లాంచ్ డేట్ ఎప్పుడంటే : One Plus Launch Date
స్మూత్ బియాండ్ బిలీఫ్ పేరుతో ఏర్పాటు చేసిన కార్యక్రమం లో భాగంగా వన్ ప్లస్ కంపెనీ తన సరికొత్త మోడల్ వన్ ప్లస్ 12 సీరీస్ ను భారత్ లో విడుదల చేస్తోంది. ఈ వన్ ప్లస్ 12 సీరీస్ లో రెండు మోడళ్లను లాంచ్ చేయనున్నారు. అవి వన్ ప్లస్ 12 , అలాగే వన్ ప్లస్ 12 ఆర్. ఈ మొబైల్ ఫోన్లను ఆన్లైన్ విధానంలో కొనుగోలు చేసేవారు అమెజాన్ ద్వారా కొనుగోలు చేయవచ్చు. ఇక ఢిల్లీ వేదికగా జరగబోతున్న స్మూత్ బియాండ్ బిలీఫ్ ఈవెంట్ ను వన్ ప్లస్ అధికారిక యూట్యూబ్ ద్వారా వీక్షించవచ్చట. ఈ ఈవెంట్ ను వారు ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు.
చైనా కి ఇక్కడికి తేడా : One Plus Series Difference In China And India
జనవరి 23వ తేదీన భారత్ లో లాంచ్ అవుతున్న ఈ వన్ ప్లస్ 12 సీరీస్ మొబైల్ ఫోన్లు ఇప్పటికే చైనా దేశంలో అందుబాటులో ఉన్నాయి, ఇదివరకే అక్కడ ఈ వన్ ప్లస్ 12 సీరీస్ ను లాంచ్ చేసేశారు. అక్కడ వీటి విక్రయాలు జరుగుతున్నాయి. చైనా లో లాంచ్ అయిన వన్ ప్లస్ కి భారత్ లో ప్రారంభించబోయే మోడల్ కి ఎటువంటి వ్యత్యాసం ఉండదని అంటున్నారు. రెండింటిలో ఒకే రకమైన స్పెసిఫికేషన్లు ఉంటాయని భావిస్తున్నారు. అయితే ఇంతకు ముందు వచ్చిన మోడళ్ల కంటే కూడా ఈ వన్ ప్లస్ 12 సీరీస్ ధర ఎక్కువగా ఉంటుందని అంచనా వేస్తున్నారు.
వన్ ప్లస్ 12 సీరిస్ డిస్ play : One Plus 12 Series Display
ఈ మొబైల్ 6.82 ఇంచెస్ ఉంటుంది, అలాగే LTPO AMOLED డిస్ ప్లే తో వస్తుంది. అలాగే 128 HZ రిఫ్రెష్ రేట్ తో ఉంటుంది. ఇక ఇందులో పీక్ బ్రిట్న్స్ చుస్తే 4500 నిట్స్ ఉంటుంది. ఇక ఇది 4nm స్నాప్ డ్రాగన్ ఉండటం విశేషం. దీని RAM 24 జిబి ఉండగా ఇంటర్నల్ మెమరీ 1 టెరాబైట్ ఉంటుంది.
వన్ ప్లస్ 12 సీరిస్ కెమెరా : One Plus 12 Series Camera
వన్ ప్లస్ 12 సీరీస్ లో ట్రిపుల్ రియర్ కేమెరా సెటప్ ఉంటుంది. దీనిలో ప్రైమరీ కెమెరా 50 మెగా పిక్సెల్ సామర్ధ్యం కలిగి ఉంది. ఇది సోని LYT-808 ప్రైమరీ షూటర్ ఆప్టికల్ ఇమేజ్ సెన్సిబిలిజెషన్ కలిగి ఉంటుంది. అలాగే సెకండరీ కెమెరా 48 మెగా పిక్సెల్ సామర్ధ్యం కలిగి ఉంటుంది. ఇది సోని IMX581 అల్ట్రా వైడ్ కెమెరా. టెరిషియరీ కెమెరా చుస్తే 64 మెగాపిక్సల్ కలిగి ఉంటుంది. ఇక ముందు వైపు 32 మెగా పిక్సెల్ తో సెల్ఫీ కెమెరా ఉంటుంది.
వన్ ప్లస్ 12 సీరిస్ బ్యాటరీ : One Plus 12 Series Battery
దీని బ్యాటరీ విషయానికి వస్తే ఇందులో 5400mah బ్యాటరీ ఉంటుంది. దీనిని త్వరగా ఛార్జ్ చేసుకునే వీలుగా మంచి ఛార్జర్ ను కూడా అందిస్తున్నారు. అలాగే ఇందులో వైర్ లెస్ చార్జున్గ్ అలాగే విత్ వైర్ చార్జున్గ్ కూడా అందుబాటులో ఉంది.