ప్రజాపాలనలో భాగంగా కొత్త రేషన్ కార్డు కోసం ఎంతో మంది దరఖాస్తు చేసుకున్నారు.
తాజాగా ప్రజాపాలన దరఖాస్తులను ఇప్పటికే కంప్యూటరైజ్డ్ చేశారు.
ప్రస్తుతం ప్రజాపాలన దరఖాస్తులకు సంబందించి, వెబ్ సైటు లో చెక్ మై స్టేటస్ అనే ఆప్టన్ వచ్చేసింది.
Read: Asara pension: పెరగని ఆసరా – వివరణ ఇచ్చిన కాంగ్రెస్
అధికారిక వెబ్ సైట్ :
విజయవంతంగా పూర్తయిన ప్రజా పాలన కార్యక్రమానికి సంబంధించి https://prajapalana.telangana.gov.in/ పేరుతో తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక వెబ్ సైట్ ను ప్రారంభించింది. ఈ వెబ్ సైటు లో ప్రజాపాలన ధరఖాస్తులన్నింటి గురించి పూర్తి సమాచారం ఉండేలా దీనిని తయారు చేశార . అలాగే దరఖాస్తు చేసుకున్న వ్యక్తి స్టేటస్ కూడా తెలుసుకునే అవకాశాన్ని ఇపుడు కల్పిస్తుంది. ఈ నేపథ్యంలోనే వెబ్ సైట్ లో కీలక ఆప్షన్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది ప్రభుత్వం.
స్టెప్స్ టు – CHECK MY STATUS :
- స్టెప్ 1 – ఇంతకు ముందు ఈ వెబ్ సైట్ మాత్రమే అందుబాటులో ఉంది. ప్రస్తుతం ప్రజాపాలన పోర్టల్ లో దరఖాస్తు స్థితిని చెక్ చేసేందుకు ‘KNOW YOUR APPLICATION STATUS’ అనే ఒక ఆప్షన్ ని తీసుకొచ్చింది. ముందుగా దీనిని క్లిక్ చేయాలి.
- స్టెప్ 2 – ఫస్ట్ ఆప్షన్ ని క్లిక్ చేయగానే అప్లికేషన్ నంబర్ అని కనిపిస్తోంది. దీనీలో దరఖాస్తు చేసుకున్న వ్యక్తి పేరు, ఆప్లికేషన్ నెంబర్ ఎంట్రీ చేసి, కింద వచ్చిన CAPTCHAను పూర్తి చేయాలి.
- స్టెప్ 3 – CAPTCHA ను పూర్తి చేసిన తరువాత ‘View Status’ అనే ఆప్షన్ పై క్లిక్ చేస్తే, అప్పుడు దరఖాస్తు ఏ స్థితిలో ఉంది అనే విషయం కనపడుతుంది.
అయితే ఈ వెబ్సైటు డాటా ఎంట్రీ అంతా పూర్తి అయ్యాక, లోటుపాట్లన్నీ పరిశీలించి అందుబాటులోకి తీసుకొస్తామని అధికారిక వర్గాలు తెలిపాయి.