
Second Earthquake in Nepal : నేపాల్‌లో మరో భూకంపం ప్రజలను భయాందోళనకు గురి చేసింది.
దేశ రాజధాని ఢిల్లీలో మరోసారి భూమి కంపించింది. గడిచిన మూడు రోజులలో హస్తినకు భూకంపం రావడం ఇది రెండవసారి. దీంతో అక్కడి ప్రజలు ప్రాణాలను అరచేత పట్టుకుని బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు.
తాజాగా వచ్చిన భూకంపం తో మరో మారు ఆందోళనకు గురయ్యారు. సాయంత్రం సమయంలో భూకంపం రావడంతో ఇళ్ల నుండి బయటకు పరుగులు పెట్టారు.
ఈ భూకంపం కేవలం ఢిల్లీ లోని ఎన్ సీఆర్ లో మాత్రమే కాదు లక్నో, రీజియన్ లో కూడా భూ ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. రిక్టర్ స్కేల్ పై దీని తీవ్రత 5.6 గా నమోదైనట్టు సీస్మాలజీ సెంటర్ నిపుణుల ద్వారా తెలుస్తోంది.
ఈ భూకంపంలో ఎటువంటి ప్రాణ నష్టం వాటిల్లకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. కేవలం కొద్దీ రోజుల క్రితమే నేపాల్ లో భారీ భూకంపం సంభవించగా ఈ దఫా కూడా నేపాల్ లో భూమి కంపించింది.
అయితే గతంలో మాదిరిగా నివాసాలు నేలమట్టం కాలేదు, ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు. అంతే కాక నేపాల్ కి సమీపంలో ఉన్న హిమాలయ కౌంటీ ని కూడా ఈ భూకంప తీవ్రత తాకింది.
భూమి అంతరంలో 10 కిలోమీటర్ల లోతుల్లో భూ ప్రకంపనలు సంభవించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ పేర్కొంది.