Jambo Laddu From Hyderabad To Ayodhya: అయోధ్య రామయ్య కి హైదరాబాద్ నుండి భారీ లడ్డు.

website 6tvnews template 53 Jambo Laddu From Hyderabad To Ayodhya: అయోధ్య రామయ్య కి హైదరాబాద్ నుండి భారీ లడ్డు.

Jambo Laddu From Hyderabad To Ayodhya: కేవలం రెండే రెండు రోజుల్లో అయోధ్య రామ మందిర Ayodhya Rama Mandir ప్రారంభోత్సవం జరగనున్న తరుణంలో ఆ రమయ్య ఆలయానికి సంబంధించిన అనేక అంశాలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి.

రామయ్య ఆలయం నిర్మాణం నుండి ప్రారంభోత్సవం వరకు అనేక విశిష్టమైన అంశాలు ఇందులో ఉన్నాయి. అనేక ప్రాంతాల వారి పనితనం, శ్రమతోనే రామ మందిర నిర్మాణం పూర్తవుతోంది. ఇక రామ మందిర నిర్మాణంలో తెలుగురాష్ట్రమైన తెలంగాణ(Telangana) ముద్ర కూడా ఉండనే ఉంది.

రామాలయ గర్భగుడి తలుపులను హైదరాబాద్(Hyderabad) లోనే తయారు చేశారు. ఆలయ ప్రారంభోత్సవం నాడు రామయ్యకి నైవేద్యంగా 1265 కిలోల లడ్డు ను సమర్పించనున్నారు. ఈ లడ్డును అయోధ్యకు చేరుకునే నాటికి ఏమాత్రం పాడవకుండా ఉండేందుకు జాగ్రత్తలు కూడా తీసుకున్నారు.

లడ్డును శీతలీకరించిన ఒక గాజు పెట్టెల్లో పెట్టి తరలించారు.

ఈ లడ్డు వెనక విశిష్టత ఏమిటో తెలుసా : Reason Behind Laddu

ఇంతకీ ఈ లడ్డును తయారు చేసిన వ్యక్తి పేరు చెప్పనే లేదు కదా ? అత్యంత రుచికరమైన భారీ నైవేద్యం అందిస్తున్న అయన పేరు ఎన్ నాగభూషణం రెడ్డి. ఈ లడ్డును తయారు చేసేందుకు 30 మంది 24 గంటల పాటు నిర్విరామంగా శ్రమించారని అయన వెల్లడించారు.

అంతే కాదు తాను నిర్వహిస్తున్న క్యాటరింగ్ పేరు కూడా శ్రీరామ్ క్యాటరింగ్ అని అన్నారు. ఈ భారీ లడ్డు ఇవ్వడానికి అందులోను దాని బరువు 1265 కిలోలు ఉండడానికి కూడా ప్రత్యేక కారణం ఉందన్నారు.

రామ మందిర భూమి పూజ చేసిన నాడు రామాలయం కోసం ఏమి ఇవ్వాలా అని ఆలోచించగా, ఆయనకి ఒక ఆలోచన వచ్చిందట.

బిన్హుమి పూజ చేసిన నాటి నుండి ఆయాల నిర్మాణం పూర్తయ్యే నాటికి ఎన్ని రోజులు పడుతుందో అన్ని రోజులకు కేజీ చొప్పున అన్ని కేజీల లడ్డు ఇవ్వాలని నిశ్చయించుకున్నారట.

అందుకే 1265 కిలోల లడ్డును చేయించారట నాగభూషణం రెడ్డి.

Leave a Comment