Aadhaar KYC not needed for the Prajapalana: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా పాలన కార్యక్రమం కొనసాగుతోంది. ఈ కార్యక్రమం లో పాల్గొని అప్లికేషన్ ఫిల్ చేసి అర్జీ సమర్పించి లబ్ది పొందేందుకు ప్రజలు పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నారు.
ఈ ప్రజాపాలనను పల్లెల్లో అయితే గ్రామాలూ, పట్టణాల్లో అయితే వార్డుల్లో నిర్వహిస్తున్నారు. అధికారులు ఈ కార్యక్రమాన్ని ఉదయం 8 గంటల నుండి సాయంత్రం ఆరు గంటల వరకు నిర్వహిస్తున్నట్టు తెలుస్తోంది.
ఈ కార్యక్రమంలో ఇప్పటివరకు 40 లక్షలకు పైగా ప్రజలు వివిధ సంక్షేమ పధకాల లబ్ది కోరుతూ అర్జీలు సమర్పించినట్టు తెలుస్తోంది.
Also Read: 6 gaurantee Asara pension
మొత్తమ్మీద కోటి అర్జీలు రావచ్చని అంచనా వేస్తున్నారు అధికారులు. తెలంగాణ ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి ప్రజాపాలన లో అప్లికేషన్ల కొరత రాకుండా చూడాలని ఆదేశించారు.
ఇది ఇలా ఉంటె ఎంఐఎం పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీ చేసిన వ్యాఖ్యలు కొంత ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.
ప్రజాపాలపై ఒవైసీ వ్యాఖ్యలు :Owaisi comments on Prajapala
AIMIM Chief Barrister @asadowaisi Sahab inspected All Praja Palana Centres Across Hyderabad Parliament Constituency. pic.twitter.com/THzocKsUPR
— Syed Sohail Quadri (@s_sohailquadri) December 29, 2023
ప్రజాపాలన కార్యక్రమం జరుగుతున్న సమయంలో ఒవైసీ కొన్ని ప్రాంతాల్లో పర్యటించారు. ఇందులో భాగంగా ఆయా అర్జీలను పరిశీలించిన ఒవైసీ, కెలక వ్యాఖ్యలు చేశారు.
మహాలక్ష్మి పథకం కింద రూ.500 ధరకే సబ్సిడీ గ్యాస్ సిలిండర్‌ను(Subsidy gas Cylinder) పొందేందుకు కేవైసీ(KYC) అవసరం లేదని ఒవైసి పేర్కొన్నారు.
దీంతో అసలు కెవైసి చేయాలా వద్దా అన్న దానిపై క్లారిటీ లేక లబ్ధిదారులు తికమకపడుతున్నారు. ఓవైసీ చేసిన ఈ వ్యాఖ్యల వల్ల ప్రజాపాలన దరఖాస్తు ప్రక్రియ పై కొన్ని చర్చలు, మరి కొన్ని ప్రశ్నలకు దారితీసింది.
ఎల్పీజీ కి కేవైసీ అవసరం లేదా: KYC is not required for LPG?
ఎల్పీజీ గాస్(LPG Gas) పై సబ్సిడీ పొందేందుకు KYC వివరాలను సమర్పించాల్సిన అవసరం లేదని చెప్పడంతో క్యూ లైన్ లో నిలబడి అర్జీలు సమర్పించాలని వేచి ఉన్న వారు,
ఒవైసీ వ్యాఖ్యల కారణంగా నిరుత్సాహానికి గురయ్యారు. పైగా ఎక్కువ మంది ఒకే పని కోసం ప్రయత్నించడం వల్ల సర్వర్ బిజీ వస్తూ ఉంటుంది,
దీంతో అయన సర్వర్ పని తీరును కూడా ఎత్తి చూపారు. అంతే కాకుండా సిలిండర్ కొనుగోలుపై నగదు రీయింబర్స్ చేయడానికి ఎల్‌పిజి కొనుగోళ్ల రశీదులను జత చేయాలని స్థానికులకు సూచించారు.
ఆరు గ్యారంటీలు ఇవే : These are the six guarantees
అయితే ప్రజాపాలన కార్యక్రమంలో ఏయే పధకాల కోసం అర్జీ సమర్పిస్తున్నారు అని వివరాలు చుస్తే మొదటిది మహాలక్ష్మి పధకం ఈ పధకం ద్వారా మహిళలకు నెలకు 2,500 రూపాయల ఆర్థిక సహాయం అందజేస్తారు.
అదే విధంగా 500 రూపాయలకే వంటగ్యాస్ (Cooking Gas)సిలిండర్ అందిస్తారు. ఇక రైతు భరోసా కింద రైతులకు ప్రతి ఏటా ఎకరాకు 15,000 రూపాయలు అందిస్తారు.
ఇందిరమ్మ ఇండ్లు (Housing Scheme)ఈ పధకం ద్వారా ఇల్లు లేనివారికి ఇంటి నిర్మాణం కోసం ఆర్థిక సహాయం అందిస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం.
అదే విధంగా గృహ జ్యోతి పథకంతో ప్రతి నెల 200 యూనిట్ల ఉచిత విద్యుత్(Free Electricity) అందిస్తారు లబ్దిదారులకు.
యువ వికాసం అనే పధకం తో విద్యార్థులు, అంతర్జాతీయ పాఠశాలలకు 5 లక్షల రూపాయల విలువైన విద్యా భరోసా కార్డులు అందిస్తారు. చేయూత పథకంతో వృద్ధాప్య, వితంతువుల వంటి వారికి పింఛన్ అందిస్తారు.