Breaking News

Tamilnadu brutal road Accident: తమిళనాడులో రోడ్డు ప్రమాదం.ఎదురెదురుగా ఢీకొన్న రెండు బస్సులు.

Add a heading 6 Tamilnadu brutal road Accident: తమిళనాడులో రోడ్డు ప్రమాదం.ఎదురెదురుగా ఢీకొన్న రెండు బస్సులు.

Tamilnadu brutal road Accident: తమిళనాడులో రోడ్డు ప్రమాదం.ఎదురెదురుగా ఢీకొన్న రెండు బస్సులు.

తమిళనాడు తిరువత్తూర్ జిల్లా వానియంబాడి వద్ద హైవే పై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ బస్ ఆక్సిడెంట్ చూసిన వారంతా ఎంగేయుమ్ ఎప్పోదుం, అంటే తెలుగులో వచ్చిన జర్నీ అనే సినిమాలో జరిగిన ప్రమాదం లానే ఉందని అంటున్నారు.

ఆ సినిమాలో మాదిరిగానే రెండు బస్సులు ఒకదానిని ఒకటి ఎదురెదురుగా వచ్చి ఢీకొన్నాయి. ఈ ఘటన చూపారులనే కలచివేసిందంటే ప్రమాద తీవ్రత ఎలా ఉండి ఉంటుంది అన్నది అర్ధం చేసుకోవచ్చు.

ప్రమాదం స్థలంలోనే ఐదుగురు కన్ను మూశారు. బస్సులో ప్రయాణిస్తున్న వారిలో 60 మంది తీవ్ర గాయాలపాలయ్యారు. వారిలో ఎక్కువ మంది పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది.

ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు వెంటనే రంగంలోకి దిగిపోయారు . హుటాహుటిన ప్రమాద స్థలికి చేరుకున్నారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీపంలో ఉన్న ఆస్పత్రులకు అంబులెన్సుల్లో తరలించారు.

ఇక మరణించిన వారి మృతదేహాలను ప్రభుత్వ ఆసుపత్రిలోని మార్చరీకి పంపించారు. బస్సులు రెండు కూడా ప్రమాదకరమైన మూల మలుపు వద్ద కూడా వేగాన్ని తగ్గించకపోవడం తో ప్రమాద తీవ్రత మరీ దారుణంగా ఉందని తెలుస్తోంది.

ఇక బస్సులో ఉన్న ప్రయాణికుల మాటలను బట్టి చూస్తే, రెండు బస్సుల డ్రైవర్లు కూడా బస్సు బయలుదేరిన కొద్దిసేపటికే అతి వేగాన్ని పుంజుకున్నట్టు తెలుస్తోంది.

మితిమీరిన వేగం కూడదని, వేగాన్ని తగ్గించాలని ప్రయాణికులు కోరినప్పటికీ వారు ఏమాత్రం పట్టించుకోలేదని చెబుతున్నారు. డ్రైవర్ల నిర్లక్ష్య ధోరణే ఈ ప్రమాదానికి కారణమని అంటున్నారు.

మరో ముఖ్య మైన విషయం ఏమిటంటే ఈ ప్రమాదం జరిగిన సమయంలో మొదట ప్రాణాలు కోల్పోయింది రెండు బస్సులు నడుపుతున్న డ్రైవర్లే. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *