రేవంత్ సర్కార్ సంచనల నిర్ణయం – ఫ్రీ సిలిండర్ కు ముందే డబ్బులు చెల్లించాలి

website 6tvnews template 18 1 రేవంత్ సర్కార్ సంచనల నిర్ణయం - ఫ్రీ సిలిండర్ కు ముందే డబ్బులు చెల్లించాలి

Revanth Sarkar Decision – Payment must be made before free cylinder : రేవంత్ సర్కార్ గృహలక్ష్మి పధకం క్రింద సిలిండర్ కు పూర్తి డబ్బులు ముందుగానే చెల్లించాలి అని మెలిక పెట్టారు. ఆ తర్వాత లబ్దిదారుల అకౌంట్లోకి నేరుగా జమ చేస్తామని చెప్పారు వైట్ రేషన్ కార్డు ఉండి దరఖాస్తు చేసుకునే వారే దీనికి అర్హులు.

దీనికి సంబందించిన మరిన్ని గైడ్ లైన్స్ తయారుచేశామని పోరాసరఫరాల శాఖ తెలిపింది.కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ ఇచ్చాక ఆ మొత్తాన్ని లబ్దిదారుల అకౌంట్ లో జమ అయ్యే విధం గా గృహలక్ష్మి పధకం క్రింద ఎంపికైన లబ్దిదారులకు కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యక్ష నగదు బదిలీ క్రింద రీయంబర్స్ చేస్తుంది.

లబ్దిదారులకు ఇవ్వాల్సిన సబ్సిడీ లెక్క కట్టి రాష్ట్ర ప్రభుత్వం ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలకు ఇస్తే, సిలెండర్ రీఫిల్ టైం లో లబ్దిదారులు ఆ డబ్బులు మొత్తం చెలించిన తర్వాత అప్పుడు ఆ ఆయిల్ కంపెనీలు నగదు బదిలీ ద్వారా డేటాబేస్ ప్రకారం 500 రూపాయలు పోను మిగిలిన మొత్తాన్ని లబ్దిదారుల అకౌంట్ లో నేరుగా జమ చేస్తారు.

Commercial LPG cylinder prices slashed by Rs 171.5 per unit రేవంత్ సర్కార్ సంచనల నిర్ణయం - ఫ్రీ సిలిండర్ కు ముందే డబ్బులు చెల్లించాలి

ప్రజాపాలనలో వైట్ కార్డు తో దరఖాస్తు చేసుకున్న వారికి మాత్రమే ఈ పధకం లోకి వస్తారని పౌరసరఫరాల శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. దీనికి అవసరమైన కొన్ని నిభందనలు తో గైడ్ లైన్స్ ను ఖరారు చేసామని చెప్పారు. దీని ఆధారం గ లబ్దిదారులు ఎవరు అనేది గుర్తిస్తామని చెప్పారు.

ఈ పధకం క్రింద కి వచ్చే లబ్దిదారులను వారు ఈ మూడేళ్ళలో వినియోగించిన సిలెండర్ సంఖ్యను దృష్టి లో ఉంచుకుని దాని ఆధారం గానే లెక్క కట్టి సబ్సిడీని ఇస్తారు. ప్రజాపాలన లో మొత్తం 40 లక్షల మంది లబ్దిదారులు ఉన్నట్లు గుర్తించామని పోరాసరఫరాల శాఖ వెల్లడించింది.ఈ లబ్దిదారులు 3 సంవత్సరాలలో వాడిన సిలెండర్ల యావరేజ్ ద్రిష్టి లో పెట్టుకుని ఏటా 3 నుండి 5 సిలెండర్ లు వాడుకునేందుకు ఈ పధకం ఉపయోగపడుతుంది.

రాష్టం లో మొత్తం 1 కోటి 20 లక్షల గ్యాస్ కనెక్షన్స్ ఉన్నాయి. అలాగే 90 లక్షల వరకు రేషన్ కార్డు లు ఉన్నాయి. రాష్ట్రం లో ఉజ్వల పధకం క్రింద ఇప్పటికే దాదాపు 10 లక్షల కుటుంబాలకు కేంద్రం ప్రభుత్వం నెలకు సుమారు 300 రూపాయల వరకు సబ్సిడీ ఇస్తోంది.ఇప్పుడు వీరందరినీ మహాలక్ష్మి పధకం లోకి త్ తీసుకువస్తున్నట్లు సమాచారం అందుతోంది.

Leave a Comment