AbhayaHastam : గృహలక్ష్మి రద్దు చేసి అభయహస్తం ఇస్తున్న కాంగ్రెస్ సొంత ఇల్లు అనేది ప్రతి ఒక్కరి కల, తినడానికి కాస్తంత తిండి, కాళ్ళు ముడుచుకుని పడుకునేందుకు గూడు ఉంటె చాలు అనుకునే పేదవారి
సొంత ఇంటి కలను సాకారం చేస్తామంటూ అనేక రాజకీయ పార్టీలు అనేక విధి విధానాలు ప్రవేశ పెడుతూ ఉంటాయి. కొన్ని సమయాల్లో గత ప్రభుత్వాలు తీసుకొచ్చిన విధానాలను కొత్తగా వచ్చిన ప్రభుత్వాలు రద్దు చేస్తుంటాయి.
అయితే ఇలా రద్దు చేయడం వల్ల లబ్దిదారులకు నష్టం కలుగకుండా లాభం కలిగితే అదే పదివేలు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రం(Telangana State) లో కూడా ఇటువంటి పరిణామమే చోటుచేసుకుంది.
పేదవారికి సొంత స్థలం ఉన్నవారికి ఇల్లు కట్టుకునేందుకు గత బి.ఆర్.ఎస్(BRS) ప్రభుత్వం గృహలక్ష్మి పధకం(Gruhalakshmi Scheme) కింద మూడు లక్షల రూపాయలు మంజూరు చేసింది.
అందుకు సంబంధించి అధికారులు లబ్దిదారులకు పత్రాలు కూడా గత సంవత్సరం అంటే 2023 జూన్ నెలలో జారీ చేశారు.
Also Read: ప్రజల కోసం ప్రజల్లో నుండి వస్తున్న నాయకుడు – యేలేటి సురేష్ రెడ్డి
అభయహస్తం కింద ఐదు లక్షలు : ₹5lakhs Under Abhayahastam Scheme
అయితే తెలంగాణ రాష్ట్రంలో అధికారం చేపట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Govt) గృహ లక్ష్మి పధకాన్ని రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. అయితే గృహలక్ష్మి పధకానికి బదులుగా అభయహస్తం(Abhayahastam) పధకాన్ని తీసుకొస్తున్నట్టు అనౌన్స్ చేసింది.
ఈ పధకం గృహలక్ష్మి కన్నా మెరుగైంది అంటున్నాయి కాంగ్రెస్ శ్రేణులు. ఈ పధకం ద్వారా లబ్దిదారులకు ఐదు లక్షల రూపాయల వరకు ఆర్ధిక సహాయం కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తుందని.
అందుకే పాత పత్రాలు ఏవైతే ఇప్పటివరకు అధికారులు లబ్దిదారులకు జారీ చేశారో వాటన్నిటిని రద్దు చేసినట్టు చెబుతున్నారు.
ఇకమీదట ఇంటి నిర్మాణం కోసం ఎవరైతే అర్జీ పెట్టుకుంటారో వారికి ఐదు లక్షల(₹5Lakhs) రూపాయల చొప్పున ఈ అభయహస్తం కింద లబ్ది చేకూరుతుందని అంటున్నారు.
అందుకే గతంలో గృహలక్ష్మి పధకం కోసం జారీ చేసిన జీవోను సైతం రద్దు చేసినట్టు తెలుస్తోంది. ఈ అభయహస్తం క్రింద ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో(Assembly Constituency)
మూడు వేల చొప్పున రాష్ట్రం మొత్తం మీద నాలుగు లక్షల ఇళ్ల నిర్మాణం కోసం నిధులు మంజూరు చేసేలా కాంగ్రెస్ సర్కార్ టార్గెట్ పెట్టుకున్నారు తెలుస్తోంది.
బి.ఆర్.ఎస్ 12 లక్షల ఇల్లు మంజూరు చేసింది : BRS Granted 12 Lakhs Houses
గతంలో గృహలక్ష్మి పధకం కోసం 15 లక్షల దరఖాస్తులు రాగా 12 లక్షల దరఖాస్తులను అర్హత కలిగిన దారఖాస్తులుగా తేల్చారు.
ఇక అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇళ్ల నిర్మాణం కోసం ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం కోసం చేయూతను అందిస్తామని హామి ఇచ్చింది, ఇచ్చిన హామీ మేరకు ఇప్పుడు ఈ నిర్ణయం తీసుకున్నారు.
సొంత స్థలం ఉన్న పెదలకు ఇల్లు నిర్మించుకునేందుకు 5 లక్షల రూపాయల సహాయం అందిస్తున్నారు. అయితే స్థలం లేనివారిని స్థలంతోపాటు ఐదు లక్షల రూపాయల ఆర్ధిక సహాయం చేస్తామని కూడా అప్పట్లో హామీ ఇచ్చింది కాంగ్రెస్.