Assembly Elections 2023: BRS పరువు కాపాడిన హైదరాబాద్, రంగారెడ్డి, మెదక్ జిల్లాలు.

Hyderabad, Rangareddy and Medak districts where BRS has saved its glory.

Assembly Elections 2023: BRS పరువు కాపాడిన హైదరాబాద్, రంగారెడ్డి, మెదక్ జిల్లాలు.

తెలంగాణాలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలకోసం రాష్ట్రం మొత్తం ఎదురుచూస్తోంది.
తెలంగాణా అవతరించిన తరువాత దశాబ్దం పాటూ అధికారంలో ఉన్న BRS.

ఈ సారి కూడా మళ్ళి విజయబావుటా ఎగురవేయనుందా లేక ఓటమిని చవిచూడనుందా అని ప్రతి పౌరుడు ఎదురుచూస్తున్నాడు.కొంత సమయం క్రితం నుంచి స్థానిక నియోజకవర్గాల నుంచి గెలుపొందిన అభ్యర్థుల వివరాలు తెలుస్తూనే ఉన్నాయి.

ఆ వివరాల ప్రకారం రాష్ట్రము మొత్తం కాంగ్రెస్ గెలుపుని ఆస్వాదిస్తోంది. ఏ నియోజకవర్గాన్ని చూసినా అత్యధిక మెజారితో కాంగ్రెస్ గెలుపొందింది.

ఇన్నేళ్ల పరిపాలనని వ్యతిరేకిస్తూ ప్రజలు తీసుకున్న నిర్ణయం అనుకోవాలో లేదంటే, మరో పార్టీకి కూడా అవకాశం ఇస్తే వాళ్ళు కూడా ఎంత వరకు రాష్ట్రాన్ని అభివృద్ధి చేయగలరో చూసేందుకు ప్రజల నూతన ఎంపికనో కారణాలు

పూర్తిగా వారి వ్యక్తిగతం కానీ వారు గెలుపుపథంలో నడిపిస్తున్నది. మాత్రం కాంగ్రెస్ నే.ఇన్నేళ్లు చుసిన BRS పూర్తిగా తెలంగాణలో ఓటమిపాలైనట్టేనా అంటే సమాధానం ” కాదు”,

ఎందుకంటే హైదరాబాద్, రంగారెడ్డి, మెదక్ జిల్లాలో మాత్రం BRS ఉనికి ఇంకా ఉంది. ఈ మూడు ప్రదేశాలలో BRS ఇంకా ముందంజలోనే ఉంది.

రాష్ట్రవ్యాప్తంగా ఘోర పరాజయం పాలవబోతున్న BRS పరువుని ఈ మూడు జిల్లాలు కాపాడాయనే చెప్పాలి.
మెదక్ లోని పది స్థానాలలో ఆరు స్థానాల్లో BRS సత్తా చాటుతోంది.

హైదరాబాద్ లో చూసుకుంటే BRS చెప్పుకోదగ్గ ఫలితాలనే కనబరుస్తుంది. 15 నియోజకవర్గాలు గల BRS 8 స్థానాలలో పోటీ చేసిన అభ్యర్థులు ముందు వరుసలో ఉన్నారు.

ఇక రంగారెడ్డి విషయానికి వస్తే ఉన్న 14 స్థానాలలో, కేవలం 3 స్థానాలు కాంగ్రెస్ సంపాదించగా 11 స్థానాల్లో BRS గెలుపుని సొంతం చేసుకొని రంగారెడ్డిలో కారు వేగంగా దూసుకుపోతుంది.

Leave a Comment