PM Modi Tamil Speech: భారత ప్రధాని నరేంద్ర మోదీ(PM Narendra Modi) తమిళనాడు(Tamil Nadu) పర్యటనలో ఉన్నారు.
ఈ పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ తిరుచ్చిరాపల్లి(Tiruchirappalli) లోని భారతి నాథన్ విశ్వవిద్యాలయం కాన్వొకేషన్(Bharati Nathan University Convocation) కార్యక్రమానికి ఆరాష్ట్ర సీఎం ఎంకే స్టాలిన్(CM M.K Stalin)
తో కలిసి ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పీఎం నరేంద్ర మోడీ తమిళం లో మాట్లాడి అందరిని ఆశ్చర్యపరిచారు. ఎల్లారకు వణక్కం అంటూ తమిళ్ తో తన ప్రసంగాన్ని మొదలు పెట్టారు.
కొత్త సంవత్సరంలో మొదటి పబ్లిక్ స్పీచ్ : PM First public speech of the new year
భారతిదాసన్ యూనివర్సిటీ యొక్క 38వ స్నాతకోత్సవ వేడుక 2024 కొత్త సంవత్సరంలో తన మొట్టమొదటి పబ్లిక్ ఇంటరాక్షన్ అయినందుకు తనకు చాలా విశిష్టమైనది గా తాను భావిస్తానని అన్నారు.
తాను ఇంత అందమైన తమిళనాడు రాష్ట్రానికి వచ్చినందుకు, ఇక్కడి యువత మధ్య ఉన్నందుకు చాలా సంతోషంగా ఉందని చెప్పారు. ఇక ఈ కార్యక్రమంలో భాగంగా గ్రాడ్యుయేషన్‌లో పాల్గొన్న
విద్యార్థులు(Students), వారి ఉపాధ్యాయులు(Lecturers), తల్లిదండ్రులకు(Parents) హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు,
ఇక ఇందులో ఉన్న మరో విశేషం ఏమిటంటే భారతీదాసన్ విశ్వవిద్యాలయంలో జరిగిన స్నాతకోత్సవ వేడుకకు హాజరైన మొదటి ప్రధాని మోదీనే. ఇది ఆయనకు ఎంతో సంతృప్తిని ఇచ్చిందని మోదీ కూడా అన్నారు.
Also Read: ప్రజల కోసం ప్రజల్లో నుండి వస్తున్న నాయకుడు – యేలేటి సురేష్ రెడ్డి
భారతీదాసన్ యూనివర్సిటీ గురించి పీఎం మోదీ : PM Modi about Bharatidasan University
విశ్వవిద్యాలయ స్థాపన అనేది సాధారణ శాసన ప్రక్రియ అని, క్రమంగా ఆయా యూనివర్సిటీల పరిధిలోకి కొత్త కాలేజీలు(New Collages) అనుబంధంగా వచ్చి చేరతాయని చెప్పారు.
అయితే, భారతీదాసన్ విశ్వవిద్యాలయం ప్రత్యేకమైనదని అన్నారు. అనేక ప్రసిద్ధ కళాశాలలను(Famous Collages) ఏకతాటిపైకి తెచ్చి, యూనివర్శిటీని(University) సృష్టించి, పటిష్టంగా అందించడానికి భారతీదాసన్ యునివేర్సిటి కృషి చేస్తోందన్నారు.
మన దేశం మన నాగరికత ఎప్పుడూ కూడా జ్ఞానం చుట్టూ కేంద్రీకృతం చేయబడి ఉందన్నారు. కాంచీపురం(Kanchipuram),
గంగైకొండ (Gangaikonda) చోళపురం (Cholapuram), మదురై(Madhurai) ప్రాంతాల్లో గొప్ప గొప్ప విశ్వవిద్యాలయాలు ఉన్నాయని అయన పేర్కొన్నారు, ఇక్కడ విద్యను అభ్యసించేందుకు అనేక ప్రాంతాల నుండి విద్యార్థులు వస్తారని పేర్కొన్నారు.
కాన్వొకేషన్ గురించి మోదీ మాటల్లో : In Modi’s words about the convocation
కాన్వకేషన్(convocation) గురించి మాట్లాడుతూ ఈ విధానం ప్రాచీనమైనదనే భావన గురించి ప్రస్తావిస్తూ, ప్రధాని తమిళ సంగమాన్ని ఉదాహరణగా స్పృశించారు.
తమిళనాట కవులు (Poets), మేధావులు (intellectuals) కవిత్వం(Poetry), సాహిత్యాన్ని(literature) విశ్లేషణ కోసం అందించారని, ఆ మేధావులు చెప్పిన తర్కాన్ని నేటికీ విద్యారంగంలో, ఉన్నత విద్యలో ఉపయోగిస్తున్నారని ప్రధాని గుర్తుచేశారు.