
Shocking Decision By Rishi Sunak : బిటన్ హోం మంత్రిపై రిషి వేటు..మాజీ ప్రధానికి ఊహించని ఆఫర్..రిషి సునాక్ నిర్ణయానికి నివ్వెరబోతున్న రాజకీయ విశ్లేషకులు..
బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ అక్కడి కాబికెట్ లో మార్పులు చేర్పులు చేస్తూ ఒక్కొక్కరికి షాక్ ఇస్తున్నాడు, మరొకొందరికి సర్ ప్రైజులు కూడా ఇస్తున్నాడు.
అయితే ఇక్కడ షాకెవరికి ఇచ్చాడు, సర్ప్రైజ్ ఎవరికీ ఇచ్చాడు అన్నది ఒక్కసారి చూద్దాం.
రిషి సునాక్ తన అధికార నివాసం 10, డౌనింగ్ స్ట్రీట్‌లో దీపావళి వేడుకలను ఘనంగా నిర్వహించుకున్నాడు. అమావాస్య మరునాడే అయన క్యాబినెట్ లో మార్పులు చేశాడు.
ప్రస్తుతం హోం మంత్రి బాధ్యతలు నిర్వస్తిస్తున్న సుయెల్లా బ్రేవర్‌మాన్ ను ఆస్థానం నుండి తప్పించాడు.
ఆ స్థానాన్ని విదేశాంగ మంత్రిగా పని చేస్తోన్న జేమ్స్ క్లెవర్లీకి అప్పజెప్పాడు. ఇక మీదట ఆదేశ హో మంత్రి పనులను జేమ్స్ క్లెవర్లీ చూసుకోనున్నారు.
అయితే మరి ఖాళీగా ఉన్న విదేశాంగ శాఖను ఎవరి రిషి చేతిలో పెడతారా అని అందరు ఆశక్తిగా ఎదురుచూస్తున్న సమయంలో, డేవిడ్ కామెరాన్ పేరును తెరపైకి తెచ్చారు రిషి.
అయితే డేవిడ్ కామెరాన్ రాజకీయాలకు పరిచయం లేని వ్యక్తి ఏమీకాదు, అయన 2010 నుండి మొదలుకొని 2016 వరకు యూకే ప్రధానిగా పనిచేశారు.
కానీ ప్రస్తుతం అయన రాజకేయాల నుండి దూరంగా ఉంటున్నారు. అటువంటి కామెరాన్ ను తీసుకొచ్చి రిషి ఇలాంటి పదవిలో కూర్చోబెట్టడం ఆశ్చర్యానికి గురిచేసింది. కానీ రిషి తీసుకున్న నిర్ణయానికి బలమైన కారణం ఉందంటున్నారు రాజకీయ విశ్లేషకులు.
కారణాలు ఏవి ఏమైనప్పటికి ఒకప్పుడు ప్రధానిగా ఉన్న కామెరాన్ మరల ఇప్పుడు రిషి క్యాబినెట్ లో మంత్రిగా ఎంట్రీ ఇవ్వడం కొసమెరుపు. కామెరాన్ కి ప్రస్తుత యుకె చట్టసభల్లో సభ్యవం లేదు, పైగా ఉన్నతమైన ప్రభుత్వ పదవుల్లోకి చట్ట సభ్యులనే తీసుకుంటారు. అయినప్పటికీ రిషి ఆయనకు చాలా కీలకమైన పదవిని కట్టబెట్టారు.
అయితే కామెరాన్ నియామకం ఎలా జరిగిందో చూద్దాం. యూకే పార్లమెంట్‌లో ది హౌస్ ఆఫ్ లార్డ్స్ అనిపిలిచే అప్పర్ ఛాంబర్ అని ఒకటి ఉంటుంది. ఇది సరిగ్గా చెప్పాలంటే మన రాజ్యసభ వంటిది.
అలాంటి ది హౌస్ ఆఫ్ లార్డ్స్ లో ఆయనకు సభ్యత్వాన్ని కల్పించి తద్వారా క్యాబినెట్ లోనికి ఆయనను తీసుకురానున్నారు. అయితే ఇది మొదటి సారి చేస్తున్న పని కాదు, 1980 లో కూడా అక్కడ ఇటువంటి ఇతివృత్తం చోటుచేసుకుంది.
పీటర్ క్యారింగ్టన్ హౌస్ ఆఫ్ కామన్స్ కాకుండా పెద్దల సభ ద్వారా ఎన్నికై విదేశాంగ మంత్రిగా పని చేశారు. మార్గరేట్ థాచర్ ప్రధానిగా ఉన్న సమయంలో ఇది చోటుచేసుకుంది.
ప్రధానంగా చుస్తే రిషి ఈ నిర్ణయం తీసుకోవడానికి వెనుక కారణం ఒక్కటే, ఉక్రెయిన్ యుద్ధం, పశ్చిమాసియాలో సంక్షోభ పరిస్థితుల కారణంగా బ్రిటన్ అంతర్జాతీయంగా సవాళ్లును ఎదుర్కొంటోంది. ఇలాంటి పరిస్థితుల్లో విదేశాంగ శాఖ బాధ్యతలు నిర్వర్తించే వ్యక్తి చాల అనుభవం కలిగిన వాడై ఉండాలి.
అందుకే ఆరేళ్ళ పాటు ప్రధానిగా పనిచేసిన కామెరాన్ అయితే సమర్థుడని రిషి భావించాడు. కామెరాన్ కేవలం ప్రధానిగానే కాక 11 ఏళ్ళ పటు కన్జర్వేటివ్ పార్టీ లీడర్‌గా వ్యవహరించాడు కూడా. అయితే ఒకప్పుడు ప్రధానిగా ఉన్న కామెరాన్ తీసుకున్న ఒక నిర్ణయాన్ని రిషి వ్యతిరేకించాడు.
యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ వైదలగొద్దని డేవిడ్ కామెరాన్ భావించాడు, కానీ 2016లో నిర్వహించిన రెఫరెండంలో ప్రజలు అందుకు వ్యతిరేకంగా వాణి వినిపించారు. అలా వ్యతిరేక వాణి వినిపించిన వారిలో రిషి అగ్రగణ్యుడు.