Petrol Tension in Hyderabad?: హైదరాబాద్ లో పెట్రోల్ కోసం తంటాలు.

Search for petrol in Hyderabad.

Petrol Tension in Hyderabad?: కొత్తగా చట్టంలో తీసుకువస్తున్న మార్పులో భాగంగా హిట్ అండ్ రన్ కేసుకి సంబంధించి జైలు శిక్షను అమాంతం పెంచేశారు. దీంతో మహారాష్ట్ర వ్యాప్తంగా లారీ డ్రైవర్లు, ట్రక్ డ్రైవర్లు ధర్నాకి(Truck Drivers Protest) దిగారు.

అయితే ఈ ధర్నా పెట్రోల్ సరఫరా పై తీవ్ర ప్రభావాన్ని చూపించింది. అదెలాగూ అంటే లారీ డ్రైవర్లు అంతా నిరసనలకు దిగడంతో ఆయిల్ ట్యాంకర్లు, పెట్రోల్ ట్యాంకర్లు నడిపే వారు లేకపోయారు,

దీని వల్ల పెట్రోల్, డీజిల్ సప్లయ్ చేసే ట్యాంకర్లు నిలిచిపోయాయి ఈ కారణంగానే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెట్రోల్ డీజిల్ కొరత ఏర్పడింది. ఈ న్యూస్ విన్న వినియోగదారులు వాహన చోదకులు పెట్రోల్ బ్యాంకుల వద్ద పెద్ద సంఖ్యలో బారులు తీరారు( Rush At Petrol Pumps).

పెట్రోల్ బ్యాంకుకి వచ్చిన వారిలో ఎక్కువశాతం మంది ఫుల్ ట్యాంక్ చేయించుకుని వెళుతున్నారు. ఎందుకంటే వాహనాలు నిలిచిపోవడం వల్ల మరలా ఎప్పటికి ఇంధనం వస్తుందో తెలీయక ఇలా జేబులో డబ్బులు మొత్తం ఖర్చుపెట్టి ట్యాంక్ ఫుల్ చేయిస్తున్నారు.

వచ్చిన ప్రతి ఒక్కరు ట్యాంక్ ఫుల్ చేయిస్తే స్టాక్ అయిపోకుండా ఉంటుందా ? అందుకే కొన్ని పెట్రోల్ బ్యాంకుల వద్ద నో స్టాక్ బోర్డులు దర్శనమిచ్చాయి.

Also Read: ప్రజల కోసం ప్రజల్లో నుండి వస్తున్న నాయకుడు – యేలేటి సురేష్ రెడ్డి

Truck drivers who say that it will not decrease: తగ్గేదే లే అంటున్న ట్రక్ డ్రైవర్లు

72878711 Petrol Tension in Hyderabad?: హైదరాబాద్ లో పెట్రోల్ కోసం తంటాలు.

ఈ పరిస్థితి కేవలం తెలంగాణ లో మాత్రమే కాదు నాగపూర్, పూణే, నాసిక్, ముంబై థానే లో కూడా ఇదే పారిస్తాయి గోచరించింది.

సాధారణ రోజుల్లో ఒక్కో ఆయిల్ డిపో నుండి 1200 నుండి 900 ట్యాంకర్లు ఆయిల్ నింపుకుని వివిధ ప్రాంతాలకు సప్లై చేస్తుంటాయి. కానీ నిరసన కారణంగా కేవలం 250 ట్యాంకర్లు మాత్రమే నడిచినట్టు తెలుస్తోంది.

రానున్న అతికొద్ది సమయంలో ఈ 250 ట్యాంకర్లను కూడా నిలిపివేస్తామని ట్యాంకర్ల యాజమాన్యం ప్రకటించింది. ఇదే గనక జరిగితే మహారాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బ్యాంకుల్లో పెట్రోల్ డీజిల్ మొత్తం ఖాళీఅయిపోవడం ఖాయమని ప్రభుత్వాలు అంచనా వేస్తున్నాయి.

ప్రస్తుతం మహారాష్ట్ర ప్రభుత్వం(Maharashtra Government) ఆయిల్ ట్యాంకర్ల యాజమాన్యంతో చర్చలు జరిపి సమ్మె నుండి ఆయిల్ ట్యాంకర్లు మినహాయించాలని కోరాలని భావిస్తోంది.

అయితే ట్యాంకర్ల యాజమాన్యాలు మాత్రం ఆ చర్చలకు, అటువంటి షరతులకు ససేమిరా అంటున్నాయి. ఇక మరోసారి హిట్ అండ్ రన్(Hit And Run)

విషయానికి వస్తే ఈ కేసులో సవరించిన చట్టం ప్రకారం 10 లక్షల రూపాయల జరిమానా, పదేళ్ల జైలు శిక్ష విధించేలా సవరణలు తీసుకొచ్చారు. అయితే ఈ నిర్ణయం చాలా దారుణమని అంటున్నారు డ్రైవర్ సంఘాలవారు.

Leave a Comment