Song on Millets featuring PM Modi gets nominated for Grammy: గ్రామీ అవార్డుల నామినేషన్ కు ‘అబండెన్స్ ఇన్ మిల్లెట్స్’.మోదీ పాట పాడితే ఎలా ఉంటుందో తెలుసా.
‘అబండెన్స్ ఇన్ మిల్లెట్స్’ ఇది తృణధాన్యాల మీద రాసి పాడిన పాట. ఈ పాటకి అంతటి ప్రాధాన్యత ఏముంది అనుకుంటున్నారా ? ఈ పాటను మన దేశ ప్రధాని నరేంద్ర మోదీ, ఫాలు, గౌరవ్ షాతో లతో కలిసి ఆలపించారు.
అయితే మోదీ పూర్తి స్థాయిలో పాట మాత్రం పాడలేదని చెప్పాలి. ఫాలు, గౌరవ్ లు పాడిన పాటలో అయన మాటలు వినిపిస్తాయి. అవి చాలా విలువైన మాటలు. తృణధాన్యాల ఆవశ్యకతను వివరించే మాటలు.
ఈ ఏడాది మార్చి నెలలో గ్లోబల్ మిల్లెట్స్ కాన్ఫరెన్స్‌ను ప్రారంభించిన సందర్భంగా మోదీ చేసిన ప్రసంగంలోని కొన్ని మాటలను ఈ పాటలో ఉపయోగించారు.
ఇక ఈ గీతాన్ని 2023 జూన్ 16వ తేదీన విడుదల చేశారు. ఈ పాటకు చక్కని స్పందన లభిస్తోంది. అయితే ఇప్పుడు ఈ పాట బెస్ట్ గ్లోబల్ మ్యూజిక్ పెర్ఫార్మెన్స్ కేటగిరీ కింద 2024 గ్రామీ అవార్డులకు నామినేట్ అయింది.
ఇక ఈ పాటను ఆలపించిన ఫాలు గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. అంతర్జాతీయ మిల్లెట్స్ సంవత్సరాన్ని పురస్కరించుకుని ఈ పాటను సిద్ధం చేశామని ఆమె అన్నారు.
అయితే ఈ పాట రాసిన సందర్భాన్ని కూడా ఆమె వివరించారు. కలర్‌ఫుల్ వరల్డ్ కోసం ఆమె చిల్డ్రన్స్ ఆల్బమ్ ను రూపోందించారు. అందుకు గాను ఆమెకు 2022లో గ్రామీ అవార్డు లభించింది. అవార్డు అందుకున్న ఆమె ప్రధాని మోదీని కలిసేందుకు వెళ్లారు.
ఆ సమయంలోనే మిల్లెట్ గింజలపై ఒక పాటను కంపోజ్ చేయాలనే ఆలోచనకు బీజం పడిందన్నారు. తృణ ధాన్యాలపై పాట గనుక రాస్తే అందులో ప్రధానిని కూడా భాగం చేయాలని వారు అనుకున్నారట.
అందుకు మోదీ ఒప్పుకున్నప్పటికీ ఆయనతో కూర్చుని పాట రాసేందుకు కొద్దిగా జంకినట్టు చెప్పారు. కానీ అయన అందించిన ప్రోత్సాహంతోనే పాటను పూర్తి చేయగలిగినట్టు ఆమె చెప్పుకొచ్చారు.