Hanuman in the hundred crore club: టాలీవుడ్ చరిత్రలోనే సంచలనం. వంద కోట్ల క్ల‌బ్‌లో ‘హనుమాన్’

website 6tvnews template 35 Hanuman in the hundred crore club: టాలీవుడ్ చరిత్రలోనే సంచలనం. వంద కోట్ల క్ల‌బ్‌లో 'హనుమాన్'

Hanuman in the hundred crore club: బాక్సాఫీస్ వద్ద హ‌నుమాన్ Hanuman రికార్డుల కలెక్షన్లతో దూసుకెళ్తోంది. సినిమా విడుదలైన ఐదో రోజు కూడా హనుమాన్ రికార్డ్ క‌లెక్ష‌న్స్‌తో దుమ్ముదులిపేస్తోంది. మంగ‌ళ‌వారం నాటితో హనుమాన్ వంద కోట్ల క్ల‌బ్‌లో చేరినట్లు ట్రేడ్ వ‌ర్గాలు చెబుతున్నాయి.

సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదలైన మహేష్ బాబు (Mahesh Babu) హీరోగా నటించిన గుంటూరు కారం Guntur Kaaram మూవీ త‌ర్వాత వంద కోట్ల మైలురాయిని అందుకున్న రెండో సినిమాగా టాలీవుడ్ చరిత్రలోనే సంచలనం సృష్టించింది హ‌నుమాన్ .

అటు ఓవ‌ర్‌సీస్‌లోనూ ప్రశాంత్ వర్మ హ‌నుమాన్ కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. మూడు మిలియ‌న్ల మార్క్‌ను దాటి తెలుగు రాష్ట్రాలకు ధీటుగా కలెక్షన్లను వ‌సూళ్ల‌ను రాబ‌డుతోంది ఈ చిత్రం. పండుగ సీజన్ పూర్తైనా మౌత్ పబ్లిసిటీతో హ‌నుమాన్ భారీ వ‌సూళ్లను సాధిస్తూ ముందుకెళ్తోంది.

Hanuman 5 days collections:హనుమాన్ 5 రోజుల కలెక్షన్స్

ప్రపంచవ్యాప్తంగా హ‌నుమాన్‌ (Hanuman)ఐదు రోజుల్లో రూ.109 కోట్ల‌కుపైగా వసూళ్లను రాబట్టిందని ట్రేడ్ వ‌ర్గాలు చెబుతున్నాయి. ఇప్పటి వరకు ఈ మూవీకి రూ.59 కోట్ల వ‌ర‌కు షేర్ క‌లెక్ష‌న్స్ వ‌చ్చిన‌ట్లు తెలుస్తోంది.

నార్త్ లోనూ హనుమాన్ రికార్డు లెవెల్ లో కలెక్షన్లను రాబడుతోంది. హ‌నుమాన్ హిందీ వెర్ష‌న్‌ (Hanuman Hindi Version) మంగళవారం నాటికి రూ.20 కోట్ల వ‌ర‌కు కలెక్షన్లను రాబట్టిందని, రూ.10 కోట్ల వ‌ర‌కు షేర్స్ సొంతం చేసుకున్న‌ట్లు తెలుస్తోంది.

Amazing Prashant Varma Cinematic Universe : ప్ర‌శాంత్ వ‌ర్మ సినిమాటిక్ యూనివ‌ర్స్‌ అదుర్స్


హ‌నుమాన్ (Hanuman)చిత్రాన్ని అత్యద్భుతంగా రూపొందించాడు యువ దర్శకుడు ప్ర‌శాంత్ వ‌ర్మ (Prashanth varma).ఈ డైరెక్టర్ సినిమాటిక్ యూనివ‌ర్స్ నుంచి వ‌చ్చిన మొద‌టి సూపర్ హీరో మూవీ ఇది. ఆధ్యాత్మిక అంశాలను జోడించి సూప‌ర్ హీరో బ్యాక్‌డ్రాప్‌ను ఎన్నుకుని ప్ర‌శాంత్ వ‌ర్మ సినీ లవర్స్ హృదయాలను గెలుచుకున్నాడు.

