THE BULL Updates: గత సంవత్సర కాలంలగా సినిమాలకు బ్రేక్ ఇచ్చి సౌత్ బ్యూటీ సమంత రూత్ ప్రభు (samanatha ruth prabhu)ఆరోగ్యంపై దృష్టి పెట్టింది.
సమంతకు మయోసైటిస్(Mayositisys)అనే అరుదైన వ్యాధి సోకడంతో నటనకు టెంపరరీగా దూరం కావాల్సి వచ్చింది. ఈ సమయాన్ని తన పర్సనల్ లైఫ్ కి కేటాయించింది సమంత.
ఓ వైపు ట్రీట్మెంట్ తీసుకుంటూనే మరోవైపు అందమైన ప్రదేశాలను చుట్టుముట్టేసింది. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం కుదుటపడినట్లు తెలుస్తోంది. అందుకే మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అయ్యింది.
అయితే విజయ్ దేవరకొండ(Vijay Devarakonda)తో నటించిన ఖుషీ (Kushi) మూవీ తర్వాత సామ్ నెక్ట్స్ చేయబోయే మూవీ ఏంటా అని ఇండస్ట్రీలో గత కొంతకాలంగా టాక్ నడుస్తోంది.
కొంత మంది సామ్ పని అయిపోయిందని , ఇక సినిమాలు చేయబోదని నెట్టింట్లో జోరుగా రూమర్స్ స్ప్రెడ్ చేస్తుంటే సమంత ఫ్యాన్స్ మాత్రం ఆ రూమర్స్ ను తమదైన స్టైల్ లో తిప్పికొడుతున్నారు.
అయితే లేటెస్ట్ అప్ డేట్స్ ప్రకారం చూస్తే సమంతకు భారీ బంపర్ ఆఫర్ తగిలినట్లు తెలుస్తోంది. బాలీవుడ్ స్టార్ హీరో కండల వీరుడు సల్మాన్ ఖాన్ (Salman Khan)సినిమాలో అమ్మడు ఛాన్స్ కొట్టేసిందని తాజాగా టాక్ వినిపిస్తోంది.
Salman Khan to Romance Samantha : సల్మాన్ ఖాన్ కు జోడీగా సమంత
కోలీవుడ్ డైరెక్టర్ విష్ణువర్ధన్ (Vishnu Vardhan)డైరెక్షన్లో వస్తున్న మూవీ ‘ది బుల్’. ఈ మూవీలో సల్మాన్ ఖాన్ (Salman Khan) హీరోగా నటించనున్నారు.
ప్రముఖ బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్ (Karan Johar) ఈ మూవీని భారీ బడ్జెట్ తో ప్యాన్ ఇండియా మూవీగా తెరకెక్కించబోతున్నారు.
ఈ మధ్యనే మూవీ నుంచి విడుదలైన ఫస్ట్ లుక్, టైటిల్ రివీల్ పోస్టర్ అందరిని ఆకట్టుకుంటోంది. 2025 రంజాన్ పండగ టార్గెట్గా ఈ మూవీని రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు.
అయితే ఈ మూవీలో సల్మాన్ కు జోడీగా ఎవరిని తీసుకోవాలి అనేదానిపై మేకర్స్ ఆలోచనలో పడ్డారట. హీరోయిన్ విషయంలో పెద్ద కసరత్తే చేస్తున్నారని టాక్ వినిపిస్తోంది.
అయితే ఈ మధ్యబాలీవుడ్ లో దక్షిణాది హవా ఎక్కువగా కనిపిస్తోంది. బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ (Sharukh Khan) కూడా అట్లీ (Atlee)డైరెక్షన్ లో వచ్చిన జవాన్ (Jawaan) మూవీలో నయనతార(Nayanathara)
హీరోయిన్ గా తీసుకున్నారు. ఇప్పుటు సల్మాన్ కూడా షారుక్ బాటలోనే వెళ్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. సల్మన్ సరసన సౌత్ బ్యూటీ సమంతను సెట్ చేయాలని అనుకుంటున్నారట. దీంతో సామ్ ఫ్యాన్స్ పండుగ చేసుకుంటున్నారు.
Trisha v/s Samantha : త్రిష బ v/s సమంత
ఏజ్ పెరుగుతున్నా క్రేజ్ తగ్గని హీరోయిన్లలో త్రిష (Trisha), నయనతార (Nayanathara), సమంత (Samantha)లు ముందు వరుసలో ఉంటారు.
