Breaking News

Guntur Kaaram Do you know second actor name? : గుంటూరు కారం సినిమా నుండి అదిరిపోయే అప్ డేట్.మహేష్ సినిమాలో కనిపించే మరో స్టార్ హీరో ఎవరో తెలుసా.

Add a heading 40 Guntur Kaaram Do you know second actor name? : గుంటూరు కారం సినిమా నుండి అదిరిపోయే అప్ డేట్.మహేష్ సినిమాలో కనిపించే మరో స్టార్ హీరో ఎవరో తెలుసా.

Guntur Kaaram Do you know second actor name? : గుంటూరు కారం సినిమా నుండి అదిరిపోయే అప్ డేట్.మహేష్ సినిమాలో కనిపించే మరో స్టార్ హీరో ఎవరో తెలుసా.

సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న తాజా చిత్రం గుంటూరు కారం, ఈ సినిమా నుండి వదులుతున్న పోస్టర్లు కానీ, పాటలు కానీ ప్రిన్స్ ఫాన్స్ కి మాంచి కిక్కిస్తున్నాయి. త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమా లో మహేష్ సరసన శ్రీ లీల నాయికగా నటిస్తోంది. ఇప్పటికే భగవంత్ కేసరి తో శ్రీ లీల, సర్కారు వారి పాట తో మహేష్ మంచి జోరు మీదున్నారు.

మరి వీరిద్దరూ కలిసి తెరపై కనిపిస్తే చూడాలని వారి ఫాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. అయితే మహేష్ కి త్రివిక్రమ్ తో వర్క్ చేయడం కొత్తేమీ కాదు వారిద్దరూ కలిసి అతడు, ఖలేజా కోసం పని చేశారు. ఈ రెండు సినిమాల్లో మహేష్ ను రెండు విభిన్న మైన పాత్రల్లో చూపెట్టాడు మాటల మాంత్రికుడు. మరి ఈ మూవీ లో ఎలా చూపెడతారు అని అంతా ఆతృతగా ఎదురు చూస్తున్నారు.

ఈ సినిమా మాస్ మసాలా యాక్షన్ ఎంటర్టైనర్ గురించి మరో ఫ్రెష్ అప్ డేట్ వచ్చింది. గుంటూరు కారం సినిమాలో jr ఎన్టీఆర్ గెస్ట్ రోల్ లో కనిపించనున్నారని టాక్ వినిపిస్తోంది. అరవింద సామెత వీర రాఘవ రెడ్డి సినిమాకు, గుంటూరు కారం సినిమాకు ఒక చిన్న లింక్ పెడుతూ తారక్ ను గుంటూరు కారంలో చూపెట్టాలని ప్లాన్ చేస్తున్నారట.

అందుకే మొదట ఈ సినిమాలో నాయికగా తీసుకున్న పూజా హెగ్డే ను తప్పించి శ్రీలీల ను తెరపైకి తెచ్చారట. మాములుగా అయితే గుంటూరు కారం ఎప్పుడో రిలీస్ కావలసిన సినిమా. కానీ మహేష్ ఇంట వరుస విషాదాలు జరుగుతూ ఉండటంతో సినిమా కూడా వాయిదా పడుతూ వచ్చింది.

అయితే ఈ గ్యాప్ ను డైరెక్టర్ స్టోరీ ఇంప్రవైజేషన్ కోసం వాడుకున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే గుంటూరు కారం సినిమా నుంచి విడుదలైన గ్లింప్స్ , ధమ్ మసాలా సాంగ్ సినిమా పై హైప్ పెంచేశాయి. హారికా &హాసిని క్రియేషన్స్ పతాకంపై ఎస్ రాధాకృష్ణ ఈ సినిమాను నిర్మిస్తుండగా, ఎస్.ఎస్ థమన్ స్వరాలను సమకూరుస్తున్నారు. జగపతి బాబు, రమ్య కృష్ణ కీలక పాత్రల్లో కనిపించనున్న ఈ సినిమా సంక్రాతి కానుకగా ప్రేక్షకుల ముందుకి రానుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *