Kishan Reddy Surprised Hanuman Hero: హనుమాన్ హీరో తేజ సజ్జాను సర్‌ప్రైజ్ చేసిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి..ట్వీట్ వైరల్

website 6tvnews template 37 Kishan Reddy Surprised Hanuman Hero: హనుమాన్ హీరో తేజ సజ్జాను సర్‌ప్రైజ్ చేసిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి..ట్వీట్ వైరల్

Kishan Reddy Surprised Hanuman Hero: టాలీవుడ్ యువ దర్శకుడు ప్రశాంత వర్మ (Prashanth Varma) డైరెక్షన్‎లో యువ హీరో తేజ్ సజ్జా (Tej Sajja)నటించిన సూపర్ హీరో మూవీ హనుమాన్ Hanuman బాక్సాఫీస్‎ను షేక్ చేస్తోంది. సరికొత్త రికార్డులు సృష్టిస్తూ కలెక్షన్ల సునామీతో దూసుకెళ్తోంది.తాజాగా కేజీఎఫ్ (KGF), కాంతారా (Kantara) రికార్డులను సైతం బ్రేక్ చేసి 100 కోట్ల క్లబ్ లో చేరిపోయింది.

సంక్రాంతి విజేతగా కొత్త సంవత్సరంలో హనుమాన్ సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. జనాల పల్స్ కు తగ్గట్లుగా స్టోరీలో మేటర్ ఉంటే చాలు బొమ్మ తప్పక హిట్ అవుతుందని ప్రశాంత్ వర్మ మరోసారి నిరూపించాడు. ఎలాంటి స్టార్ పవర్ లేకుండా మీడియం బడ్జెట్‎తో విడుదలైన హనుమాన్ మైండ్ బ్లోయింగ్ వసూళ్లను రాబడుతోంది. హాలీవుడ్ సూపర్ హీరోలను సైతం పక్కకు నెట్టి జనాలు టాలీవుడ్ సూపర్ హీరోను చూసేందుకు యూటర్న్ తీసుకుంటున్నారు.

సంక్రాంతి సెలవులకు తోడు పాజిటివ్ టాక్ రావడం, ఫిబ్రవరి వరకు మరో పెద్ద సినిమా రిలీజ్ లేకపోవడంతో రోజు రోజుకీ హనుమాన్ వసూళ్లను పెంచుకుంటూ బాక్సాఫీస్ బరిలో తొడగొడుతోంది .

ఓవర్సీస్ లోనూ రికార్డు లెవెల్‎లో వసూళ్లను రాబడుతూ టాలీవుడ్ చరిత్రలోనే సంచలనం సృష్టించింది హ‌నుమాన్. పండుగ సీజన్ పూర్తైనా మౌత్ పబ్లిసిటీతో హ‌నుమాన్ భారీ వ‌సూళ్లను సాధిస్తూ ముందుకెళ్తోంది.

సెలబ్రిటీలు, ప్రముఖ హీరోలు సైతం హనుమాన్ చూసి డైరెక్టర్, హీరోపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. తాజాగా కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కూడా హనుమాన్ హీరో తేజ సజ్జాను అభినందించారు.

Also read : Hanuman movie enters 100CR club

Actor Teja Sajja met Central Minister: సెంట్రల్ మీనిస్టర్‎ని కలిసిన తేజ సజ్జా

Kishan Reddy Surprised Hanuman Hero

పేరుకు తెలుగు సినిమా అయినా దేశవ్యాప్తంగా సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది ‘హానుమాన్’ (Hanuman). మీడియం బడ్జెట్ తో ఎలాంటి అంచనాలు లేకుండానే సంక్రాంతి బరిలో దిగిన హనుమాన్ భారీ ఆదరణను సొంతం చేసుకుని సంక్రాంతి విజేతగా నిలిచింది.

సూపర్ హీరో కాన్సెప్టుతో వచ్చిన ‘హనుమాన్’ కు వరల్డ్ వైడ్ గా అన్ని ప్రాంతాల్లో పాజిటివ్ టాక్ లభించడంతో మొదటి షో నుంచే అదిరిపోయే ఆదరణ వస్తోంది. తాజాగా హనుమాన్ హీరో తేజ సజ్జా(Tej Sajja) సినిమా ప్రమోషన్లలో భాగంగా దేశ రాజధాని ఢిల్లీ (Delhi)కి వెళ్లిన విషయం తెలిసిందే.

ఈ క్రమంలో అక్కడ సెంట్రల్ మినిస్టర్ కిషన్ రెడ్డి Kishan Reddy ని తేజ మర్యాదపూర్వకంగా కలిశాడు. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి ట్విటర్ వేదికగా తెలియజేశారు. తెలుగు సినిమా హనుమాన్ సెన్సేషనల్ హిట్ సాధించిన నేపథ్యంలో తేజ సజ్జాను ఆయన సన్మానించారు.

Union minister Kishan Reddy Tweet viral: వైరల్ అవుతున్న కిషన్ రెడ్డి ట్వీట్

Kishan Reddy Surprised Hanuman Hero


తేజ సజ్జాను న్యూఢిల్లీలోని తన నివాసంలో సన్మానించిన ఫొటోలను తన ట్విట్టర్ అకౌంట్ లో షేర్ చేశారు సెంట్రల్ మినిస్టర్ (Union Minister)కిషన్ రెడ్డి (Kishan Reddy).

ఈ ఫోటోలతో పాటుగా ఓ నోట్ ను పంచుకున్నారు. ” హనుమాన్ (Hanuman)సినిమా దేశవ్యాప్తంగా సంచలనాన్ని సృష్టించింది. ఈ మూవీ హిట్ కావడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ మూవీలో అత్యద్భుతంగా నటించిన హీరో తేజ సజ్జాను కలవడం సంతోషంగా ఉంది.

అయోధ్యలోని (Ayodhya) భగవాన్ శ్రీ రాముడి ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం నేపథ్యంలో రామ మందిరానికి, తన సినిమాను చూసేందుకు వచ్చిన ప్రేక్షకులు కొనుగోలు చేసిన ప్రతి టిక్కెట్టు నుండి రూ.

5 విరాళంగా ఇవ్వడం చాలా మెచ్చేకోదగ్గ చర్య. ఈ రకంగా హనుమాన్ టీమ్ శ్రీరాముని ప్రాణ ప్రతిష్ట ఉత్సవంలో భాగం అయ్యింది” అని కేంద్ర మంత్రి చేసిన ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Leave a Comment