అందులూ ముఖ్యంగా త్రిష 40 ఏళ్ళ వయస్సులోనూ కుర్ర హీరోయిన్లకు గట్టి పోటీ ఇస్తోంది. రీసెంట్ గా హీరోయిన్ గా రీ ఎంట్రీ ఇచ్చిన త్రిష వరుసగా క్రేజీ ప్రాజెక్టులతో తన కెరీర్ లో దూసుకెళ్తోంది.
పొన్నియన్ సెల్వన్ (Ponniyan selvan) , లియో (Leo) వంటి సినిమాలు రీసెంట్ గా సూపర్ హిట్ కావడంతో త్రిష క్రేజ్ మరింతగా పెరిగిపోయింది.
దీంతో ముందుగా ది బుల్ (The Bull) లో త్రిషను తీసుకుందామని డైరెక్టర్ అనుకున్నాడట. కానీ ప్రస్తుతం త్రిష తమిళ స్టార్ హీరో అజిత్ (Ajith) మూవీతో పాటు మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi)
నటిస్తున్న విశ్వంభర మూవీలో హీరోయిన్ గా సైన్ చేసేసింది. దీంతో డేట్స్ అడ్జస్ట్ కావని డైరెక్టర్ ఆమెను సైడ్ చేసినట్లు తెలుస్తోంది. దీంతో ఈ భామకు బంపర్ ఆఫర్ చేజారినట్లైంది.
త్రిష స్థానంలో సౌత్ స్టార్ హీరోయిన్ సమంతను తీసుకోవడం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారుింది. హీరోయిన్ ఎవరనే దాని గురించి త్వరలో మేకర్స్ అధికారికంగా ప్రకటన చేయనున్నారు.
Samantha Re-entry : సమంత రీ ఎంట్రీ
కరణ్ జోహార్ ప్రొడ్యూస్ చేస్తున్న ఈ మూవీ 1988 ఆపరేషన్ కాక్టస్ కాన్సెప్ట్ తో తెరకెక్కుతోందని సమాచారం. ఫరోక్ క్యారెక్టర్ లో సల్మాన్ ఖాన్ నటిస్తుండగా, అతని భార్య క్యారెక్టర్ లో సమంత కనిపించనున్నట్లు టాక్ వినిపిస్తోంది.
ఈ మూవీలో సమంత క్యారెక్టర్ కి అత్యధిక ప్రాధాన్యత ఉంటుందని సమాచారం. అందుకే సౌత్ లో స్టార్ బ్యూటీని తీసుకోవాలని డైరెక్టర్ గట్టిగా నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.
త్రిష డేట్స్ అడ్జస్ట్ కాకపోవడంతో ఆ రేంజ్ క్రేజ్ ఉన్న హీరోయిన్ సమంతకు జై కొట్టాడని టాక్. ఇక పాన్ ఇండియన్ సినిమాగా వచ్చిన శాకుంతలం (Shakuntalam) డిజాస్టర్ గా మిగలడం,
విజయ్ దేవరకొండతో నటించిన ఖుషి (Kushi) ఎబోవ్ యావరేజ్ రిజల్ట్ రావడంతో సమంత కాస్త బ్రేక్ తీసుకుని హెల్త్ సెట్ చేసుకుంది. త్వరలో భారీ ఎత్తున కంబ్యాక్ ఇచ్చేందుకు తనను తాను సిద్ధం చేసుకుంటోంది.
హిందీలో ఇప్పటికే సమంత సిటాడెల్ (Citadel) వెబ్ సిరీస్ ఇండియన్ వెర్షన్ చేస్తున్న సంగతి తెలిసిందే. దీంతో ఈ అమ్మడు సీటాడెల్ ప్రమోషన్లతో పాటు బాలీవుడ్ కథలను కూడా వింటూ వస్తోంది.
ఈ క్రమంలో ఇప్పటికే ది బుల్ కథ సామ్ దగ్గరకు వెళ్ళందని..ఆమె కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టేనని ఇండస్ట్రీ వర్గాలు తెలుపుతున్నాయి. మరి చివరికి ఈ మూవీలో ఎవరిని హీరోయిన్ గా సెట్ చేస్తారో అనేది తెలియాలంటే మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.