Guntur Kaaram all time record collections: రూ.212 కోట్ల వసూళ్లతో గుంటూరు కారం ఆల్ టైమ్ రికార్డ్

website 6tvnews template 41 Guntur Kaaram all time record collections: రూ.212 కోట్ల వసూళ్లతో గుంటూరు కారం ఆల్ టైమ్ రికార్డ్

Guntur Kaaram all time record collections: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu)నటించిన గుంటూరు కారం (Guntur Kaaram)సినిమాకు నెగటివ్‌ కామెంట్లు వచ్చినా కూడా బాక్సాఫీస్‌ ను భారీ వసూళ్లతో బద్దలుకొడుతోంది. తగ్గేదేలేదంటూ వసూళ్ల సునామీతో దూసుకెళ్తోంది.

త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas) దర్శకత్వంలో వచ్చిన గుంటూరు కారం మూవీ ,టాక్‌తో సంబంధం బాక్సాఫీస్‌ను ఓ ఊపు ఊపేస్తోంది.

సంక్రాంతి గిఫ్ట్ గా జనవరి 12న విడుదలైని ఈ చిత్రం ఫస్ట్ వీక్ లోనే రూ. 212 కోట్లు వసూళ్లను రాబట్టి ఆల్ టైమ్ రికార్డ్ సృష్టించింది. ఈ విషయాన్ని మేకర్స్ తాజాగా అఫీషియల్‌గా అనౌన్స్ చేశారు.

Mahesh Babu All Time Record : మహేష్ బాబు ఆల్ టైమ్ రికార్డ్

తెలుగులో మాత్రమే విడుదలైన గుంటూరు కారం (Guntur Kaaram) సినిమా వసూళ్ల పరంగా అరుదైన రికార్డ్‌ను నెలకొల్పింది. రిజనల్‌ ఫిల్మ్ గా గుంటూరు కారం అత్యధిక కలెక్షన్లు రాబట్టింది. మహేశ్ బాబు (Mahesh Babu) కెరీర్​లో రూ.200 కోట్లకు పైగా గ్రాస్ మార్క్‌ను అందుకోవడం ఇది హ్యాట్రిక్ అని చెప్పాలి. అంతే కాదు రూ. 100 కోట్ల క్లబ్‌ (100 crores club)లో మహేశ్‌ బాబు దాదాపు ఐదు సినిమాలు నిలిచాయి .

టాలీవుడ్‌ ఇండస్ట్రీలో ఈ రికార్డ్‌ కేవలం మహేశ్‌ పేరుతో మాత్రమే ఉంది. వాస్తవానికి యావరేజ్ టాక్ వచ్చిన మూవీలో వంద కోట్ల షేర్ ని కొల్లగొట్టడం అంత సులువైన పని కాదు. ఇదే టాక్ తో వేరే సినిమాలు విడుదలైతే రెండో రోజుకే దుకాణం సర్దేసేవి. కానీ ఇక్కడుంది టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు. ఆయన మ్యాజిక్ గుంటూరు కారంలో బాగా వర్కౌట్ అయ్యిందనే చెప్పాలి.

గుంటూరు కారంతో మహేష్ బాబు అయిదు సార్లు వంద కోట్లని రాబట్టిన సౌత్ హీరోగా టాలీవుడ్ లో హిస్టరీని క్రియేట్ చేశాడు. మహేష్ అంతకు ముందు నటించిన శ్రీమంతుడు (Srimanthudu), భరత్ అనే నేను (Bharath Ane nenu), మహర్షి (Maharshi), సరిలేరు నీకెవ్వరూ (Sarileru nekevvaru), సర్కారు వారి పాట (Sarkaruvari pata)సినిమాలు కోట్ల క్లబ్ లో ఉన్నాయి. తాజాగా గుంటూరు కారం కూడా ఈ క్లబ్ లో చేరిపోయింది.

WhatsApp Image 2024 01 19 at 1.01.21 PM Guntur Kaaram all time record collections: రూ.212 కోట్ల వసూళ్లతో గుంటూరు కారం ఆల్ టైమ్ రికార్డ్

Gunturkaraam movie star cast :

హారిక అండ్ హాసిని క్రియేషన్స్ (Harika and Hasini creations)పతాకంపై ఎస్.రాధాకృష్ణ (Radha krishna) గుంటూరు కారం మూవీని భారీ బడ్జెట్ తో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించారు. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) హీరోగా, త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ మూవీని డైరెక్ట్ చేశారు.

యువ కథానాయికలు శ్రీలీల (Srileela), మీనాక్షి చౌదరీ (meenakshi Choudary)తో పాటు సీనియర్ యాక్టర్స్ జగపతిబాబు (Jagapathi Babu), ప్రకాశ్ రాజ్ (Prakash Raj), రావు రమేశ్ (Rao Ramesh), రమ్యకృష్ణ (Ramya Krishna)ఇతరులు ప్రధాన పాత్రల్లో కనిపించారు. దాదాపు రూ.200 కోట్ల బ‌డ్జెట్‌తో గుంటూరు కారం తెరకెక్కించారు మేకర్స్. తెలుగు రాష్ట్రాల్లో మ‌హేష్‌బాబుకు ఉన్నక్రేజ్ దృష్ట్యా మొదటి వారంలోనే సినిమాకు పెట్టిన పెట్టుబడి వచ్చేసింది.

ఇప్పుడు తరువాత వచ్చేదంతా మేకర్స్ కు లాభమేనని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఫిబ్రవరీ వరకు పెద్ద సినిమాల విడుదల లేదు కాబట్టి గుంటూరు కారం ఎంతలేదన్నా 300 కోట్ల వ‌ర‌కు వసూలు చేస్తుందని అంచ‌నా వేస్తున్నారు.

Leave a Comment