Guntur kaaram movie review: మహేష్ నటించిన గుంటూరు కారం రివ్యూ

website 6tvnews template 12 Guntur kaaram movie review: మహేష్ నటించిన గుంటూరు కారం రివ్యూ

Guntur kaaram movie review: పుష్కర కాలం తరవాత మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్ సెట్ అయింది, వారిద్దరి కాంబినేషన్ లో తెరకెక్కిన సినిమా గుంటూరు కారం(Guntur kaaram movie review). గతంలో వచ్చిన అతడు, ఖలేజా సినిమాల రిజల్ట్ ఎలా ఉన్నా, ప్రేక్షకుల ఆదరణ మాత్రం మెండుగా పొందాయి. అతడు సినిమా అయితే ఏకంగా తెలుగు క్లాసిక్ సినిమాల్లో ఒకటి గా చేరిపోయింది.

ఇక ఇప్పడు గుంటూరు కారం సినిమా విషయానికి వస్తే ఈ సినిమా లో మహేష్ ఊర మాస్ గెటప్, డాన్సులు, డైలాగులు సినిమాపై విపరీతమైన క్రేజ్ ను పెంచేశాయి.

ఇప్పటి వరకు రిలీజైన లిరికల్ వీడియో పాటలు, ట్రైలర్లు, టీజర్లు, సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లు అన్ని కూడా సినిమా పై విపరీతమైన హైప్ ను క్రియేట్ చేశాయి. మరి సంక్రాతి కానుకగా 12 జనవారిన థియేటర్లలోకి వచ్చిన గుంటూరు కారం ఎలా ఉందొ ఒక్క సారి చూద్దాం.

Also read : Guntur kaaram Ticket price

Guntur kaaram movie Cast And Crew:

ముఖ్య తారాగణం :మహేష్ బాబు(Mahesh Babu),
శ్రీలీల(Srileela),
మీనాక్షి చౌదరి(Minakshi chowdary),
జగపతిబాబు(Jagapatibabu),
రమ్యకృష్ణ(Ramyakrishna),
ప్రకాశ్‌రాజ్‌(Prakashraj),
జయరాం(Jayram),
రావు రమేశ్‌(Raoramesh),
ఈశ్వరిరావు(Eswarirao),
మురళీశర్మ(Muralisarma),
సునీల్‌(Sunil)
మ్యూజిక్ ఎస్ ఎస్ థమన్(Thaman)
కెమెరా మనోజ్ పరమహంస
నిర్మాతఎస్ రాధాకృష్ణ
ప్రొడక్షన్ కంపెనీహారిక హాసిని క్రియేషన్స్
రచన దర్శకత్వంత్రివిక్రమ్ శ్రీనివాస్(Trivikram Srinivas)

కథ ఏమిటంటే :Guntur kaaram Story :

Gunturkaaram Guntur kaaram movie review: మహేష్ నటించిన గుంటూరు కారం రివ్యూ

ఈ సినిమా కథ విషయానికి వస్తే ఇందులో మహేష్(Mahesh) పాత్ర పేరు వీర వెంకట రమణ, రమణ(Ramana) అని అంత పిలుస్తారు. వైరా వ‌సుంధ‌ర ,రాయ‌ల్ స‌త్యం ల కొడుకే రమణ, తల్లి దండ్రుల క్యారెక్టర్లను ర‌మ్య‌కృష్ణ‌(Ramyakrishna), జయరాం(Jayaram) పోషించారు. రమణ చిన్నతనం లోనే తల్లి దండ్రులు విడిపోతారు, దీంతో రమణ తన మేనత్త దగ్గర పెరుగుతాడు.

తన మేనత్త పేరు బుజ్జి, గుంటూరు(Gunturu) లో ఉంటుంది. బుజ్జి పాత్రలో మనకి ఈశ్వరి రావు కనిపిస్తుంది. భర్త తో విడిపోయిన వసుంధర, మరో పెళ్లి చేసుకుని రాజకీయాల్లోకి వెళ్లి న్యాయ శాఖా మంత్రి కూడా అవుతుంది. కానీ అది తెలంగాణాలో. హీరో ఉండేది ఆంధ్ర లో.

రమ్య తండ్రి పాత్ర లో ప్రకాష్ రాజ్(Prakashraj) కనిపిస్తాడు. రమ్య పేరుకే మంత్రి, వెనకుండి చక్రం తిప్పేది అంతా ప్రకాష్ రాజే.(Guntur kaaram movie review) ఈ సినిమా లో ప్రకాష్ పాత్ర పేరు వెంకటస్వామి. అయితే రమణ వల్ల వసుంధర రాజకీయ జీవితానికి ఎక్కడ అడ్డంకి రాకూడదని వెంకట స్వామి, అనుకుంటాడు, పైగా వసుంధరకి రెండవ భర్త తో పుట్టిన కొడుకునే ఆమె రాజకీయ వారసుడిని చేయాలనీ అతని ఆకాంక్ష.

