరి, 13వ తేదీన నాగర్ కర్నూల్, 14వ తేదీన నల్గొండ, 15వ తేదీన జహీరాబాద్(Special Trains From Telangana To Ayodhya) పార్లమెంట్ నియోజకవర్గాల ప్రజలను అయోధ్యలో రామయ్య దర్శనానికి తీసుకెళ్లనున్నారు.
ఈ రైలులో ప్రతి భోగి లో ఒక బీజేపీ ఇంచార్జ్ ఉంటాడు, అలాగే 20 బోగీలు ఉండే ఈ రైళ్ల లో 1400 మందిని తీసుకెళ్తారని అంటున్నారు.
ప్రధాని మోదీ సన్మానం : PM Modi Facilitated Rama Temple Builders
ఇక జనవరి 22వ తేదీ న జరిగిన ఈ వేడుక గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి, లక్షల సంఖ్యలో భక్తులు తరలి రాగా వేల సంఖ్యలో విఐపీలు విచ్చేశారు.
ఈ రామాలయ నిర్మాణం లో శ్రమించిన కూలీలను ప్రధాని మోదీ(PM Modi) ప్రత్యేకంగా సన్మానించారు. వారిని ప్రత్యేకంగా కుర్చీలు వేసి కూర్చోబెట్టి వారిపై ప్రధాని చేతులతోనే పూలు చల్లారు. ఈ వీడియోలు నెట్టింట వైరల్ గా మారాయి.