Modi Launching Vande Bharath Express: ‘వందే భారత్’​ ఎక్స్​ప్రెస్​..ప్రారంభించిన మోదీ.

'Vande Bharat' Express.. started by Modi

Modi Launching Vande Bharath Express: ‘వందే భారత్’​ ఎక్స్​ప్రెస్​.. ప్రారంభించిన మోదీ.

ప్రస్తుతం భారత దేశంలో వందే భారత్ రైళ్ల(Vande Bharath Express) పరుగులు క్రమంగా పెరుగుతున్నాయి. వేగవంతమైన ప్రయాణం కోసం దేశ ప్రజలు కూడా ఈ వందే భారత్ వైపు మొగ్గు చూపుతున్నారు.

ఈ క్రమం లోనే కేంద్ర ప్రభుత్వం కూడా సాదమైనంత మేర వందే భారత్ రైళ్ల సంఖ్యను పెంచడానికే మొగ్గుచూపుతోంది.

ఈ విషయంలో ఒకో డుగు ముందుకేసి బీజేపీ సర్కారు డిసెంబర్ 30 వ తేదీన ఒకే సారి ఒకే రోజు ఆరు వందే భారత్ రైళ్లను ప్రారంభించనుంది.

ఈ రైళ్ళకి దేశ ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) పచ్చ జండా ఊపి ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమానికి రామజన్మభూమి అయిన అయోధ్య వేదిక కానుంది.

అమృత్ భారత్ ఎక్స్ ప్రెస్ లు కూడా : Amrith Bharat Express Trains Are Going To Launch

ప్రస్తుతం కొత్తగా వస్తున్న వందే భారత్ ఎక్స్ ప్రెస్ లు శ్రీమాతా వైష్ణో దేవి కట్రా-న్యూఢిల్లీ, అమృత్ సర్- ఢిల్లీ, కోయంబత్తూర్-బెంగళూర్, మంగళూరు-మడ్ గాం, జాల్నా-ముంబయి,

అయోధ్య -ఆనంద్ విహార్ టెర్మినల్ రూట్లలో ప్రయాణం చేస్తాయి. ఈ రైళ్లను పీఎం మోదీ అయోధ్య రైల్వే స్టేషన్ నుండి వర్చువల్ గా ప్రారంభిస్తారని అధికార యంత్రాంగం ద్వారా తెలుస్తోంది.

కేవలం వందే భారత్ రైళ్లు మాత్రమే కాదు, రెండు అమృత్ భారత్ రైళ్ళను కూడా మోడీ ప్రారంభిస్తారు. ఈ అమృత్ భారత్ రైళ్లు వలస కూలీలా కోసం నడపబడే రైళ్లుగా చెబుతున్నారు.

పైగా వాటిలో ఒక రైలు మన ఆంధ్ర ప్రదేశ్(Andhra Pradesh) లోని కొన్ని ప్రాంతాలను టచ్ చేస్తూ వెళుతుంది. ఇక ఈ అమృత్ భారత్ రైళ్లు ఎక్కడి నుండి ఎక్కడకి ప్రయాణం చేస్తాయంటే,

దర్భాంగా (Darbhanga) -అయోధ్య (Ayodhya) -ఆనంద్ విహార్ టెర్మినల్(Anand Vihari Terminal) మధ్య, అలాగే మాల్దా టౌన్ నుండి మొదలై బెంగళూరులోని సర్ ఎం విశ్వేశ్వరాయ టెర్మినస్ మధ్య ప్రయాణం చేస్తాయి. ఈ రెండు రైళ్లను కూడా మోదీ తన చేతుల మీదుగానే ప్రారంభిస్తారు.

అయోధ్య స్టేషన్ ను మోదీ ప్రారంభిస్తారు : PM Modi Inaugurates Ayodhya Railway Station

ఈ రైళ్ల విషయం కాస్త పక్కన పెడితే 2024 జనవరి నెలలో అయోధ్య రామాలయం లో ఆధ్యాత్మిక వేడుకలు ఆకాశాన్ని అంటనున్నాయి.

కేవలం ప్రజల సౌకర్యాల నిమిత్తం అయోధ్యలో 11,100 కోట్ల రూపాయలను ఖర్చు చేస్తోంది కేంద్రం. అంతే కాదు 2180కోట్ల రూపాయల వ్యయంతో గ్రీన్ ఫీల్డ్ పనులు చేపట్టనున్నారు, ఈ కార్యక్రమాలకు మోదీ శంకుస్థాపన చేస్తారు.

ఇక అయోధ్య లో రైల్వే స్టేషన్ ను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు, పైగా అయోధ్య రైల్వే స్టేషన పేరును కూడా అయోధ్య ధామ్ జంక్షన్ గా మార్చారు.

ఈ స్టేషన్ లో నిర్మించిన మూడంతస్తుల భవనాన్ని కూడా మోదీ తన సువర్ణ హస్తాలతో ప్రారంభిస్తారు. ఈ స్టేషన్ ను ఆధునీకరించడానికి ఏకంగా 240 కోట్ల రూపాయలను కేంద్ర సర్కారు ఖర్చు చేసింది.

Leave a Comment