అందుకోసం రమణతో ఒక అగ్రిమెంట్ పై సంతకం చేయించుకోవాలని అనుకంటాడు వెంకటస్వామి. అయితే రమణ ఆ అగ్రిమెంట్ పై సంతకం చేశాడా ? అసలు ఇంతకీ ఆ అగ్రిమెంట్ లో ఏమి రాసి ఉంది. అసలు భార్యాభర్తలు విడిపోవడానికి కారణాలు ఏంటి ? కన్న బిడ్డనే వసుంధర ఎందుకు దూరం పెట్టింది ? ఇలాంటి అన్ని ప్రశ్నలకి సమాధానం కావాలంటే గుంటూరు కారం సినిమా చూసేయండి.

సినిమా ఎలా ఉందంటే : Guntur kaaram movie review

MV5BYWM0YTI2YTUtYmYwYy00M2I3LWFhMDQtNWQwN2QyYzM5YTJlXkEyXkFqcGdeQXVyMTUyNjIwMDEw. V1 Guntur kaaram movie review: మహేష్ నటించిన గుంటూరు కారం రివ్యూ

త్రివిక్రమ్(Trivikram Srinivas) సినిమా అంటేనే పదునైన డైలాగులా పుట్ట, ఈ సినిమా లో కూడా పాత్రతో ఎంతమేర సంభాషణ పలికించాలి, భావోద్వేగాలు ఎలా ఉండాలి, అనే వాటిపై డైరెక్టర్ పూర్తి క్లారిటితో ఉన్నట్టు అర్ధం అవుతుంది చూసేవారికి.

త్రివిక్రమ్ గత సినిమాల్లో కనిపించిన నటులే ఈ సినిమాలో కూడా కనిపిస్తారు, ఉదాహరణకు ఈశ్వరరావు(EswariRao), మురళి శర్మ(Muralisarma), జగపతిబాబు, జయరాం. అయితే వీరిపై గత సినిమాల పాత్రల తాలూకు ప్రభావం పడకుండా చాలా జాగ్రత్త పడ్డాడు.

అయితే నటీనటులు సమర్ధవంతమైన వారే అయినప్పటికీ కొన్ని తప్పిదాలు దొర్లాయి. సినిమాలో తల్లి కొడుకుల బంధం మొదట్లోనే తేలిపోతుంది. ఈ సినిమా మెయిన్ పాయింట్, పైగా పెయిన్ పాయింట్ ఏంటంటే ఒక్క సంతకం తల్లి బిడ్డల బంధాన్ని తెంచేస్తుంది.

ఆ విషయం మొదట్లోనే రివీల్ చేసినా, సినిమాను కొన్ని సన్నివేశాలు జొప్పించి కాలక్షేపం చేయించేశాడు డైరెక్టర్. “అఆ” అనే సినిమా అందరికి తెలిసిన సినిమానే అయినా దానిని చాలా వెరైటీగా చెప్పి రక్తి కట్టించిన త్రివిక్రమ్, గుంటూరు కారం సినిమా విషయంలో మాత్రం ఫెయిల్ అయ్యాడని చెప్పాలి.

ఫస్టాఫ్ లో కేవలం హీరో హైద్రాబాద్(Hydrabad) రావడం వెళ్లిపోవడం అన్నట్టుగానే ఉంటుంది, ఇక సెకండాఫ్ లో ప్రకాష్ రాజ్ రాజకీయం, సంతకం పెట్టించుకోవడం కోసం వేసే ఎత్తుగడలు అస్సలు సామాన్య ప్రేక్షకుడికి అర్ధం కావు.

అయితే ఈ సినిమాకి బలం ఏమిటంటే ఫస్టాఫ్ లో వెన్నెల కిషోర్, శ్రీలీల(శ్రీలీల) తో కలిసి మహేష్ చేసే సరదా సన్నివేశాలు, అలాగే మహేష్ ఎనర్జీ, అద్దిరిపోయే పాటలు, మాస్ డాన్సులు, పాతిక సన్నివేశాల్లోని కొన్ని డైలాగులు.

ఎవరి నటన ఎలా ఉందంటే : Guntur Kaaram Actors performance:

ఇక మహేష్ ఎప్పటి మాదిరిగానే సినిమాకి తన పాత్రకి న్యాయం చేశాడు. మహేష్ కెరియర్ లో ఎప్పుడూ ఇలా డాన్స్ చేయలేదనే చెప్పొచ్చు(Guntur kaaram movie review).

ఇక భావోద్వేగ సన్నివేశాలను బాగా పండించాడు. శ్రీలీల డాన్స్ కే పరిమితమైంది అని చెప్పాలో లేక డాన్సులు మరోసారి ఇరగదీసిందని చెప్పాలో అర్ధం కాదు.

మొత్తానికి శ్రీలీల డాన్స్ మాత్రం హైలైట్. మరో హీరోయిన్ మీనాక్షి పాత్ర పరిమితంగానే ఉంటుంది. రమ్య కృష్ణ ఈ సినిమాలో హుందాగా కనిపిస్తుంది.

ఇక ప్రకాష్ రాజ్, ఈశ్వరి రావు, జగపతిబాబు, వెన్నెల కిషోర్ వారి వారిపాత్రల పరిధి మేరకు నటించారు.

Guntur kaaram Trailer

Leave a Comment