ఆంజ‌నేయుడి అండతో సూప‌ర్ ప‌వ‌ర్స్ పొందిన యువ‌కుడిగా యువ హీరో తేజ్ స‌జ్జా (Tej Sajja)నటన ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంది. అరాచ‌కాల‌ను సృష్టిస్తున్న వారికి ఆంజనేయుడు ఎలా బుద్ధి చెప్పాడు? సూప‌ర్ హీరో కావాల‌ని క‌ల‌లు క‌ంటున్న మైఖేల్ నుంచి తేజ సజ్జాను ఎలా రక్షిస్తాడు అన్నది హ‌నుమాన్ సినిమా. హనుమాన్ కు విపరీతమైన క్రేజ్ రావడంతో ప్రశాంత్ ఇప్పుడు జై హ‌నుమాన్ (Jai Hanuman) పేరుతో సీక్వెల్ తీయబోతున్నట్లు సమాచారం.

అంతేకాదు వ‌చ్చే సంవత్సరం సీక్వెల్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు ప్లాన్ చేస్తున్నట్లు ప్ర‌శాంత్ వ‌ర్మ ఓ అనౌన్స్‏మెంట్ కూడా ఇచ్చేశాడు. ఇక ఈ సినిమాలో తేజ స‌జ్జాకు జోడీగా అమృత అయ్య‌ర్ (Amritha Aiyer) కనిపించగా, అక్క పాత్రలో వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్‌కుమార్‌ (Varalakshmi Sharath Kumar) నటించింది. మరి సీక్వెల్ లో వీరే కంటిన్యూ అవుతారా? లేదా కొత్త వారికి ప్రయారిటీ ఇస్తాడా అన్నది మాత్రం వెయిట్ చేసి చూడాల్సిందే.

‘Hanuman’ records at overseas : ఓవర్సీస్‌లో ‘హనుమాన్‌’రికార్డులు


అటు విదేశాల్లోనూ హనుమాన్‌ (Hanuman) రచ్చ మామూలుగా లేదు. రికార్డు స్థాయి వసూళ్లతో దూసుకెళ్తోంది. ఉత్తర అమెరికాలోనే (North America)3 మిలియన్ల డాలర్లకుపైగా హనుమాన్ వసూళ్లను రాబట్టింది.

అక్కడ ఫస్ట్ వీక్ లోనే ఆర్‌ఆర్‌ఆర్‌ (RRR), బాహుబలి (Bahubali), సలార్‌ (Salaar)రికార్డులను బీట్ చేసింది హనుమాన్. చిన్న సినిమాగా వచ్చిన హనుమాన్ అనూహ్యమైన కలెక్షన్లతో సంక్రాంతి విన్నర్ గా నిలవడం విశేషం. భారతీయ తొలి సూపర్‌ హీరో సినిమాగా హనుమాన్‌ (Hanuman)కు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు.

ప్రపంచవ్యాప్తంగా హ‌నుమాన్ ప్రీ రిలీజ్ బిజినెస్ రూ.29 కోట్ల వ‌ర‌కు జ‌రిగింది. 30 కోట్ల బ్రేక్ ఈవెన్ తో బాక్సాఫీస్ బరిలోకి దిగింది. ఫస్ట్ షో తోనే హిట్ టాక్ రావ‌డంతో మూడు రోజుల్లోనే హనుమాన్ లాభాల్లోకి అడుగుపెట్టింది. మొత్తంగా ఐదు రోజుల్లోనే ఈ మూవీ రూ.30 కోట్ల వ‌ర‌కు లాభాలను సాధించిందని ట్రేడ్ వ‌ర్గాలు చెబుతున్నాయి.

ఫిబ్రవరి వరకు పెద్ద సినిమాల రిలీజ్ లేకపోవడంతో హనుమాన్ మూవీ మేకర్స్ కు మరిన్ని లాభాలు అందించే అవకాశాలు ఉన్నాయి.

Leave a Comment