Guntur Kaaram First day collections : గుంటూరు కారం మొదటి రోజు కలెక్షన్లు ఎంత రావచ్చంటే?

website 6tvnews template 15 Guntur Kaaram First day collections : గుంటూరు కారం మొదటి రోజు కలెక్షన్లు ఎంత రావచ్చంటే?

Guntur Kaaram First day collections : మహేష్ బాబు(Mahesh Babu) సినిమా విడుదల అవుతుంది అంటే చాలా రెండు తెలుగు రాష్ట్రాల్లోని సినీ ప్రియులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తుంటారు. ఎప్పుడెప్పుడు సినిమా చూద్దామా అని ఈగర్ గా వెయిట్ చేస్తారు.

తెల్లవారు ఝామున పడే బెనిఫిట్ షో గనుక ఉంటె దానికే టికెట్లు బుక్ చేసుకుని హాల్ దగ్గర పడిగాపులు కాస్తారు. తెరపై మహేష్ బొమ్మ కనిపిస్తే చాలు ఈలలు, కేకలు వేస్తారు. సినిమా అయిపోయే వరకు తెరపై పూలు, కాగితాలు జల్లుతూనే ఉంటారు.

Also read : Guntur Kaaram ticket price

ఈ హంగామా గుంరించి చెబితేనే ఇలా ఉంది అంటే కళ్ళతో చుస్తే ఆ కిక్కే వేరు. ఇక గుంటూరు కారం Guntur kaaram సినిమా విషయానికి వస్తే ఈ సినిమా ను త్రివిక్రమ్(Trivikram Srinivas) డైరెక్ట్ చేశాడు. మహేష్ త్రివిక్రమ్ కాంబోలో వస్తున్నా ఈ సినిమా లో మహేష్ ఫుల్ మాస్ లుక్ లో అదరగొట్టాడు. మునుపెన్నడూ లేని విధంగా డాన్సులతో అదరగొట్టేశాడు.

హీరోయిన్ శ్రీలీలకి(Srileela) ఎక్కడా తగ్గకుండా స్టెప్పులేశాడు. ఇక సినిమా విడుదలవడానికి ముందు నుండి కుర్చీ మడతపెట్టి అనే సాంగ్ ప్రేక్షకులను ఉర్రుతలూగిస్తోంది. ఈ సినిమాలో హేమా హేమీలు, జమాజటీలవంటి నటులున్నారు.

రమ్య కృష్ణ(Ramya Krishna), ఈశ్వరి రావు(Eswari Rao), ప్రకాష్ రాజ్(Prakash Raj), జయరాం(jayaram), జగపతిబాబు(Jagapathi Babu), మురళీశర్మ(Murali Sharma) వంటి వారు ముఖ్య పాత్రలు పోషించారు.

కలెక్షన్లు చుస్తే మతి పోవాలి : Shocking numbers of Collections

guntur kaaram 1 e1703682552377 Guntur Kaaram First day collections : గుంటూరు కారం మొదటి రోజు కలెక్షన్లు ఎంత రావచ్చంటే?


ఇన్ని స్పెషాలిటీస్ ఉన్న సూపర్ స్టార్ సినిమా ఎలా ఉంటుందో పక్కన పెడితే మొదటి రోజు కలెక్షన్లు ఎలా ఉండొచ్చు అన్నది చూద్దాం. మహేష్ సినిమా మొదటి రోజు సుమారుగా 40 కోట్ల(₹40Crores) రూపాయల ఓపెనింగ్స్ రాబడుతుందని అంచనా వేస్తున్నారు.

ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్ తో 20 కోట్లు(₹20 Crores) గుంటూరు కారం ఖాతా లో పడిపోయాయి. థియేటర్ కి వెళ్లి టికెట్ తీసుకునే వారి వల్ల మరో 20 కోట్లు(₹20Crores) వస్తాయని అంచనా వేస్తున్నారు. 12వ తేదీన విడుదలైన ఈ సినిమా 13, 14 వ తేదీల్లో కలుపుకుని 80 కోట్లు(₹80Crores) వసూళ్లు రాబడుతుందని భావిస్తున్నాయి. ఇండస్ట్రీ వర్గాలు.

ఇక దీనికి తగ్గట్టు సినిమా టికెట్ ధరలను పెంచుకోవడానికి ఆంధ్ర(Andhra) తెలంగాణ(Telangana) రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు పర్మిషన్లు ఇచ్చేశాయి. తెలంగాణ లో సింగిల్ స్క్రీన్ థియేటర్ లో ఇప్పుడున్న టికెట్ ధర కన్నా 65 రూపాయలు పెంచుకోవచ్చని, మల్టీప్లెక్సుల్లో టికెట్ పై 100 రూపాయలు పెంచుకునే వీలు కల్పించింది.

పైగా రిలీజ్ రోజున బెనిఫిట్ షోలు వేసుకునేందుకు కూడా అనుమతి ఇచ్చారు. ఇది కేవలం రిలీజ్ ఒక్కరోజు మాత్రమే కాదు 12వ తేదీ నుండి 18వ తేదీ వరకు తెలంగాణ లో గుంటూరు కారం సినిమా ను 5 షోలు ప్రదర్శించుకునేందుకు అవకాశం కల్పించారు.

Leave a Comment