Shubman Gill got special Award: కోహ్లీ రికార్డ్ బ్రేక్ చేసిన గిల్ – అరుదైన అవార్డు సొంతం

Shubman Gill

Shubman Gill: హైదరాబాద్(Hyderabad) మహానగరంలో బీసీసీఐ(BCCI) అవార్డుల వేడుకను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం భాగ్యనగరంలో మూడేళ్ళ తరవాత నిర్వహించబడింది.

ఈ అవార్డుల వేడుకలో యువ క్రికెటర్ శుభ్ మన్ గిల్(Shubman Gill) సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచాడు. ఉత్తమ అంతర్జాతీయ క్రికెటర్‌గా శుభ్ మన్ గిల్ పాలి ఉమ్రిగర్‌(Pali Umrigar) అవార్డును సొంతం చేసుకున్నాడు. ఒకే క్యాలండర్ ఇయర్‌లో ఎక్కువ రన్స్ సాధించిన ప్లేయర్ గా హిస్టరీ క్రియేట్ చేశాడు ఈ మోస్ట్ గ్లామరస్ క్రికెటర్.

కెప్టెన్ ఈ అతగాడికి ఓపెనర్ గా బరిలోకి దిగే అవకాశం ఇచ్చిన ప్రతి సారి అద్భుతమైన ఆట తీరును ప్రదర్శించాడు. భారత్ జట్టుకి(Indian Criket Team) మరచిపోలేని విజయాలను అందించాడు ఈ యువఆటగాడు. అందుకే బీసీసీఐ 2022 – 2023 సంవత్సరం పాలి ఉమ్రిగర్‌ అవార్డుకి గిల్ ను ఎంపిక చేసింది.

8 ఏళ్ళ తరవాత గిల్ వేరు : Shubman Gill Is Completly Different After 8Years

Shubman Gill

ఈ సందర్భంగా శుభ్ మన్ గిల్ గతాన్ని గుర్తుచేసుకున్నాడు. తనకు 14 ఏళ్ళ వయసున్నప్పుడు బీసీసీఐ అవార్డ్స్ ఫంక్షన్ కి వచ్చానని చెప్పాడు.

సరిగ్గా 8 సంవత్సరాల క్రితం అవార్డుల వేడుకలో విరాట్ కోహ్లీ(Virat Kohli) తో కలిసి దిగిన ఫోటోను కూడా నెటిజన్లతో సోషల్ మీడియాలో పంచుకున్నాడు. ఆ వేడుకలో తాను లెజండరీ ప్లేయర్స్ ను, తన ఫెవరెట్ ప్లేయర్స్ ను, అలాగే తనకి ఇన్స్పిరేషన్ ఇచ్చిన ప్లేయర్స్ ను కూడా కలుసుకున్నని అన్నాడు.

ఇక ఆ సంవత్సరం వేడుకల్లో ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ గా విరాట్ కోహ్లీ అవార్డు ను ఆదుకున్నడట, విరాట్ ను ప్రేరణగా తీసుకున్న తాను ఈ స్థాయికి వచ్చానని వెల్లడించాడు. తాను ఈ స్థాయికి రావడానికి ఒక్కో మెట్టు ఎక్కుతూ ఎంతో కష్టపడి వచ్చానని అన్నాడు. ఇక ముందు కూడా ఇండియన్ టీమ్ కోసం మరింత కష్టపడి ఆడేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తానని చెప్పాడు.

అత్యధిక పరుగులు సాధించింది ఎవరంటే : Who Made Highest Runs

భారత దేశం తరుపున అత్యధిక వన్డే పరుగులు ఒకే కాలెండర్ ఇయర్ లో సాధించిన రికార్డు మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్(Sachin Tendulkar) పేరిట ఉంది. 1998 వ సంవత్సరంలో సచిన్ ఏకంగా 1894 పరుగులు సాధించారు. ఇప్పటికి ఆ రికార్డు పదిలంగానే ఉంది.

1999 లో సౌరవ్ గంగూలీ(Sourav Ganguli) 1767 రన్స్ చేశాడు. ది వాల్ గా పేరు గాంచిన రాహుల్ ద్రావిడ్(Rahul Dravid) 1761 పరుగులు సాధించాడు. రోహిత్ శర్మ(Rohith Sharma) 1490 పరుగులు చేసి 5వ స్థానం లో ఉండగా విరాట్ 1460 పరుగులతో ఆరవ స్థానంలో నిలిచాడు.

ఇప్పుడు శుభ్ మన్ గిల్ చుస్తే 1500 పరుగులు చేసి విరాట్ కోహ్లీ రోహిత్ శర్మల రికార్డులను బ్రేక్ చేశాడు. మొత్తానికి విరాట్ కోహ్లీ అంటే ఇష్టం, అతడే నా ప్రేరణ అంటూనే అతని రికార్డునే బద్దలు కొట్టాడు గిల్.

Leave a Comment