UI Movie Teaser: ఉపేంద్ర సినిమా యూఐ టీజర్ ఇది వేరే లెవెల్ అంటున్న ఫాన్స్.

UI Teaser This is another level fans.

UI Movie Teaser: కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర(Upendra), ఈ హీరో ఓ సినిమా చేస్తున్నాడు అంటేనే దానిపై హైప్ క్రియేట్ అవుతుంది. ఎలాంటి కథతో ఉపేంద్ర సినిమాను తీయబోతున్నాడా అనే ఆశక్తి ప్రతి ఒక్కరిలో మొదలవుతుంది.

అందుకు ఉదాహరనగానే నిలుస్తాయి అయన నటించిన గత చిత్రాలు. అయితే ఈమధ్యకాలంలో ఉపేంద్ర నుండి సినిమా వచ్చి దాదాపు ఏడు సంవత్సరాలు దాటి పోతోంది.

అయితే తాజాగా ఉపేంద్ర స్వీయ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న సినిమా యూఐ(U I). ఈ సినిమాను మనోహరం శ్రీకాంత్(Manoharam Srikanth), కేపీ(KP) సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

రేష్మ నానయ్య(Reshma Naanayya) ఈ సినిమాలో ఉపేంద్ర సరసన నాయికగా నటిస్తోంది. 2023 సెప్టెంబర్ నెలలో ఈ సినిమాకి సంబంధించిన పోస్టర్(Poster)

విడుదల కాగా అప్పట్లో ఆ పోస్టర్ ఉపేంద్ర ఫాన్స్ లో క్యూరియాసిటీ క్రియేట్ చేసింది. ఇక తాజాగా జనవరి 8వ తేదీన విడుదలైన ఫస్ట్ లుక్ టీజర్(First Look Teaser) సినిమా పై హైప్స్ ను తారాస్థాయికి తీసుకెళ్లింది.

Also read: Gunturkaaram Trailer: గుంటూరు కారం ట్రైలర్ అదుర్స్.

100 కోట్ల బడ్జెట్ సినిమా : 100 Crores Budget Movie

ఈ ఫస్ట్ లుక్ టీజర్ చూసినవారంతా ఆశ్చర్యానికి గురవుతున్నారు. ఈ టీజర్ మనల్ని ఒక కొత్త ప్రపంచానికి తీసుకువెళుతుందని అంటున్నారు(UI Movie Teaser). ఈ టీజర్ ఒక వాయిస్ తో మొదలవుతుంది.

టీజర్ లోని విజువల్స్ అదిరిపోయాయి అని చెబుతున్నారు. టీజర్ లోని స్పెషల్ ఎఫెక్ట్ లు(Special Effects), స్టంట్స్(Stunts) ఫైట్లు(Fights) నెక్స్ట్ లెవెల్ లో ఉన్నాయని అంటున్నారు.

images 2024 01 08T165041.964 UI Movie Teaser: ఉపేంద్ర సినిమా యూఐ టీజర్ ఇది వేరే లెవెల్ అంటున్న ఫాన్స్.

అన్నిటికి మించి టీజర్ చివర్లో ఉపేంద్ర ఎంట్రీ చాలా గ్రాండ్ గా త్రిల్లింగ్ గా ఉందని చెబుతున్నారు. ఇక ఈ సినిమాను దాదాపు 100 కోట్ల(₹100 crores) బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు(UI Movie Teaser).

ఇక ఉపేంద్ర కి ఉన్న మార్కెట్ ను బట్టి చుస్తే అయన సినిమా వంద కోట్లను చాలా తేలికగా రాబట్టుకుంటుంది అని అంటున్నాయి ట్రేడ్ వర్గాలు.

ఉపేంద్ర తన సినిమాల ద్వారా కేవలం కన్నడ(Kannada) లో మాత్రమే కాకుండా తెలుగులో కూడా మంచి ఫ్యాన్ బేస్ ను క్రియేట్ చేసుకున్నాడు.

కన్నడ డబ్బింగ్ సినిమాలతోనే కాకుండా స్ట్రెయిట్ తెలుగు నినిమాల్లో కూడా నటించి తెలుగు వారికి మరింత చేరువయ్యాడు. ఏ..(A), ఉపేంద్ర(Upendra), రక్త కన్నీరు(Rakta kanneeru), కన్యాదానం(kanya Danam), సన్ ఆఫ్ సత్యమూర్తి(S/O Satyamurty) వంటి సినిమాలను చెప్పుకోవచ్చు.

Leave a Comment