Hyderabad Metro Phase – 2 Full Information : మెట్రో ఫేజ్ – 2 పై కీలక సమాచారం

website 6tvnews template 2024 01 27T103744.012 Hyderabad Metro Phase - 2 Full Information : మెట్రో ఫేజ్ - 2 పై కీలక సమాచారం

Hyderabad Metro Phase – 2 Full Information :మెట్రో రైలు సేవలను హైదరాబాద్(Hyderabad) నగరవాసులు బాగానే వినియోగించుకుంటున్నారు.

నగరంలోని ప్రధాన మార్గాల్లో అందుబాటులో ఉన్న మెట్రో ఉదయం సాయంత్ర వేళల్లో ప్రయాణికులతో కిక్కిరిసి ఉండటం గమనార్హం.

ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో మెట్రో రావడం వల్ల చాల మంది ట్రాఫిక్ కష్టాల నుండి విముక్తి పొందేందుకు మెట్రోనే(Metro Services) ఆశ్రయిస్తున్నారు. (Metro Fage 2 ) ఇటువంటి మెట్రో 2nd ఫేజ్ పనులు ఎప్పుడెప్పుడు ప్రారంభం అవుతాయా అని అంతా ఆశక్తిగా ఎదురు చూస్తున్నారు.

ఇప్పటికే రెండవ ఫేజ్ మెట్రో నిర్మాణం పై సీఎం రేవంత్ CM Revanth Reddy కీలక ప్రకటన కూడా చేశారు. నగరంలోని వివిధ ప్రాంతాల నుండి శంషాబాద్ అంతర్జీతీయ విమానాశ్రయాన్ని(Samshabad International Airport) చేరుకునేలా ఈ మెట్రో నిర్మాణం ఉందనున్నట్టు తెలుస్తోంది.

ఫేజ్ -2 తో నగరం మొత్తం మెట్రో సేవలు : City-wide metro services with Phase-II


ప్రస్తుతం ఈ విషయంలో మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి ఒక ముఖ్య సమాచారాన్ని మీడియా ముఖంగా తెలియజేశారు.

ఫేజ్ 2 మెట్రో ప్రతిపాదనలకు తెలంగాణ ముఖ్య మంత్రి నుండి గ్రీన్ సిగ్నల్ కూడా వచ్చిందన్నారు. మెట్రో కి సంబంధించి ట్రాఫిక్ సర్వేలు, డిపిఆర్ ల పనులు కూడా శరవేగంగా జరుగుతున్నట్టు పేర్కొన్నారు.

(Fage 2 Metro) ఇప్పటికే భాగ్యనగరంలోని కొన్ని ప్రాంతాల వారికి అందుబాటులో ఉన్న మెట్రో సేవలు భవిష్యత్తులో నగరం మొత్తానికి అందుబాటులోకి వస్తాయని అన్నారు.

Leave a Comment