Secunderabad railway station renovation with 715 crores : సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అభివృద్ధి కోసం ఆధునీకరణ పనులు చాలా శరవేగంగా జరుగుతున్నాయని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్పారు. ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ తరహాలో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కొత్త స్టేషన్ గ రూపుదిద్దుకుంటోందని
విలేకరుల సమావేశం లో ఆయన చెప్పారు.
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అభివృద్ది పనులు ఏ విధం గ జరుగుతున్నాయో బుధవారం కిషన్ రెడ్డి స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రయాణికులకు ఎటువంటి
అసౌకర్యం లేకుండా ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అభివృద్ది పనులు చేస్తున్నారని ఆయన చెప్పారు.
Secunderabad railway station renovation Layout:
దాదాపు 719 కోట్ల రూపాయలకు పైగా వ్యయంతో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అభివృద్ది పనులు జరుగుతున్నాయని తెలిపారు. ఇవి 2025 నవంబర్ కల్లా పనులు పూర్తి అవుతాయని ఆయన ప్రకటించారు. అదేవిధం గా చర్లపల్లి రైల్వే టెర్మినల్ పనులు కూడా చాలా శరవేగంగా కొనసాగుతున్నాయని, అది కూడా త్వరలోనే పూర్తి అవుతుందని ఆయన చెప్పారు. చర్లపల్లి టెర్మినల్ ప్రారంభోత్సవానికి ప్రధాని నరేంద్ర మోదీని ఆహ్వానిస్తామని చెప్పారు.
రీజినల్ రింగ్ పూర్తయితే ఆ ప్రాంతాల దగ్గర కూడా కొత్త రైల్వే స్టేషన్ ఏర్పాటు చేయడానికి ప్రయత్నిస్తామని చెప్పారు. ఇక్కడ 22 లిఫ్టులు 30కి పైగా ఎస్కలేటర్లు అందుబాటులోకి వస్తాయని ఆయన చెప్పారు. ప్రయాణికులు నేరుగా స్టేషన్ లోకి రావడానికి, బయటికి వెళ్ళడానికి గగనతలం నుంచే ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు నిర్మాణం జరుగు తోందని కిషన్ రెడ్డి తెలిపారు.