Pakistan economy is getting damaged day by day: శరణార్థులపై పాక్ ఉక్కుపాదం..

Pakistan: Pakistan has iron feet on refugees.

Pakistan economy is getting damaged day by day : శరణార్థులపై పాక్ ఉక్కుపాదం..తమ దేశంలో తలదాచుకోవడానికి ససేమిరా అంటున్న పాక్..

పాకిస్థాన్ లో ఆర్ధిక వ్యవస్థ రోజు రోజుకి దెబ్బతింటోంది. దేశ ఆర్ధిక వ్యవస్థ క్రుంగి కృశించి పోకుండా ఉండాలంటే ప్రభుత్వాన్ని నడిపే నేతలు సరైన వారయి ఉండాలి. కానీ ప్రాకిస్తాన్ లో చూస్తే ఒక భిన్నమైన వైఖరి కనిపిస్తూ ఉంటుంది. అక్కడ ప్రధానులు కేవలం నామమాత్రపు నేతలే అన్నట్టు ఉంది పరిస్థితి.

ఆ దేశ సైన్యమే అన్ని పనులు చెక్కబెడుతోంది. పెత్తనమంతా వారి చేతుల్లోనే ఉంటోంది. సైన్యం కన్నా పౌర ప్రభుత్వానికి ఎక్కువ ప్రాధాన్యత ఉందని చూపెట్టాలని భావించిన ఏ నేత కూడా సౌఖ్యంగా ఉన్నట్టు కనిపించలేదు.

కొందరికి భూమిమీదే నరకం చూపెడితే కొందరికి ఏకంగా పరలోకానికి పంపించేశారు అనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ప్రస్తుతం పాకిస్తాన్ లో తాత్కాలిక ప్రభుత్వం నడుస్తోంది. అన్వర్- ఉల్-హక్ కాకర్ ఆపద్ధర్మ ప్రధానిగా వ్యవహరిస్తున్నారు. బెలూచిస్తాన్ కి సీనియర్ సెనెటర్ గా ఉన్న అన్వర్- ఉల్-హక్ కాకర్ ఈ ఏడాది ఆగస్టు14న ప్రధానిగా నియమించబడ్డాడు.

ఆఫ్గనిస్తాన్ నుండి ఎప్పుడైతే అమెరికా సైన్యం నిష్క్రమించిందో అప్పుడే తాలిబన్లు రెచ్చిపోయారు. వెంటనే ఆఫ్గనిస్తాన్ ను హస్తగతం చేసుకున్నారు.

ఆటవికతకు దగ్గరగా ఉండే తాలిబన్ల రాక్షస పాలన తట్టుకోలేక లక్షల సంఖ్యలో ఆఫ్గన్లు పొరుగున ఉన్న పాకిస్తాన్ దేశానికి వలస వెళ్లారు. ఇలా వలస వెళ్లిన వారిలో కొందరు పాకిస్థాన్ లో శరణార్థులుగా తమ పేర్లను రికార్డుల్లో నమోదు చేసుకున్నారు.

ఎక్కువ మంది తమ పేర్లు నమోదు చేసుకోకుండానే కాలాన్ని వెళ్లదీస్తూ వస్తున్నారు. అయితే వీరిపై పాక్ ప్రభుత్వం ఉక్కు పాదం మోపాలని చూస్తోంది. రికార్డుల్లోకి రాని శరణార్థులు పాక్ ను వదిలి ఆఫ్గన్ వెళ్లి పోవాలని, వారికి ఇక్కడ స్థానం లేదని తెలిపింది.

ఒకానొక సమయంలో అయితే శరణార్థులుగా రికార్డుల్లో తమ పేరు నమోదు చేసుకున్న వారు కూడా వెళ్లిపోవాలని వెల్లడించింది. ఆఫ్ఘన్లు ఆఫ్ఘనిస్తాన్ నుండి పాకిస్థాన్ కు వలస రావడం అనేది ఈ నాటి మాట కాదు. ఇది 1970 నుండి ఉంది. కానీ ఇప్పటి వరకు ఇంత అధిక సంఖ్యలో వలసదారులు పాక్ కి చేరుకోకలేదు.

తమ దేశం లో అనేక మంది శరణార్థులు ఉన్నారని పాక్ చెప్పే మాట కేవలం గొప్పల కోసమే అని, అదంతా లోపభూయిష్టమైన మాటే అని అంటున్నారు మానవ హక్కువ సంస్థల ప్రతినిధులు.

పాకిస్తాన్ లో ఉన్న ఆఫ్ఘన్ ల పరిస్థితి దయనీయంగా ఉంటోందన్నారు. వారిపై తీవ్రమైన వివక్ష చూపెడుతున్నారని అంటున్నారు. ఆఫ్ఘన్ లు పాక్ లో ఉండటం వల్ల పాకిస్థానీయులకు పెద్దగా పనులు దొరకడం లేదనే మాట బాగా వినిపిస్తోంది.

అసలే పనుల కొరతతో అక్కడి ప్రజలు అల్లాడుతున్నారు. పైగా ఆఫ్ఘన్ లు మాదక ద్రవ్యాల రవాణాలో కూడా పాలుపంచుకుంటున్నారని, పోలీసులకు అది పెను సవాల్ గా మారిందని కూడా ఆరోపిస్తున్నారు.

ఇవన్నీ ఒక ఎత్తయితే ప్రస్తుతం పాకిస్థాన్ లో దేశ వ్యతిరేక టెర్రరిజం హెచ్చుమీరిపోయింది. అఫ్గానిస్తాన్ ను ప్రధాన కేంద్రంగా చేసుకుని తెహ్రీక్ –ఏ- తాలిబాన్ వ్యవస్థీకృత నేరాలు, టెర్రరిస్టు చర్యలకు పాల్పడుతోందని పాకిస్తాన్ తాత్కాలిక హోం మంత్రి సర్ఫరాజ్ బుగ్తి ఆరోపించారు.

పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ కోలుకోడానికి ఇది విఘాతం కలిగిస్తోందని వారు అంటున్నారు. అందుకే పాకిస్తాన్ లో ఉండే ఆఫ్ఘన్ శరణార్థులను మూకుమ్మడిగా, మొత్తాన్ని పాకిస్తాన్ దేశం నుండి బహిష్కరించాలని భావిస్తున్నట్టు చెబుతున్నారు

Leave a Comment