PM Modi : నేడు హైదరాబాద్ రానున్న ప్రధాని మోదీ..ఓబీసీ సభలో పాల్గొననున్న మోదీ..
భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేడు హైదరాబాద్ రానున్నారు. LB స్టేడియంలో నిర్వహించనున్న ఓబీసీ ఆత్మగౌరవ మహాసభకు ఆయన ముఖ్య అతిధిగా పాల్గొననున్నారు.
ప్రధాని పర్యటనకు సంబంధించి వివరాలు చుస్తే..ఢిల్లీ లో అయన ప్రత్యేక విమానం లో బయలుదేరి సాయంత్రం 5.30 నిమిషాలకు బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు.
Read: Pradhanmantri Suryodaya Yojana
బేగంపేట నుండి మోదీ రోడ్డు మార్గం గుండా ఎల్బీ స్టేడియంకు చేరుకుంటారు. ఇక ప్రధాని పాల్గొనే సభకు ఓబీసీ ఆత్మగౌరవ మహాసభ అని పేరు పెట్టడంలోనే అందులోని ఆంతర్యం స్పష్టం గా అర్ధమవుతోంది.
రానున్న ఎన్నికల్లో బిసిల ఓట్లను కొల్లకొట్టాలనే ముఖ్య ఉద్దేశంతో ఒక బీసీ గా ఉన్న ప్రధాన మంత్రిని ఈ సభకు ముఖ్య అతిధిగా ఆహ్వానించినట్టు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
అంతే కాక, తెలంగాణ లో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేటంత మెజారిటీ సీట్లు సాధిస్తే ఖచ్చితంగా ఒక బిసి నే ముఖ్య మంత్రిని చేస్తామని కూడా ప్రకటించారు.
అయితే ప్రస్తుత భారతీయ రాష్ట్ర సమితి పార్టీ కూడా తెలంగాణ రాష్ట్ర సమితి గా ఉన్న సమయంలో ఇదే హామీని ఇచ్చింది, అయితే అనుకోని కారణాల వల్ల ఆ హామీని నిలబెట్టుకోలేకపోయింది.
కానీ బీజేపీ ఇప్పుడు అదే హామీని ఇవ్వడం కొసమెరుపు. రాష్ట్ర రాజధానిలో ఓబీసీ ఆత్మగౌరవ మహాసభ నిర్వహించడం తో బీజేపీ నాయకులూ దీనిని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఈ సభను జయప్రదం చేయాలనీ గట్టిగా నిశ్చయించుకున్నారు.
లక్షకు పైగా భారతీయ జనతా పార్ట్ కార్యకర్తలు ఈ సభకు రావాలని పిలుపునిచ్చారు. ఇక ఈ సభ ముగిసిన అనంతరం ప్రధాని మోదీ తిరిగి ఢిల్లీ చేరుకుంటారు.